దేశ మూలవాసులు ఎవరు?నేడు వారి పరిస్థితి ఏంటి?

by Disha edit |
దేశ మూలవాసులు ఎవరు?నేడు వారి పరిస్థితి ఏంటి?
X

దేశంలో వేల యేండ్లుగా అన్ని విధాలుగా నష్టపోతున్నది ఈ దేశానికి అన్నం పెడుతున్న ఉత్పత్తి కులాలే. ఆ బీసీలే ఈ దేశ మూల వాసులు. వీరిని ఆర్యులు యుద్ధాలలో జయించి బానిసలుగా చేసుకొని ఉత్పత్తి రంగానికి పరిమితం చేసి పబ్బం గడుపుకున్నారు. ఆర్య, బ్రాహ్మణ వర్గాలు భవిష్యత్తులో కూడా విలాస జీవితం గడపడానికి అనేక ఇతిహాసాలు, పురాణాలను రచించి బీసీలకు చిక్కుముడి వేశారు.

నాడు బీసీ కులాల వారు లేకుంటే వారి మనుగడే ఉండేది కాదు. వెట్టి చాకిరీ చేయించుకున్నారు. బీసీలు చరిత్ర తెలుసుకోవాలి. దళితులు ఊరి బయట ఉన్నా ఆత్మగౌరవంతోనే బతికారు. బీసీలు అగ్రవర్ణాల చేత వివక్షకు గురయ్యారు. క్షత్రియులు,రెడ్డిలు, వెలమలు కూడా చరిత్రలో బ్రాహ్మణుల చేత హత్య చేయబడ్డారు.

అందరూ విస్మరించినవారే

బీసీలు చాలా పదాలకు అర్థాలు తెలియక బహుజన రాజ్యం కోసం అడుగులు వేయలేకపోతున్నారు. గ్రామాలలో వీరు ఉండే కాలనీలను 'గేరి' అంటారు. దీని అర్థం బీసీ కాలనీ అని. గతంపై అవగాహన లేక బీసీ యువత మతోన్మాద సంఘాలలో చేరుతున్నారు. చరితను తిరగేసి చైతన్యవంతులు కావాలి. బీసీ సమాజాన్ని చైతన్యం చేయాలి. ఇందులో బీసీ మేధావులు పాలుపంచుకోవాలి. నాడు మనువాదాన్ని విమర్శిస్తూ అత్యధికంగా సాహిత్యం రాసింది బీసీ మేధావులే. కానీ, వారి సాహిత్యం, వారి చారిత్రక రచన ఎవరికి చేరాలో వారికి చేరలేదు. బహుజనులు రాసిన ఇతిహాస రచనలు గ్రంథాలయాలకు పరిమితమయ్యాయి. వాటిని బీసీ మేధావులు వెలుగులోకి తేవాలి. రాజ్యాంగం అమలు తర్వాతే మన హక్కులు వచ్చాయి. యుగపురుషులు మనకు హక్కులు ఇవ్వలేదని ప్రజలకి తెలియజేయాలి.బహుజన రాజ్యాధికారం సంపాదించుకోవాలి. దీనికోసం బహు జనులందరిని కలుపుకు పోవాలి.

నాడు ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు ప్రాణం పోసిన దళితులు నేడు తమలో తాము అంత:కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి కులాన్ని ఒకరు దూషించుకుంటూ ఒకరికొకరు దూరం అవుతున్నారు. అందరూ ఐక్యం అవ్వాలి. గిరిజనులు నాడు ఎవరి వలన సమాజానికి దూరం అయ్యారో, వారినే నేడు భుజానికి ఎత్తుకుంటున్నారు. ఈ వైఖరి బహుజన రాజ్యానికి ప్రమాదకరం. ప్రకృతిని పూజించే పండుగలను జరుపుకుందాం. గిరిజన సోదరులు మేల్కోవాలి. ముస్లింలు దేశంలో జరుగుతున్న మతోన్మాద చర్యలకు భయపడి, ఆ పార్టీలనే ఎన్నుకుంటున్నారు. మనమందరం బహుజనులుగా కలిసి ఉండేలా ఒక అజెండా, జెండా ఉంది. దానిని ఎన్నుకొని బహుజన రాజ్యం స్థాపిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుద్దాం.

Also Read : అంబేడ్కర్ పేరుతో పాలిట్రిక్స్!


మధు సార్వభౌమ

కాకతీయ యూనివర్సిటీ

9848991225

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed