- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గౌడన్నల జీవితాలకు భరోసా ఏది?
సమాజంలో ప్రతి రంగంలో రోజు రోజుకి ఎన్నో మార్పులు చోటుచేసుకుని నవ శకానికి నాంది పలుకుతుంటే ఒక గీత కార్మికుల

సమాజంలో ప్రతి రంగంలో రోజు రోజుకి ఎన్నో మార్పులు చోటుచేసుకుని నవ శకానికి నాంది పలుకుతుంటే ఒక గీత కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు మారినా గీత కార్మికుల జీవన విధానంలో విలక్షణమైన మార్పులు రావడం లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు పోరాటమే భవితగా ముందుకు సాగుతున్న ఈ జాతికి భరసానిచ్చే వారేవరు? కుల వృత్తి జీవన భృతిగా సాగుతున్న వీరి బతుకులకు రక్షణ కరువైంది. ప్రభుత్వాలు జీవోల పేర్లతో సర్క్యులర్ల సాకుతో కాల క్రమంగా గీత వృత్తి ఉనికిని దూరం చేస్తున్నారే తప్ప వృత్తి పరిరక్షణకు ఉపాధి కల్పనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఓ వైపు తాటి, ఈత వనాలు పెంచుతామని చెబుతూ వాటి పర్యవేక్షణను గాలికి వదిలేశారు. ప్రస్తుతం పంట భూముల్లో ఉన్న తాటి, ఈత చెట్లను కొంత రుసుము చెల్లించి తొలగించుకోవచ్చనే నిబంధన గౌడన్నల జీవనోపాధికి బీటలు పారేలా చేస్తుంది. ఇక ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి దుర్మరణం చెందిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా మంజూరైనా, బాధిత గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన పాపాన పోలేదు. రోజురోజుకూ నిర్లక్షమవుతున్న మా జీవితాలను ఇప్పటికైనా ప్రభు త్వాలు సరిచేయాలి. అందుకోసం గౌడ కార్పొరేషన్, యువతకు తాటి టాపర్ బోర్డు, వృద్ధ గీత కార్మికులకు పింఛన్లు, తాటి ఈత వనాల పెంపకానికి మరుగుజ్జు రకానికి చెందిన చెట్లను అందించడం, తాడిచెట్టు ఎక్కే యంత్రాలను అందిం చడం వంటివి చేయాలి. అలాగే తాటి చెట్లు ఎక్కి కల్లు గీసుకునే గీత కార్మికులు ప్రమాదవశాత్తు పడి మరణిస్తే, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం రూ.5లక్షల బీమా నుండి 10 లక్షల వరకు వర్తింపజేయాలి. గీత వృత్తిని అభివృద్ధి చేసేందుకు సబ్సిడీ పథకాలు రూపొందించాలి. ప్రభుత్వాలు గౌడ జాతిపై చిన్న చూపు చూడకుండా గౌడన్న బతుకులకు భరోసా నిచ్చే కార్యక్రమాలు రూపొందించాలి.
- వంశీకృష్ణ గౌడ్ బండి
95508 37962






