అంబేడ్కర్ పేరుతో పాలిట్రిక్స్!

by Disha edit |
అంబేడ్కర్ పేరుతో పాలిట్రిక్స్!
X

నేడు దేశ ప్రజలు భావ ప్రకటనా స్వేచ్ఛతో స్వతంత్రగా జీవిస్తున్నారంటే కారణం కచ్చితంగా రాజ్యాంగమే. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినిపిస్తున్న అంబేడ్కర్ రాగం నిజంగా ఆయన ఆదర్శం కోసమేనా? లేక ఆయన పేరు వాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికా? అన్నది ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇందులో ఏ ఒక్క పార్టీనీ ఉపేక్షించలేం. ఎందుకంటే, వారు గద్దెనెక్కేందుకు పన్నుతున్న వ్యూహాలలో అంబేడ్కర్ కామన్ సబ్జెక్ట్. రాజకీయ సభలు, సమావేశాలలో అంబేడ్కర్ ప్రస్తావన, ఫొటో లేకుండా నిర్వహించలేకపోతున్నారు. అన్ని పార్టీలు అంబేడ్కర్ పేరును జపిస్తున్నాయి. నిజంగా బీఆర్ అంబేడ్కర్ కలలను నిజం చేయగలిగే సత్తా ఏ పార్టీకైనా ఉందా అంటే సమాధానం లేదు. అంబేడ్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా, దళితుల నేతగా మాత్రమే ప్రస్తావిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

తెలంగాణలో నూతనంగా నిర్మితమవుతున్న సెక్రెటేరియేట్‌కు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు గెజిట్‌ను జారీ చేసింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుత రాజకీయం అంబేడ్కర్ చుట్టూ చేరుకుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలు అంబేడ్కర్ పేరును జపిస్తూ రాజకీయాన్ని నెరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసింది. నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరును పెట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది.

ప్రస్తుతానికి అంబేడ్కర్ చుట్టూ చేరిన పాలిటిక్స్‌లోకి ఇంకా కాంగ్రెస్ ఎంటర్ కాలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే జై భీం, జై శ్రీరామ్ నినాదాలతో వేడిని రగిలించాయి. ఇందులో భాగంగానే పార్టీలు, ప్రజా సంఘాలు సెప్టెంబర్ 17ను ఎవరికి వారు విమోచన, విలీన, విద్రోహ, దురాక్రమణ, సమైక్యతా దినంగా వర్ణిస్తూ ఘనంగా జరిపారు.

పార్టీ అంబాసిడర్లుగా మార్చుతూ

నేడు దేశ ప్రజలు భావ ప్రకటనా స్వేచ్ఛతో స్వతంత్రగా జీవిస్తున్నారంటే కారణం కచ్చితంగా రాజ్యాంగమే. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినిపిస్తున్న అంబేడ్కర్ రాగం నిజంగా ఆయన ఆదర్శం కోసమేనా? లేక ఆయన పేరు వాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికా? అన్నది ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇందులో ఏ ఒక్క పార్టీనీ ఉపేక్షించలేం. ఎందుకంటే, వారు గద్దెనెక్కేందుకు పన్నుతున్న వ్యూహాలలో అంబేడ్కర్ కామన్ సబ్జెక్ట్. రాజకీయ సభలు, సమావేశాలలో అంబేడ్కర్ ప్రస్తావన, ఫొటో లేకుండా నిర్వహించలేకపోతున్నారు. అన్ని పార్టీలు అంబేడ్కర్ పేరును జపిస్తున్నాయి. నిజంగా బీఆర్ అంబేడ్కర్ కలలను నిజం చేయగలిగే సత్తా ఏ పార్టీకైనా ఉందా అంటే సమాధానం లేదు.

అంబేడ్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా, దళితుల నేతగా మాత్రమే ప్రస్తావిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు పీవీ నరసింహారావు నుంచి ఇతర తెలుగు, తెలుగేతర నేతలతోపాటు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ వరకు అందరినీ తెర మీదకు తేవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమ ఓటు బ్యాంకును కోల్పోకుండా కాపాడుకునేందుకే వీరిని పార్టీలకు అంబాసిడర్లుగా మార్చుకుంటున్నారు. కానీ, వారి ఆశయాలను నేరవేర్చలరా? తెలంగాణ ప్రభుత్వం సెక్రెటేరియేట్‌కు అంబేద్కర్ పేరు ఖరారు చేయగానే స్పందించిన పార్టీలు ఇప్పటికిప్పుడు అంబేద్కర్‌పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందన్న ప్రశ్నలు సంధించాయి. అధికార పార్టీపై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించాయి. దళితుడిని సీఎం చేసి కొత్త సెక్రెటేరియేట్‌లో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశాయి.

సామాజిక న్యాయమంటే?

రాజ్యాంగంలో లిఖించిన పౌరుల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎప్పుడో సంకెళ్లు వేశారు. గౌరి లంకేశ్‌ హత్య, ఇతర సామాజిక ఐక్య వేదికల నేతలు జైలులో మగ్గడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో సైతం ఈ పరిస్థితులు ఉన్నది వాస్తవం కాదా? స్వేచ్ఛకు, స్వతంత్రతకు ఎప్పుడో తిలోదకాలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అవసరం కోసం పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్నాయి. పొగడ్తలను తప్ప విమర్శలను తట్టుకోలేని ప్రభుత్వాలు ఇప్పటికిప్పుడు భారతావని ముద్దుబిడ్డలను తలకెత్తుకోవడం వలన ఇప్పటివరకు చేసినవన్నీ మాఫ్ అవుతాయా? ఎంతో పవిత్రమని చెప్పుకుంటున్న రాజ్యాంగం సరిగా అమలు జరగనప్పుడు ఫలితాలు ఎలా వస్తాయి? కేవలం సెక్రెటేరియేట్‌కు, పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడంతో సామాజిక న్యాయం చేకూరుతుందా? అణగారిన వర్గాల ప్రజల జీవితాలలో మార్పు లేకుండా రాష్ట్రం, దేశం పురోగమించవనే సత్యాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి.

'దేశ ప్రగతిని నేను ఆ దేశంలో మహిళలు సాధించిన అభివృద్ధితో అంచనా వేస్తాను' అన్న అంబేడ్కర్ వ్యాఖ్యలను మననం చేసుకుంటే, ఎక్కడైనా అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? పాలకులు సాధిస్తున్న అభివృద్ధి ఏముంది? ప్రపంచంలో ఆకలి సూచీలో దేశం 104వ స్థానంలోకి వెళ్లడం తప్ప. సామాజిక న్యాయం అందరికీ జరగాలి. అణగారిన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి. అణగారిన వర్గాలంటే కేవలం దళితులనే రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అది నిజం కాదు. రాజ్యాంగం ప్రకారం అణగారిన ప్రజలు అన్ని కులాలలో ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం అమలు కావాలంటే, చెప్పడం కాదు తగిన కార్యాచరణ రూపొందించి, చేసి చూపించాలి.

Also Read : దేశ మూలవాసులు ఎవరు?నేడు వారి పరిస్థితి ఏంటి?


దండా రామకృష్ణ

93925 50841

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed