- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌పై.. పంతం నెగ్గించుకున్న అమెరికా!
పశ్చిమాసియాలో అమెరికా తన రాజకీయ ప్రయోజ నాలను సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి

పశ్చిమాసియాలో అమెరికా తన రాజకీయ ప్రయోజ నాలను సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా అణ్వస్త్ర సామ ర్థ్యం పరీక్షల్లో ఇరాన్ నిమగ్నమైందని, ఆ ప్రయత్నం నుండి ఆ దేశం విరమించుకోవాలని అనేకమార్లు అమెరికా నాయ కత్వం ఇరాన్ రాజకీయ నాయకత్వానికి సుద్దులు చెప్పింది.
ఇస్లామిక్ విప్లవం రాకముందు..
ఇరాన్ సుప్రీం కమాండర్ ఖొమేని, ఆయన చుట్టూ చేరిన ఇస్లామిక్ మత నాయకత్వం అమెరికా మాటలను లెక్క చేయలేదనేది వాస్తవం. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం రాకముందు అమెరికా చెప్పినట్లు ఇరాన్ నాయకత్వం నడుచుకునేది. ఆ తర్వాత సీను మారింది. ఇరాన్‌లో అమెరికా జోక్యానికి చెక్ పెట్టడానికి అమెరికాకు చెందిన 44 మంది దౌత్యాధికారులను ఇరాన్ ఇస్లామిక్ పాలకులు అప్పట్లోనే బంధించారు. వీరిని విడిపించడంలో అమెరికా భంగ పాటుకు గురైంది. అప్పటినుండి అమెరికా వ్యూహకర్తలు ఇరాన్‌ను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
తనకు మట్టి అంటకుండానే..
ఇరాన్ ఇజ్రాయిల్ ఘర్షణ అమెరికాకు కలిసొచ్చిన విషయం. ఈ పరిస్థితుల్లో తన చేతికి మట్టి అంటకుండా ఇజ్రాయెల్ ద్వారా తాను చేయవలసిన పనిని అమెరికా చేయించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పోరాడుతున్న హమాస్ ఉగ్రవాద సంస్థకు ఇరాన్ ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ఇజ్రాయెల్ ఇరాన్ పై క్షిపణులు దాడులను జరిపింది. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ విషయం సద్దుమణిగింది. ఇరాన్ తాను చెప్పిన దారిలో నడుచుకోలేదు అనే నెపంతో అమెరికా ఇజ్రాయెల్ ద్వారా తాజాగా దాడి చేయించి, అణు కేంద్రాలలో జరిగే ప్రోగ్రెస్‌ను అంచనా వేసింది. తన అనుమానాలను క్లారిఫై చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల ఒప్పందానికి రావాలని కోరింది. తాను అనుకున్నట్లే కాల్పుల విరమణ జరిగింది.
అమెరికా మద్దతు ఎన్నటికీ పాక్‌కే..
పెహల్గాం ఉదంతం తర్వాత భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్థాన్‌పై క్షిపణుల దాడులు చేసి, బిక్కిరి బిక్కిరి చేయడంతో బెంబేలెత్తిన పాకిస్తాన్‌కు అమెరికా నేడు ఆత్మబంధువైంది. ఈ పరిస్థితిని అమెరికా తనకు అనుకూలంగా మలుచుకున్నది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌ను వైట్ హౌస్ విందుకు ఆహ్వానించడం, భారత ప్రధాని నరేంద్ర మోడీతో మునీర్‌ను పోల్చి చెప్పడం అమెరికా రక్షణ వ్యూహంలో భాగమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల భావన.
మన సంబంధాలు మెరుగుపరచుకోవాలి!
ఈ విషయంలో భారత ప్రభుత్వం, భారత ప్రజలు అప్ర మత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1971 బాంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు సహాయంగా ఒక వార్ షిప్పును సిద్ధం చేసిన విషయాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మరువరు.. ఇరాన్ ఒకప్పుడు పర్షియా అని పిలవ బడేది. పర్షియన్ సంస్కృతిలోని కొన్ని విషయాలు భారత సంస్కృతితో సమ్మిళితమౌతాయి. పర్షియాలో ఇస్లాం సంస్కృతి ప్రవేశించిన తర్వాత పర్షియన్ సంస్కృతి అను సరించే పారశీకులకు అనేక ఇబ్బందులు కలిగాయి. ఈ పరిస్థితుల్లో అక్కడి నుండి పారిపోయి వచ్చిన పర్షియన్లను ఆదరించిన ఘనత భారతదేశానికి ఉంది. ఈ విధంగా ఆ దేశంతో భారత్‌కు చారిత్రిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో మన సంబంధాలు శాశ్వతంగా, బలంగా మారడానికి వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం వ్యవహరించాలి.
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877






