- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశమెటు వెళ్తోంది?
ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైకి సాధారణంగా కనిపించే సంఘటనల వెనుక విద్వేషపూరిత భావజాలం పనిచేస్తోంది. సగటు మనిషి ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైకి సాధారణంగా కనిపించే సంఘటనల వెనుక విద్వేషపూరిత భావజాలం పనిచేస్తోంది. సగటు మనిషి ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి. భిన్నాభిప్రాయాలను సహించలేని స్థితి పెరిగి, కులం లేదా మతమే వ్యక్తి గుర్తింపుగా మారుతోంది. ‘మనవాళ్లు–పరాయివాళ్లు’ అనే విభజన సమాజాన్ని లోపల నుంచి చీల్చుతోంది. హిందువులు హిందువుల దుకాణాల్లోనే కొనాలనే పిలుపులు విద్వేషానికి నిదర్శనం. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలకులపై ప్రయోగించిన సహాయ నిరాకరణను నేడు మనతోటి భారతీయులపైనే ప్రయోగించడం కంటే దారుణం ఇంకేముంటుంది? “మనమంతా భారతీయులం” అనే భావన స్థానంలో, “హిందువులే ఈ దేశానికి యజమానులు” అనే ప్రమాదకర రాజకీయ ప్రచారం ముందుకు వస్తోంది. ఈ సంకుచిత దృక్పథం వల్ల దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతింటుందన్న స్పృహ లేకుండా ప్రజలను మతపరంగా రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, విద్వేష సందేశాలు నిర్ఘాంతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ప్రశ్నించకుండా నమ్మే గుంపు మనస్తత్వం పెరుగుతోంది. ఇది కొందరు నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ప్రమాదకర ఆట. భారతదేశం లౌకిక, ప్రజాస్వామ్య దేశం. కులమతాలకు అతీతంగా అందరూ సమానులని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. అయితే రాజ్యాంగం అవసరం లేదని, ప్రాచీన ధర్మశాస్త్రాలే అసలు రాజ్యాంగమని వాదించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే ఆ ధర్మశాస్త్రాలు సమానత్వాన్ని కాదు, కులవ్యవస్థను రక్షించాయి. ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా నిలవాలి. ఫూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం చూపిన బహుజన తాత్వికతే దేశాన్ని నిజమైన సమానత్వం వైపు నడిపించగలదు.
-తోకల రాజేశం
96767 61415






