పీపీపీ విధానంపై ఇంత వ్యతిరేకత దేనికి?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-12-30 13:53:28  IST  )

ఎన్నో ఏళ్లనుండి రహదారులు, విమానాశ్రయాలు, మెట్రో ప్రాజెక్టులు, వైద్య కళాశాలలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు పీపీపీ విధానంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

పీపీపీ విధానంపై ఇంత వ్యతిరేకత దేనికి?
X

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య ను వేగంగా విస్తరించడానికి కూటమి ప్రభుత్వం పీపీపీ [-పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్] షిప్ విధానంలో మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం చేయాలని నిర్ణయించింది. కానీ పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం చేసి రాజకీయం జుర్రుకోవాలని జగన్ అండ్ కో అర్రులు చాస్తున్నారు. కేంద్రం సమర్థిస్తున్న పీపీపీ విధానాన్ని జగన్ ముఠా రాద్దాంతం చెయ్యడం రాజకీయ ప్రయోజనం కోసమే తప్ప మరొకటి కాదు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్-ప్రయివేట్ పార్ట్నర్ షిప్ [పీపీపీ] విధానాన్ని అభివృద్ధికి కీలక సాధనంగా స్వీకరిస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ ముఠా పీపీపీకి వ్యతిరేకంగా రాదాంతం చేయడం స్పష్టమైన రాజకీయ ద్వంద్వత్వానికి ప్రతీకగా కనిపిస్తోంది. పీపీపీ విధానంపై కేంద్ర నిర్ణయం సరైనది అయినప్పుడు, అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తే తప్పేలా అవుతుంది

హైకోర్టు గడ్డిపెట్టినా చెవికెక్కదు.. !

ఎన్నో ఏళ్లనుండి రహదారులు, విమానాశ్రయాలు, మెట్రో ప్రాజెక్టులు, వైద్య కళాశాలలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, ఈ రంగాలన్నింటిలోనూ పీపీపీ విధానంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇదే విధానాన్ని నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తున్నాయి. వైద్య విద్య వ్యయ భారం ఎక్కువగా వున్న పరిస్థితుల్లో విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని, కళా శాలలను, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించడంపై ఆలోచించాలని పార్లమెంటు కమిటీ సిఫార్సు చేసింది. నిధులు కొరత వల్ల వైద్య కళాశాలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తప్పు ఎలా అవుతుందని, పూర్తిగా ప్రైవేటుకి అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉండటం మంచిదే కదా అని ఉన్నత న్యాయస్థానం గడ్డి పెట్టింది.

పెట్టుబడులు భారం తగ్గించుకుంటే తప్పా?

పీపీపీ విధానం అంటే ఏమిటి? ప్రభుత్వానికి అవసరమైన పెట్టుబడుల భారం తగ్గించడం, ప్రైవేట్ రంగం సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, మౌలిక వసతులు, విద్య, వైద్యం, రవాణా వంటి రంగాల్లో నాణ్యత పెంచడం. దీనిని ప్రైవేటీకరణగా చిత్రీకరించడం అవకాశంవాద రాజకీయం కాక మరేమిటి ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానంపై జగన్ ముఠా చేసే రాద్ధాంతం అంతా ప్రజల పట్ల ప్రేమతో కాదు. అభివృద్ధిని అడ్డుకొనే కుట్రగా అర్ధం అవుతుంది.

పీపీపీ అంటే మొత్తం ప్రైవేట్ అని కాదు

ఒక వైద్య కళాశాల ఏర్పాటుకు రు 500 నుంచి రూ 700 కోట్ల పెట్టుబడి అవసరం. నిపుణులైన అధ్యాపకులు, ఆధునిక మౌలిక వసతులు అవసరం. పీపీపీ అంటే కళాశాల మొత్తం ప్రైవేటుపరం చెయ్యడం కాదు. భూమి ప్రభుత్వానిది. నిర్మాణ భారాన్ని మాత్రం ప్రైవేటు సంస్థలు భరిస్తాయి. నిర్మాణాలు వేగంగా జరుగుతాయి. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయి. కళాశాలలపై యాజమాన్య హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. మెడికల్ కాలేజీ సీట్ల ధరలు నిర్ణయించేది ప్రభుత్వమే. ఓపీ సేవలు, వైద్య సీట్లు కూడా ఉచితంగానే అందుతాయి. ప్రైవేట్ సంస్థలు ఎక్కడా జోక్యం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోనే అవకాశమే లేదు. జీరో ప్రాఫిట్ సేవాభావంతో నిర్వహించబడతాయి.

