రాజ్య భాషగా హిందీ ఉంటే తప్పేంటి..?

by Ravi |   (  Updated:2025-09-14 01:00:15  IST  )

ఇరాన్‌కు చెందిన పార్సీ ప్రజలు పిలిచిన సిందూ పదం నుంచి పుట్టిన హిందీ భాష ప్రామాణిక భాషగా రూపొందడానికి సుదీర్ఘ కాలం పట్టింది.

రాజ్య భాషగా హిందీ ఉంటే తప్పేంటి..?
X

ఇరాన్‌కు చెందిన పార్సీ ప్రజలు పిలిచిన సిందూ పదం నుంచి పుట్టిన హిందీ భాష ప్రామాణిక భాషగా రూపొందడానికి సుదీర్ఘ కాలం పట్టింది. మొదట వైదిక భాష, అది మౌఖిక భాష. దానిని వైదిక సంస్కృతం అని కూడా అంటారు. వైదిక సంస్కృతంలో వేదాలను రాశారు. ‘పాణిని’ అనే పండితుడు వైదిక సంస్కృతానికి వ్యాకరణం రాసి సంస్కరించాడు. తద్వారా వ్యాకరణ బద్దమైన పరిస్కృత, సంస్కృత భాషగా రూపొందింది. ఇందులోనే రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు రాశారు. కానీ, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేనందున, అప్పటి మేధావులు కొందరు సామాన్య ప్రజల భాష ‘పాళీ’ని ప్రయోగించారు. తొలిసారిగా బుద్దుడు ‘పాళీ’ భాషను ఉపయోగించాడు. తన బోధనలను పాళీభాషలోనే చేశాడు. అశోకుడు, శిలాశాసనాలు పాళీ భాషలో వేయించాడు. అలా పాళీభాష నుండి ప్రాకృతం, ప్రాకృతం నుండి అపభ్రంశం, అపభ్రంశ భాష నుండి శౌరసేని, అర్దమాగదీ, మగదీ.. ఆ విధంగా, అపభ్రంశ భాషల నుండి ఆధునిక ‘హిందీ భాష ఉద్భవించింది.

ఆధునిక హిందీ ఆవిర్భావం

హిందీ సాహిత్య విద్వాంసుల ప్రకారం 1850 లేదా 1900 సంవత్సరం నుండి సంపూర్ణ ఆధునిక హిందీ భాషగా ఏర్పడింది. హిందీ సాహిత్య చరిత్రలో ఆది కాలం నుండి, నేటి ఆధునిక కాలం వరకు, తత్సమ, తద్భవ, స్వదేశీ, వి దేశీ, తుర్కీ, ఫార్సీ, ఉర్దూ..మొదలగు అనేక పదాలను తనలో ఇమిడించుకున్న ది. తద్వారా సంపూర్ణమైన, ఉన్నతమైన, పరిపూర్ణమైన భారతీయ సంధాన లే దా సంబంధ భాషగా, అభివృద్ధి చెందిన భాషగా ఏర్పడింది. ఈ రోజుల్లోనైతే పేదవర్గాల నుండి, ధనిక వర్గాల వరకూ ఇంగ్లీష్ భాష చేత ప్రభావితులవుతున్నా రు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అవసరమే. కానీ మాతృభాషను మరవకూడదు.

ఇతర భాషలు కొనసాగించవచ్చు..

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు దేశంలో ‘హిందీ’ని జాతీయ భాషగా గుర్తించాలనే ప్రస్తావన వచ్చింది. కానీ అంతకుముందు ఎప్పుడూ కూడా భారతీయులందరు ఒకే జాతీ అనే భావన లేదు. ఎందుకంటే! ఈ దేశం బహుళ జాతీయ, బహుళ సాంస్కృతిక, బహుళ భాషలు కలిగిన దేశం కావడం వలన, దక్షిణ భారతీయులు, ‘హిందీ’ని జాతీయ భాషగా అంగీకరించలేదు. కానీ 1949 సెప్టెంబర్ 14న, ‘హిందీ’ ని రాజభాషగా గురించి, రాజ్యాంగంలో పొందుపరిచారు. ‘రాజ్ భాష’ అనగా రాజ్యం భాష అని అర్థం. అంటే రాజ్యం ప్రభుత్వ కార్యకలాపాలు, ఏ భాషలో జరుగుతాయో అదే ఆ రాజ్యం అధికారభాష అవుతుంది. దీనికి సమాంతరంగా స్థానిక భాష లేదా ఇంగ్లీష్‌ను కొనసాగించవచ్చు. దీనికి అనుగుణంగానే, ఉత్తరాది రాష్ట్రాలలో రాష్ట్ర అధికార భాష హిందీతోపాటూ ఇంగ్లీష్‌‌ని కూడా ఉపయోగిస్తారు. అదే దక్షణాది రాష్ట్రాల్లో రాష్ట్రం(రాజ్) అధికార భాషగా, స్థానిక భాషతోపాటు ఇంగ్లీష్ భాషను కూడా ఉపయోగిస్తారు.

దేశ అనుసంధాన భాష

ఐతే, ఇక్కడా ఒక ప్రశ్న తలెత్తక తప్పదు. అది రాజ్యాంగంలోని 8వ సూచికలో, ‘హిందీతోపాటు దక్షిణాది భాషలైన ‘తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఉన్నాయి. అదేవిధంగా గుర్తింపుకు నోచుకోనివి ఆదివాసీ భాషలు కూడా ఉండగా కేవలం ‘హిందీ’నే రాజ్ భాషగా గుర్తించడం వెనకాల కుట్రలేమన్నా ఉన్నాయా? అని కానీ అలాంటివి ఏవీ లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే ‘హిందీ’ భాష మాట్లాడే వాళ్ల సంఖ్యా, మిగతా దక్షిణాది రాష్టాల భాష మాట్లాడేవాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా, కొద్దో-గొప్పో ‘హిందీ’లో మాట్లాడేవాళ్లు ఉంటారు. కనుక హిందీ భారతదేశానికీ సంధాన భాష అని చెప్పవచ్చు.

జ్ఞాన.. వైజ్ఞానిక భాషగా పరిణామం

ప్రపంచంలోని మంచి మంచి పుస్తకాలు హిందీ లోకి అనువదించబడినాయి. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో హిందీ భాషను ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా హిందీ జ్ఞాన.. వైజ్ఞానిక భాషగా వెలుగుతోంది. పై విధంగా ‘హిందీ’ భాష వైదిక సంస్కృతం నుండి సంస్కృతంగా, సంస్కృతం నుండి, ‘పాళీ’గా, పాళీ నుండి ’ప్రాకృతం’గా, ప్రాకృతం నుండి ‘అపభ్రంశం’గా, అపభ్రంశం నుండి ఆధునిక ‘హిందీ’గా, రాజ్ భాష ‘హిందీ’గా పరిణమించింది.

(నేడు హిందీ దివస్ సందర్భంగా)

డాక్టర్. బొంద్యాలు బానోత్

హిందీ అధ్యాపకులు

98857 52706

Next Story