సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఇప్పటికైనా పెన్షన్‌ పెరిగేనా?

by Ravi |   (  Updated:2025-05-22 00:30:46  IST  )

సింగరేణి డ్రెస్సుతో మణుగూరు ఏరియాకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి రాములు మినరల్ వాటర్ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఇప్పటికైనా పెన్షన్‌ పెరిగేనా?
X

సింగరేణి డ్రెస్సుతో మణుగూరు ఏరియాకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి రాములు మినరల్ వాటర్ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా పని చేయడం సింగరేణి సమాజానికి దురదృష్టకరం. సింగరేణి మాజీ ఉద్యోగిగా ఆయనకు అతి తక్కువ పెన్షన్ రావడంతో ఆయన కుటుంబం పెద్దది కావడంతో విశ్రాంతి తీసుకునే సమ యంలో ఇలా మండుతున్న ఎండల్లో పని చేయ డం బాధాకరమైనప్పటికీ కుటుంబ పోషణ కోసం కొంత ఆసరాగా పనిచేయక తప్పడం లేదని వాపోతున్నాడు. సాధారణంగా సింగరేణి సంస్థ లో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు కోల్‌ మైన్స్‌ పెన్షన్స్‌ స్కీమ్‌ను వర్తింపజేయాలని 1998 లో పార్లమెంట్‌లో చట్టం తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి పదవీ విరమణ పొందిన కార్మికులు ఇచ్చే పింఛన్‌ సొమ్మును పెంచాలని చట్టంలో పేర్కొ న్నారు. కానీ ఏనాడు కూడా వారికి పింఛన్‌ పెరిగిన దాఖలాలు లేవు. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పుడు ఎంతైతే పింఛన్‌ ఇచ్చారో అంతే పింఛన్‌ ఇప్పటికీ ఇస్తున్నారు. ప్రస్తుతం ధరలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో.. ఈ పెన్షన్ కుటుంబ పోషణకు సరిపోతుందా? చాలీచాలని పింఛ న్‌తో బతుకులీడుస్తున్న సింగరేణి కార్మికుల్లో పింఛన్‌ పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి. సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగులకు పింఛన్‌ పెరిగే విధంగా టన్ను బొగ్గు ఉత్పత్తిపై 20 రూపాయల చొప్పున కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ స్కీమ్‌ ట్రస్టు బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది. సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ బోర్డుకు ఏటా 140 కోట్ల రూపాయలు జమ కానున్నాయని అంచనా వేస్తు న్నారు. ఈ నిధితో పదవీ విరమణ పొందనున్న సింగరేణి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పింఛన్‌ పెరిగే అవకాశాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని పింఛన్‌తో బతుకులీడుస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ఇప్పటికైనా మోక్షం కలగాలని ఆశిద్దాం..

-దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story