మొండిగోడలు కడితే సరిపోతుందా?

ఒక వైద్య కళాశాల ప్రారంభించాలంటే ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ ల్యాబ్స్, అడ్మినిస్ట్రేషన్ భవన్, లెక్చరర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్స్ డిపార్ట్ మెంట్, లెక్చరర్ ఆల్స్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, స్టాఫ్ రీడింగ్, జర్నల్స్, ఇలా ఎన్నో వసతులు అవసరం. ఆధునిక పరికరాలు, సదుపాయాలతో వేగంగా మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే పీపీపీ ద్వారానే సాధ్యం. ప్రైవేటీకరణ, పీపీపీ విధానానికి తేడా తెలియని వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవోలు ఇస్తే, భూములు ఇచ్చి పునాదులు వేస్తే మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసినట్లు కాదు. కళాశాల ప్రారంభమై యువతకు వైద్య సీట్లు అందినప్పుడే ఉపయోగం. ప్రచార ఆర్భాటానికి తప్ప. జగన్ రెడ్డి చెప్పుకునే మెడికల్ కాలేజీలలో ఎక్కడ పురోగతి మాత్రం లేదు. అన్నీ మొండి గోడలకే పరిమితం అయ్యాయి.

అధికారంలో ఉన్నప్పుడు సై.. ఇప్పుడు

పీపీపీ విధానంలో వైద్యారోగ్య రంగంలో కూడా భారీ అవకాశాలున్నాయని, వాటిని విరివిగా వాడుకునేందుకు మూడేళ్లలో చేపట్టే ప్రణాళికలను శీఘ్రంగా రూపొందించాలని, ఎన్నో ఏళ్లనుండి రవాణా, రహదారులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంధనం, పట్టణ మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పీపీపీ ద్వారా విజయాలు సాధించాయని , 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్‌ సెంటర్లు పీపీపీ పద్ధతుల్లో నడుస్తున్నాయని. వైద్య రంగంలో విస్తృతంగా ఆవిష్కృతమవుతున్న పీపీపీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికల రూపకల్పనకు, కేంద్రంతో సమన్వయానికి ప్రత్యేక పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర వైద్య మంత్రి సత్యకుమార్‌కు సూచించారు. ఆరోగ్య రంగంలో పీపీపీ అమలుకు సంబంధించిన ఐదు పేజీల విధాన పత్రాన్ని పంపారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి, అధికారానికి దూరమైన తర్వాత అదే విధానంపై ఉద్యమాలు చేయడం రాజకీయ అవకాశానికి నిదర్శనం.

ప్రపంచవ్యాప్తంగా పీపీపీ విధానమే..

దేశవ్యాప్తంగా రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ రంగం, వైద్య సేవలు పీపీపీ మోడల్‌లోనే అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం ఒంటరిగా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పీపీపీ విధానం అమలులో ఉంది. దీనిని పూర్తిగా తిరస్కరించడం అంటే పెట్టుబడులను తరిమేయడం, ఉద్యోగాలను, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే. పీపీపీ విధానంపై జగన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం తన రాజకీయ లాభం కోసమే తప్ప ప్రజల కోసం మాత్రం కాదు.

అబద్ధాలు చెబితే ఓట్లు రాలవ్

పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వానికి పెట్టుబడి భారం తగ్గుతుంది. ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి, వేగంగా కాలేజీలు, ఆసుపత్రులు నిర్మాణం అవుతాయి. సీట్లు పెరగడం వలన స్థానిక విద్యార్థులకు ఎక్కువ. ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. కాలేజీతో పాటు పెద్ద ఆసుపత్రి ఏర్పడి స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త కాలేజీలు ఎక్కువ సీట్లు అందిస్తాయి. స్థానిక విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. డాక్టర్ల లభ్యత పెరిగి రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగవుతాయి.. కాబట్టి పీపీపీ విధానంపై జగన్ రెడ్డి ఎన్ని అబద్దాలు చెప్పినా మరోసారి ప్రజలు పంగనామాలు పెడతారు. అధికారం దక్కలేదన్న అక్కసుతో రాష్ట్ర అభివృద్దికి అడ్డుపడుతున్న జగన్ రెడ్డి దగా రాజకీయాన్ని ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story