స్మార్ట్ కార్డులతో.. తీరనున్న రేషన్ పరేషాన్!

by Ravi |   (  Updated:2025-06-19 01:00:43  IST  )

చౌకధరల దుకాణాలు ఈ పేరు చాలాకాలం తర్వాత విన్నట్లుంది అనిపిస్తుంది కదా! ఒకప్పుడు ఈ దుకాణాల్లో రేషన్‌ సరుకులను

స్మార్ట్ కార్డులతో.. తీరనున్న రేషన్ పరేషాన్!
X

చౌకధరల దుకాణాలు ఈ పేరు చాలాకాలం తర్వాత విన్నట్లుంది అనిపిస్తుంది కదా! ఒకప్పుడు ఈ దుకాణాల్లో రేషన్‌ సరుకులను పంపిణీ చేసే వారు.. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి రూ.కోట్లు ఖర్చు చేసి ఈ పంపిణీ ప్రక్రియను ప్రారం భించింది. రేషన్‌ బియ్యం అందుకునే పరిస్థితి ఒకెత్తు అయితే రాయితీ బియ్యం పక్క దారి పట్టిందని ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసి తిరిగి జూన్‌ 1 నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీ సరకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది.

పేదలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీపై ఎంత నిఘా ఉంచినా ఎక్కడో ఒకచోట పక్కదారి పడుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ-పౌరసరఫరాల యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం నుంచి నిత్యావసరాలు ఎంత కేటాయించింది, లబ్ధిదారులకు ఎంత పంపిణీ చేశారనే వివరాలు.. దుకాణాల వారీగా అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా సరకుల సరఫరాకు, పంపిణీకి వ్యత్యా సాలున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ప్రతినెలా 1 నుంచి 17వ తేదీ వరకు అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు.

రేషన్ వద్దనుకుంటే..

ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయాల్లో సరుకులు తీసు కునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,796 రేషన్ షాపుల ద్వారా.. రేషన్ పంపిణీ జరుగుతుంది. ఆదివారం నాడు కూడా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దు అనుకుంటే.. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందించేటందుకు విధివిధానాలను రూ పొందిస్తున్నారు. బియ్యానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్న ప్రతి పాదనలను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది.

డబ్బుకు బదులుగా నిత్యావసరాలు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉంటే.. ఇందులో 30 శాతం కుటుంబాలకు (దాదాపు 44 లక్షల మందికి) రేషన్ బియ్యం ఆధారం. వీరిలో మిగిలిన 70 శాతం మందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు తీసుకుంటున్నారు. వారే ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మేయడంతో రేషన్ మాఫియా విస్తరించింది. ఇక ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసిన తర్వాత పేదలకు పంపిణీ చేస్తోంది. ఇలా చూస్తే ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుతో పా టుగా కమిషన్ కలిపి కిలో బియ్యానికి రూ.46 ఖర్చు చేస్తున్నట్లు లెక్క ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.46 కోట్ల కార్డుల్లో.. 90 లక్షల మందికి కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. ఇక మిగిలిన 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ. 6,193 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే కనుక 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి రూ.920 ఖర్చు అవుతోంది. అందుకే ప్రభుత్వం ఆ డబ్బుకు బదులుగా నూనె, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కార్డులు..

కూటమి సర్కార్ రేషన్ కార్డుల విషయంలో వినూత్న ఆలోచన చేసింది. స్మార్ట్ కార్డుల మాదిరిగా రేషన్ కార్డులను డిజైన్ చేసి అందించాలన్న ఆలోచన గొప్పగా ఉంది. ఆ కార్డు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వివరాలు వస్తాయి.. అంతేకాదు గత ఆరు నెలలుగా వారు తీసుకున్న రేషన్ తాలూకా వివరాలు సైతం కనిపిస్తాయి. దాంతో అటు ప్రభుత్వానికి ఇటు రేషన్ కార్డు దారులకూ ఉపయోగపడేలా ఉంటుంది. మరోవైపు దేశంలో ఎక్కడైనా ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో రేషన్ తీసు కోవచ్చు. చాలా మంది ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. మూడు నెలల గ్యాప్‌లో ఒక్కసారి అయినా రేషన్ తీసుకోకపోతే ఏకంగా కార్డు రద్దు అవు తుంది. దాంతో వారు ఎక్కడ ఉన్నా కూడా రేషన్ కోసం పరిగెత్తుకుని వెనక్కి సొంత ఊరుకు రావాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా దేశంలో ఎక్కడైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు రేషన్ తీసుకోవచ్చు. ఇది మంచి విధానంగానే అంతా చూస్తున్నారు..

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story