- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లడాఖ్‌కి న్యాయం ఎప్పుడు?
లడాఖ్‌లో లేహ్ పట్టణంలో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపు దాల్చడం, నలుగురి మృతికి దారి తీయడం ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం

లడాఖ్‌లో లేహ్ పట్టణంలో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపు దాల్చడం, నలుగురి మృతికి దారి తీయడం ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చినా, దీర్ఘకాలిక పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ నుండి వేరుగా కేంద్ర పాలిత ప్రాంతంగా 2019లో లడాఖ్ ఏర్పడినప్పుడు అక్కడి ప్రజల్లో సంతోషం వ్యక్తమైంది. తమ చిరకాలపు కోరిక ఒక రాష్ట్రంగా ఏర్పడడం. అది సాధ్యం కావడానికి మొదటి మెట్టుగా భావించారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం, స్థానికంగా లేహ్ ప్రాంతానికి, కార్గిల్ ప్రాంతానికి చెరొక అభివృద్ధి మండళ్ల ఏర్పాటు ద్వారా పాలన సాగిస్తోంది. క్రమంగా అక్కడ పర్యాటకం పెరిగింది. అక్కడి ప్రజలు తమకు రాష్ట్ర హోదాతో పాటు, ఈశాన్య రాష్ట్రంలో అమలవుతున్న ఆరవ షెడ్యూల్ - గిరిజన ప్రాంతాలకు స్వయం పాలన కోరుతూ వస్తున్నారు. ఆ దిశగా నిరసనలు, నిరహార దీక్షలు కొంత కాలంగా జరుగుతున్నా పెద్ద స్థాయిలో హింస ప్రబలడం ఇదే మొదటిసారి. లడాఖ్ ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతం. పాకిస్తాన్, చైనాల సరిహద్దులో ఉండడం వల్ల, ఇప్పటికే వారితో కొన్ని వివాదాలుండడం వల్ల కేంద్రం ఏమరుపాటుగా ఉండే వీలులేదు. అక్కడి పరిస్థితి పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల డిమాండ్లలో హేతుబద్ధమైన వాటిని తక్షణం పరిష్కరించాలి, మిగిలిన వాటిపై పరిశీలనకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం అవసరం. అలాగే ఉద్యమ నాయకుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవడం సబబు కాదు. హింసకు ఆయనే కారకుడని తేలకుండానే జాతీయ భద్రతా చట్టం ద్వారా అరెస్ట్ చేయడం అన్యాయం. ఉద్యమం మరింత తీవ్రం కాకూడదనుకుంటే అంతవరకూ ఓపిక పట్టడం అత్యవసరం. మరోవైపు అక్కడ అభివృద్ధి చూపిస్తూ అక్కడి ప్రజల విశ్వాసం పూర్తిగా పొందాల్సి ఉంది. పరిష్కారం ఆలస్యమయ్యే కొద్దీ అక్కడి మంటలతో చలి కాసుకోవడానికి పొంచి ఉన్న శక్తులకు బలం పెరుగుతుంది. దాన్ని నివారించడం ఆవశ్యం.
-డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931






