100K డాలర్ల వీసా ఫీజు ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

by Ravi |   (  Updated:2025-10-03 01:15:44  IST  )

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంటాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసా విషయానికి వస్తే భారతదేశం కంటే ఎక్కువగా ప్రభావితమయ్యే దేశం మరొకటి ఉండదు. ఎందుకంటే

100K డాలర్ల వీసా ఫీజు ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
X

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంటాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసా విషయానికి వస్తే భారతదేశం కంటే ఎక్కువగా ప్రభావితమయ్యే దేశం మరొకటి ఉండదు. ఎందుకంటే, ఈ వీసా ద్వారా అమెరికాకు వెళ్లే వాళ్లల్లో 71% భారతీయులే.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి. ఈ రాష్ట్రాల నుండి మాత్రమే సుమారు 35 వేల మంది ఐటీ ఇంజనీర్లు ప్రతి సంవత్సరం ఈ వీసాల కోసం అమెరికా తలుపులు తడుతున్నారు.

ఇప్పుడు అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం (మొత్తం ప్యాకేజీ, లీగల్ ఫీజులు, ఫైలింగ్ ఫీజులు కలిపి) ఒక పెద్ద ప్రకంపన కలిగించింది. ఈ మార్పు కారణంగా అమెరికా ఎక్కువ నష్టపోతుందా? భారతదేశం లాభ పడతుందా? ఇది అమెరికా కంపెనీలకు లాభామా? భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కా? లేక మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థకా?

తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యం..

భారతదేశంలో హెచ్1బీ వీసా కోసం అత్యధి‌కంగా దరఖాస్తులు వేసేవారు ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో ప్రతి రెండో కుటుంబం అమెరికా కలతో చదువులు, ఖర్చులు పెడు తోంది. ఆ కుటుంబాలు ఇప్పటికే కోచింగ్ ఫీజులు, GRE, TOEFL, అప్లి కేషన్ ఫీజులు, వీసా ఖర్చులు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల ఈ పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం, ఇంజినీరింగ్ కాలేజీలు అధిక సంఖ్యలో ఐటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్, ఉన్నాయి. 

అమెరికాకు లాభమా?

ప్రతి సంవత్సరం 1.25 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివ ర్సిటీల్లో అడ్మిషన్ తీసుకుంటారు. కొత్త వీసా రుసుముల వల్ల అమెరికా ప్రభుత్వానికి తక్షణంగా ₹9 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుంది. అమెరికా కంపెనీలు స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. సాధారణంగా అమెరికా ఐటీ కంపెనీ ఒక హెచ్‌వన్‌ బి ఉద్యోగిని స్పాన్సర్ చేస్తే ఖర్చు, లీగల్, అప్రూవల్ ఫీజు.. $5,000–$10,000, ప్రాసెసింగ్, లాయర్ ఫీజు $5,000–$7,000 ఇలా మొత్తం సుమారు $15,000 వరకు ఇప్పుడీ కొత్త రూల్ ప్రకారం $100,000 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అంటే, ఒక ఉద్యోగి మీద ఖర్చు $1.15 లక్షలు అవుతోంది. అదే ఉద్యోగి సగటు జీతం $120,000 అయితే, కంపెనీకి అది ‘ఎకానమికల్‌గా ప్రాఫిటబుల్’ కాదు. కాబట్టి వారు కొత్తగా H1B అప్లై చేయడం తగ్గిస్తారు. అమెరికాలో భారతీయుల సంఖ్య తగ్గితే ఇండో–US సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. భారతదేశం ఇతర దేశాలతో (కెనడా, యూరప్) కొత్తగా టెక్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అమెరికా మాత్రం తాత్కాలికంగా ఆదాయం పొందినా, లాంగ్‌టర్మ్‌లో టెక్ ప్రాజెక్టులలో నష్టపోయే అవకాశం ఉంది. ఒక కంపెనీ 100 మంది ఉద్యోగులకు H1B వీసాలు స్పాన్సర్ చేస్తే, మొత్తం ఖర్చు 100× $100,000 = $10 మిలియన్ (రూ.85 కోట్లు). ఈ స్థాయి ఖర్చు చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు అసాధ్యం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలే కొంత వరకు భరించగలవు..

భారతదేశానికి నష్టమా?

భారతీయ ఐటీ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. కొత్తగా అమెరికా వెళ్లా లనుకునే విద్యార్థులు భారీ అప్పుల్లో పడతారు. వీసా పొడిగింపులు కూడా ఖరీదైనవిగా మారుతాయి. గ్రీన్‌కార్డు ప్రాసెస్ ఆ‌లస్యం అవుతుంది. హెచ్ వన్-బి కఠినతరం కావడంతో అమెరికా మార్కెట్‌లో ఇండియా ప్రజెన్స్ తగ్గుతుంది. ఫలితంగా బ్రెయిన్ డ్రైన్ తగ్గుతుంది. కానీ అదే సమయంలో ఇండియాలో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుంది. అయితే, ఇండియా తగినంత హై- పేయింగ్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారు తిరిగి రావాల్సిన పరిస్థితి. తిరిగి వచ్చినా ఇక్కడ తగినంత జీతం, ఉద్యోగ వాతావరణం లేక ఇబ్బందులు. కానీ దీని వలన భారతదేశానికి నైపుణ్యమైన వర్క్ ఫోర్స్ తిరిగి రావడం ఒక అవకాశమే.

భవిష్యత్తు దిశ...

అత్యంత ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, AI ఇంజినీర్లు అమెరికా రాకపోతే, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలకు టాలెంట్ కొరత వస్తుంది. సిలికాన్ వ్యాలీ వృద్ధి భారతీయ టాలెంట్ వల్లే సాధ్యమైంది. వారిని కోల్పోతే అమెరికా గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా ఉండడం కష్టం అవుతుంది. దీర్ఘకాలంలో అమెరికా ఈ రుసుములను శాశ్వతం చేస్తే, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ వంటి దేశాలకు భారతీయుల ప్రవాసం పెరుగుతుంది. H1B కాకుండా, ‘రిమోట్ వర్క్’ భవిష్యత్తు అవుతుంది. అమెరికా కంపెనీలు భారతదేశంలో నుంచే ఉద్యోగులను రిమోట్‌గా నియమించుకోవచ్చు. దీని వల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణేలో కొత్త వర్క్ హబ్‌లు ఏర్పడతాయి. ఈ వీసా రుసుము తక్షణంగా అమెరికాకు లాభం తెచ్చిపెడుతున్నా, దీర్ఘకాలంలో ప్రతిభను కోల్పోయే ప్రమాదం ఉంది. భారతదేశానికి ఇది ఒక షాక్ అయినా, అదే సమయంలో ఒక అవకాశం కూడా. ప్రతిభావంతులైన యువత దేశంలోనే స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ చేయడం వల్ల భారత్ ‘గ్లోబల్ టాలెంట్ హబ్’గా మారే అవకాశం ఉంది.

-డాక్టర్. బి.కేశవులు

ఎండి. సైకియాట్రీ,

85010 61659

Next Story