- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల్లో చైతన్యాన్ని రగిలించనప్పుడు.. ఈ నినాదాలు ఎందుకు?
దేశంలో మారిన పరిస్థితులు, పాలకుల విధానాల్లో పెరిగిన క్రూర స్వభావం, నానా టికీ విస్తరిస్తున్న కార్పొరేట్ సామ్రాజ్యం

దేశంలో మారిన పరిస్థితులు, పాలకుల విధానాల్లో పెరిగిన క్రూర స్వభావం, నానా టికీ విస్తరిస్తున్న కార్పొరేట్ సామ్రాజ్యం, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముద్రతో కమ్యూ నిస్టు నాయకత్వాన్ని ఆంతమొందించమే లక్ష్యంగా రాజ్యం అమలు చేస్తున్న దుర్మార్గ ప్రణాళికలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దేశంలో గ్లోబల్ వినియోగ సంస్కృతి వ్యాపా రంగా విస్తరించి తిరిగి ఫాసిజంలోకి, మతవాదంలోకి రూపాంతరం చెందుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకోవడంలో ప్రతిఘటన ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యేందుకు, ప్రజలు ముందుకు రావడం లేదు. పైగా ప్రజలలో చైతన్యాన్ని రగిలించి, ఉద్యమాలను నడపగలిగిన, త్యాగాలకు సిద్ధపడే నాయ కత్వం కొరవడటం విషాదం. ఇలాంటి వారికి మద్దతు ఇచ్చేందుకు నక్సలైట్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో ఉండనే ఉన్నాయి. ఇవేవి పట్టించుకోకుండా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. ఎన్నికల్లో పోటీ చేయాలని ఉపన్యాసాలు ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదు. పోరాట రాజకీయాలను మార్చుకొని, ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన అయిలయ్య (సాంబ శివుడు ) లాంటి వారు రాజ్యహింసకు బలయిన విషయం మర్చిపోయారా? తెలంగాణ ఉద్య మంలో అసువులు బాసిన బెల్లి లలిత లాంటి వారెందరో కదా! ఈ అంశాలను మరిచిపోయారా? వనరుల పరిరక్షణ కోసం, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమాలకు సమాయత్తం చేయ కుండా ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం కావని గ్రహించాలి.
- రమణాచారి
99898 63039






