నవ తెలంగాణ సాధన కోసమే యాత్ర

by Disha edit |
నవ తెలంగాణ సాధన కోసమే యాత్ర
X

అర ఎకరం పేద రైతు నుంచి, కోట్లకు పడగెత్తిన వందల ఎకరాల భూస్వామి వరకు ఇచ్చే రైతుబంధు వలన ఎవరికి మేలు జరుగుతోంది? కేజీ టు పీజీ విద్య పురిటిలోనే చచ్చిపోయింది. ఊళ్లలో బడులు పాడుబడ్డాయి. ఇంటికో ఉద్యోగం అని చెప్తే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగి గుండె మండిపోతోంది. డబుల్‌ బెడ్రూం ఇల్లు వస్తదని చెప్తే గంపెడాశలు పెట్టుకున్న తల్లి కడుపు తరుక్కుపోతోంది. దళిత ముఖ్యమంత్రి లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, దళితులందరికీ దళితబంధు ఇవ్వడానికి ప్రణాళిక లేదు. పోడు భూములకు పట్టా ఇవ్వకుండా పోలీసులకు అప్పగిస్తున్నారు. సామాన్యుల డబ్బునంతా కార్పొరేట్‌ విద్యాలయాలు, ఆస్పత్రులకు దోచిపెడుతున్నారు.

తెలంగాణ నలుదిక్కులా నిరాశ మేఘాలు కమ్ముకున్నాయి. రచ్చబండ నుండి రాజధాని దాకా ఎక్కడ చూసినా అందరి మాటా ఒక్కటే. 'తెలంగాణ రాకముందు అనుకున్నది ఒక్కటి, తెలంగాణ వచ్చాక అయిందొకటి' అని. 'ఎటు వెళ్తామని కలలు కంటే, ఎటు వెళ్తున్నాం?' అనే సందేహాలు వెంటాడుతున్నాయి. అందుకే గాడి తప్పిన గడీల పాలనను కూల్చేందుకు ఉద్యమ ఆకాంక్షల తెలంగాణను పునర్నిర్మించేందుకు ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, మేధావులు, దళిత బహుజనులు ఇలా తెలంగాణ సమాజమంతా ప్రజా సంగ్రామ యాత్రలో అడుగు కలిపి రాబోయే సమరానికి సైనికులై కదులుతున్నారు.

రైతు కంట నీరు, నిరుద్యోగి కంట నీరు, దళిత, బహుజనుల కంట నీరు. తెలంగాణ గురించి ఎవ్వరినీ అడిగినా ఏమున్నది గర్వకారణం? అనే ప్రశ్న ఎదురవుతోంది. అంతకు ముందుకు, ఇప్పటికీ ఏం మారింది? ఊక దంపుడు మాటలు, పై మెరుగుల పటాటోపాలే తప్ప గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బడుగు బలహీనవర్గాల జీవితాలు ఎందుకు బాగుపడలేదు? ఈ ప్రశ్నల సమాధానాన్ని రాష్ట్ర సర్కారుకు చూపించడానికి, క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికే ఈ యాత్ర.

ఏం మారింది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల బతుకులలో మార్పులు వస్తాయని కోటి ఆశలతో ఎదురుచూశారు. ప్రజల ఆశలు, యువత ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలు అమలుకు నోచుకోలేదు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు, కోట్ల రూపాయలకు పడగలెత్తడమే మార్పు తప్ప తెలంగాణ అభివృద్ధిలో మార్పులేదు. నిరుద్యోగంలో మార్పులేదు. దళితుల జీవితాలలో, గ్రామీణాభివృద్ధి, గిరిజన, బడుగు, బలహీనవర్గాలలో మార్పు రాలేదు. వారి జీవితాలు 'ఎక్కడ వేసిన గొంగళి' అక్కడే అన్న చందంగా ఉన్నాయి.

అవినీతి, అరాచకత్వం రాజ్యం ఏలుతున్నాయి. ప్రాజెక్టుల పనులలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగింది. ప్రజల శ్రేయస్సును గాలికొదిలేసి, ధనార్జన ధ్యేయంగా కేసీఆర్‌ పాలన సాగుతోంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నకిలీ విత్తనాల గొడవ పోలేదు. ఉచిత ఎరువులు రాలేదు. అప్పులు మాఫీ కాలేదు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. మార్కెట్లు మెరుగుపడలేదు. పంటకు మద్దతు ధర రాలేదు. వరికి ఉరి తాళ్లు పేనుతున్నారు. కౌలు రైతు ఆత్మహత్యలు ఆగలేదు. రైతుబంధు ఒక్కటిచ్చి రైతులకు అన్నీ చేశామని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.

ఎవరికి మేలు

అర ఎకరం పేద రైతు నుంచి, కోట్లకు పడగెత్తిన వందల ఎకరాల భూస్వామి వరకు ఇచ్చే రైతుబంధు వలన ఎవరికి మేలు జరుగుతోంది? కేజీ టు పీజీ విద్య పురిటిలోనే చచ్చిపోయింది. ఊళ్లలో బడులు పాడుబడ్డాయి. ఇంటికో ఉద్యోగం అని చెప్తే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగి గుండె మండిపోతోంది. డబుల్‌ బెడ్రూం ఇల్లు వస్తదని చెప్తే గంపెడాశలు పెట్టుకున్న తల్లి కడుపు తరుక్కుపోతోంది. దళిత ముఖ్యమంత్రి లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, దళితులందరికీ దళితబంధు ఇవ్వడానికి ప్రణాళిక లేదు. పోడు భూములకు పట్టా ఇవ్వకుండా పోలీసులకు అప్పగిస్తున్నారు. సామాన్యుల డబ్బునంతా కార్పొరేట్‌ విద్యాలయాలు, ఆస్పత్రులకు దోచిపెడుతున్నారు. ఇలా సకల జనులకు టీఆర్‌ఎస్‌ చేస్తున్నమోసాల చిట్టా విప్పి ప్రజలకు వివరించి చెప్పడమే ప్రజా సంగ్రామ యాత్ర ప్రధాన బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఎండగట్టడం ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ప్రధాన లక్ష్యం.

యాత్ర ద్వారా జరిగేదేంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించి చైైతన్యం చేస్తాం. అధికారం తలకెక్కిన ముఖ్యమంత్రిని ఫాంహౌజ్ నుంచి బయటకు తీసుకొస్తాం. కేసీఆర్‌ కుటుంబ పాలన, వాళ్ల అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజా కోర్టులో నిలబెడతాం. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, దాని ఫలాలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందిస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో ఉద్యమ ఆకాంక్షల తెలంగాణను తీర్చిదిద్దుతాం. కలల తెలంగాణను సాకారం చేస్తాం.

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర తొలివిడత విజయవంతంగా పూర్తయింది. 36 రోజుల పాటు 438 కిలోమీటర్లు సాగింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలో 2021, ఆగస్టు 24న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి మొదలై, హుస్నాబాద్‌ లో అదే సంవత్సరం గాంధీ జయంతి అక్టోబర్‌ 2న ముగిసింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంగా బీజేపీ పక్షాన విజయకేతనమై, మార్పు సంకేతమై ప్రతిబింబించాయి. ప్రజల ఆధరాభిమానంతో అందరూ చేతులు కలపాలని, రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నాం.

దుగ్గ్యాల ప్రదీప్‌కుమార్‌,

ప్రధాన కార్యదర్శి, బీజేపీ తెలంగాణ శాఖ

9020799999


Next Story

Most Viewed