మెస్సీ మ్యాచ్‌తో.. ముఖ్యమంత్రి సందేశం..

by Ravi |   (  Updated:2025-12-07 00:30:06  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో తలపడడానికి కఠిన శిక్షణ తీసుకుంటున్నారనే వార్త, నేటి రాజకీయ నాయకత్వంలో కొత్త ఒరవడిని సూచిస్తోంది.

మెస్సీ మ్యాచ్‌తో.. ముఖ్యమంత్రి సందేశం..
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో తలపడడానికి కఠిన శిక్షణ తీసుకుంటున్నారనే వార్త, నేటి రాజకీయ నాయకత్వంలో కొత్త ఒరవడిని సూచిస్తోంది. ఇది కేవలం ఒక క్రీడా ఈవెంట్ మాత్రమే కాదు, నూతన తరహా నాయకత్వానికి, పరిపాలనలో చురుకుద నానికి ఆయన ఇస్తున్న సాక్ష్యం. ఈ విషయంలో ఆయన స్ఫూర్తిని, పట్టుదలను నిస్సందేహంగా ప్రశంసించాలి. ముఖ్యమంత్రిగా, ప్రతిరోజూ అధికారిక పనులతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సాయంత్రం 45 నిమిషాల పాటు సాధన కోసం మైదానంలోకి అడుగుపెట్టడం అనేది అసాధారణమైన విషయం. శారీరక సామర్థ్యం అనేది మానసిక దృఢత్వానికి, సమర్థవంతమైన పరిపాలనకు పునాది అనే సందేశాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించే నాయకత్వ లక్షణం. ఆయన ప్రచారం చేస్తున్న 'FAST' ఎజెండా (Fit, Assertive, Strategic, Tough)లోని 'Fit' అంశానికి ఈ శిక్షణ పరాకాష్ట. ఈ నిబద్ధతతో నాయకుడు తన వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో తెలియజేస్తుంది, తద్వారా పౌరులు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించమని పరోక్షంగా ప్రోత్సహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి మెస్సీ వంటి అంతర్జాతీయ స్టార్‌తో ఆడటం ద్వారా, ‘తెలంగాణ రైజింగ్ - 2047’ అనే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాన్ని ప్రపంచానికి బలంగా చాటి చెబుతున్నారు. అలగే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను క్రీడల వైపు మళ్లించడానికి, వారిలో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఇంతకంటే గొప్ప వేదిక ఏముంటుంది? ఇది కచ్చితంగా ప్రశంసించదగిన, అనుసరించదగిన స్ఫూర్తిదాయక నాయకత్వం.

- ముహమ్మద్ ముజాహిద్,

96406 22076

Next Story