ఈసారైనా శాంతి చర్చలు ఫలించేనా?

by Ravi |   (  Updated:2026-04-12 00:30:49  IST  )

అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఒక్క రోజులోనే చితికిపోయింది. ఇజ్రాయెల్ దాడి, ఇరాన్ హోర్ముజ్ జలసంధి మూసివేత నిర్ణయం.. అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి?

ఈసారైనా శాంతి చర్చలు ఫలించేనా?
X

అమెరికా, ఇరాన్ యుద్ధంలో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఒక మొక్కుబడి ప్రహసనంగా మారింది. పాకిస్తాన్‌ను పెద్దమనిషిగా ముందు పెట్టి వైరి వర్గాలు ఇరువురూ తమ తమ స్వంత పరువులు తాత్కాలికంగా నిలుపుకునే ప్రయత్నం చేశాయి.. అయితే ఈ రెండు వారాలైనా కాల్పులు లేకుండా గడుస్తా యా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒప్పందానికి వచ్చి ఒక్క రోజు గడవక ముందే లెబనాన్‌పై ఇజ్రా యెల్ దాడి చేసి వందల మందిని చంపింది. తమ మిత్రులపై దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించి ఒప్పందంలో భాగమైన హోర్ముజ్ జలసంధి తెరవడాన్ని వెనక్కి తీసుకుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందంలో లెబనాన్ పై దాడి చేయకూడదన్న అంశం కూడా ఇమిడి ఉందని ఇరాన్ అంటుండగా, అదేం లేదని అమెరికా అంటోంది. 'నువ్వూ నేనూ కాల్పులు జరుపుకోవద్దు గానీ, నీ పక్కన ఉన్న మిత్రుణ్ణి, నా పక్కన ఉన్న మిత్రుడు కాల్చిపడేస్తాడు' అంటే .. ఆ ఒప్పందం ఏం నిలుస్తుంది? ఎన్ని రోజులు నిలుస్తుంది. ఇద్దరూ కలిసి మధ్యవర్తి సరిగ్గా చెప్పలేదని భావిస్తున్నారు.. అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు ఏ మేరకు సఫలమౌతాయో చూడాలి.. ఎందుకంటే ఇరు దేశాల ప్రతిపాదనలు ఎదుటివారు ఏ మాత్రం ఒప్పుకోలేనివి. వాస్తవ దూరమైన కోరికలు.. అయినా చిన్నదో, పెద్దదో శాంతి వైపు జరిగిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే ఆహ్వానించవల్సిందే.. కానీ సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి. ప్రహసనాలతో ప్రపంచ శాంతి అసంభవం. చిత్తశుద్ధితో కూడిన దౌత్య ప్రయత్నాలు అత్యవసరం.

-డా. డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story