గాంధీ వారసత్వంపై బురదజల్లుడేల?

by Ravi |

భారతదేశ లౌకిక పునాదులు సడలిపోయి, పరీక్షకు గురవుతున్న ఈ యుగంలో జాతిపిత మహాత్మా గాంధీ, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ శాశ్వత కృషి దేశ గుర్తింపుకు కీలకంగా మిగిలి ఉంది.

గాంధీ వారసత్వంపై బురదజల్లుడేల?
X

భారతదేశ లౌకిక పునాదులు సడలిపోయి, పరీక్షకు గురవుతున్న ఈ యుగంలో జాతిపిత మహాత్మా గాంధీ, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ శాశ్వత కృషి దేశ గుర్తింపుకు కీలకంగా మిగిలి ఉంది. ఇటీవల రాజకీయ చర్చలు, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరోక్ష చర్యలు తీవ్రమైన వ్యతిరేకత అలాగే సామాజిక సమగ్రతను విచ్చిన్నం చేసేవిగా ఉన్నాయి.

కొన్ని స్వతంత్ర సంస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని కేసులు బనాయించి ప్రజల్లో సాంఘిక అశాంతిని పెంచి సమాజంలో జరిగే అభివృద్ధికి కొన్ని మతాలు, కొన్ని కులాలు ప్రతిబంధకంగా మారాయని తద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే పద్దతిలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

గాంధీపై మసిబూసే రాజకీయం

గాంధీ పేదరికం, కుల వివక్ష, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాలకు నాయకత్వం వహించారు. “నేను నిరాశపడినప్పుడు, చరిత్ర అంతటా సత్యం ప్రేమ మార్గాలు ఎల్లప్పుడూ గెలిచాయని గుర్తుచేసుకుంటాను” అని నియంతృత్వానికి వ్యతిరేకంగా నైతిక స్థైర్యం ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం గాంధీ పాత్రను తగ్గించే నిరంతర ప్రయత్నాలను చేస్తున్నారు.

జాతిపిత పేరును తొలిగించి...

ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను కొత్త ఫ్రేమ్‌వర్క్ విబి జీ రామ్ జీ పేరు మార్చడం ద్వారా ఇది నిరూపితమైంది, కీలక గ్రామీణ సంక్షేమ పథకం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటు. భారతదేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 1948లో ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు, ఆయన నెహ్రూ వారసుడిగా గాంధీ ఎంపికను ప్రశంసించారు, “మహాత్మా గాంధీ నెహ్రూను తన వారసుడిగా ఎంచుకున్నారు... గాంధీజీ మరణం తర్వాత మనం ఆయన తీర్పు సరైనదని గ్రహించాము.”

ఆధునిక భారత నిర్మాత నెహ్రూ

పటేల్ వ్యక్తిగత జీవనశైలిలో సంప్రదాయవాది అయినప్పటికీ, కాంగ్రెస్-పరంగా మరియు లౌకిక ఆదర్శాలలో గట్టిగా ఉన్నారు, 1949లో హామీల తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎత్తివేశారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి (1947–1964) జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత దేశాన్ని పారిశ్రామికీకరణ, శాస్త్రీయ మనస్తత్వం ద్వారా మార్చారు. ఆయన లౌకికత, సోషలిజం, విభిన్నతలో ఐక్యతను నొక్కి చెప్పారు, ఫ్యాక్టరీలను “ఆధునిక భారతదేశ ఆలయాలు”గా ప్రకటించారు. నెహ్రూ మానవతావాదాన్ని పెంపొందించారు, తర్కం, అనుభవాత్మక సాక్ష్యం మైనారిటీ రక్షణలకు ప్రాధాన్యత ఇచ్చారు. సంక్షేమ రాజ్య దృష్టి పేదరికం, అసమానతను ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిష్కరించింది, సాంప్రదాయికతను ఎదుర్కొనేందుకు “విభిన్నతలో ఐక్యత”ను ప్రోత్సహించింది.

ప్రపంచ రాజనీతిజ్ఞుడు నెహ్రూ

వ్యవస్థలను నెలకొల్పడంలో నెహ్రూ చేసిన కృషి అంతా ఇంతా కాదు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పన, విశ్వవిద్యాలయాల రూపకల్పన, విదేశీ వ్యవహారాల్లో అనుభవంతో ప్రపంచంలో గొప్ప స్టేట్స్ మెన్‌గా రాణించారు. ఇంత గొప్ప నాయకుడిని ఒక పద్దతి ప్రకారం అపఖ్యాతి పాలు చేయడానికి కంకణం కట్టుకుని అతనికి మతం రంగు పులిమి స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకమైన భావజాలంతో ముడిపెట్టారు. ఇటీవల పార్లమెంట్ సెషన్ లో వందేమాతరం వంటి చారిత్రక సంఘటనలపై చర్చలు నెహ్రూ పాత్ర వక్రీకరించేవిగా గమనించవచ్చు. పథకాల పేరు మార్పు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం సంస్కరణలతో కాంగ్రెస్-వారసత్వాన్ని తొలగించే ఆరోపణలను రేకెత్తించాయి. కానీ అహింస, లౌకికత, సమగ్ర ప్రగతిలో మూలాలు ఉన్న గాంధీ, నెహ్రూ వారసత్వాలు దేశ స్థాపన ఆదర్శాల గుర్తు చేయడంగా పనిచేస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కోసం సామాజిక సమైక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కాపాడటం అవసరం.

-డా. ముచ్చుకోట సురేష్ బాబు,

99899 88912

Next Story