యోగాంధ్ర.. ఒక ప్రపంచ రికార్డు

by Ravi |   (  Updated:2025-06-21 01:15:47  IST  )

యోగా ప్రాధాన్యతను ఎంతో ముందు గుర్తించిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో సీఎం చంద్రబాబు ఒకరు.. ఆరోగ్యానికి దివ్య ఔష‌ధం

యోగాంధ్ర.. ఒక ప్రపంచ రికార్డు
X

యోగా ప్రాధాన్యతను ఎంతో ముందు గుర్తించిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో సీఎం చంద్రబాబు ఒకరు.. ఆరోగ్యానికి దివ్య ఔష‌ధం అయిన యోగాని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవ‌న మార్గంలో యోగా అభ్య‌స‌నాన్ని భాగం చేసుకోవాల‌న్న‌దే సీఎం ఆకాంక్ష‌. యోగాంధ్ర- 2025ను ఆచరించేలా విశ్వవ్యాప్తం చేసి ప్రపంచ ప్రజలు సుఖ, సంతోషాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు మంచి ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి సియం చంద్రబాబు ఒక బృహత్తర యజ్ఞాన్ని చేపట్టారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు 1987లో యోగాకి గుర్తింపు ఇస్తూ 25 ఆఫ్ 1987 చట్టంలో ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్‌ను స్థాపించారు. ఆ పరిషత్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు 1999లో ఒక మాస్టర్ ప్లాన్‌కి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలనే ధృడ సంకల్పంతో ఆయన నేడు జరుగుతున్న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ కార్యక్రమాన్ని గ్లోబల్ రికార్డు నెలకొల్పే విధంగా ఒక ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహిస్తున్నారు..

చరిత్రకెక్కనున్న విశాఖ యోగా..

నేడు విశాఖలో ఆర్‌.కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో 247 కంపార్ట్ మెంట్‌లలో 5 లక్షల మందితో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించను న్నది. రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వే శించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేపట్టింది ప్ర‌భుత్వం. ప్రస్తుత బిజీ జీవితంలో మనకు మనపై నియంత్రణ కలిగి, ప్రశాంతతో, ఏకాగ్రతతో, శారీరక, మానసిక ప్రశాంతతో అందరూ యోగాను అనుసరించి. ప్రభుత్వం చేపడుతున్న యోగా కార్యక్రమం వల్ల యోగాంధ్రగా రాష్ట్రానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశముంది.

177 దేశాల్లో యోగానుబంధం..

నేడు మానవుడి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, మానసిక ఆందోళనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అంతర్గత శాంతికి, శారీరక ఆరోగ్యానికి యోగా ఒక దివ్యౌషధంగా నిలుస్తోంది. ప్రాచీన భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వంగా ఆవిర్భవించిన యోగా, నేడు ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు పైగా మిలియన్ల మంది జీవితాల్లో విడదీయరాని బంధంగా మారింది. విశాఖలో నేడు జరుగుతున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ హాజరవుతున్నారు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపే ఆలోచనను భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించగా, 2014 డిసెంబర్‌లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 177 దేశాల మద్దతుతో జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది.

40 దేశాల ప్రతినిధులు..

ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు 2015 జూన్ 21 నుంచి ప్రతి ఏటా ప్రభుత్వ ప్రమేయంతో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేయడం ప్రారంభమైంది. ఇది భారత దేశానికి గర్వకారణం. విశాఖలో జరిగే యోగా కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.. యోగా కేవలం ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది ఒక జీవన విధానం. యోగా ప్రాచీన భారత దేశంలో ఏర్పడిన ఒక జీవన విధానం. ప్రపంచంలోని అనేక దేశాల్లో యోగా శిబిరాలు, ప్రజా కార్యక్రమాలు, స్కూల్స్‌, యూనివర్సిటీలు, ప్రభుత్వ స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఆరోగ్యానికి మార్గదర్శిని

యోగా ద్వారా భారతదేశం తన సాంస్కృతిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక ప్రత్యేకమైన అవకాశంగా నిలుస్తోంది. మన పూర్వీకులు అనుసరించిన ఈ అమూల్యమైన పద్ధతిని మనం జీవితంలో అమలు చేస్తే, శారీరకంగా, మానసికంగా సమతుల్యం సాధించవచ్చు. ఆరోగ్యానికి మార్గదర్శిని అయిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచం నేడు భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. మనం దానిని పాటించడమే దేశానికి గౌరవం, మనకు ఆరోగ్యం.

రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశం..

రైతులు, విద్యార్థులు, కార్మికులు ఇలా ప్ర‌తి వ‌ర్గాన్ని యోగాం ధ్ర‌లో భాగం చేసే ల‌క్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వేశించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ కార్య‌క్ర‌ మాలు చేపట్టారు.. ఒత్తిడి నుండి విముక్తి పొందాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుంది. యోగా సాధనలో మానసిక సమస్యలు, శారీరక రుగ్మత నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే ప్రజలకు యోగాపై అవగాహన కలిగించి అందరూ ప్రతి రోజూ యోగా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకునే విధంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం..

పాఠశాల విద్యలో యోగా..

ఆంధ్రప్రదేశ్‌లో యోగా అభివృద్ధి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో అనేక యోగా శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాల విద్యలో యోగాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. విశాఖ లో అంతర్జాతీయ యోగా శిక్షణా శిబిరాలు, స్థానిక సంస్థలు ప్రజలలో యోగాపై అవగాహన పెంచుతున్నాయి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఇది ఒక దివ్యమైన మార్గం. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించాలంటే యోగా ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ దీన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.

(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం)

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story