మేమూ ఉత్తమ ఉపాధ్యాయులమే!

by Ravi |   (  Updated:2025-09-05 00:30:14  IST  )

సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి

మేమూ ఉత్తమ ఉపాధ్యాయులమే!
X

సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా కొందరిని గుర్తించి వారిని అధికారికంగా సన్మానించి ధృవ పత్రాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అవార్డుతో ఉపాధ్యాయులలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసి విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రభుత్వం సంకల్పంతో చేపట్టే ఈ కార్యక్రమాన్ని అభినందించాల్సిందే. అయితే ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు, అనుబంధ పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే అన్వయిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను విస్మరించడం జరుగుతోంది. మన తెలం గాణ రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులకు గానూ 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, కళాశాలలో పనిచేసే అతిధి ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోటీపడి విద్యా బోధన చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల వలె ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా పీజీలు, బీఈడీ, టెట్ పరీక్షలు పాసై ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కేవలం ఒకటి లేదా రెండు మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి ప్రైవేటు పాఠశాలల్లో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో చదివిన పిల్లలు, ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే వారి వెనుక ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి, శ్రమ ఎంతో ఉంది. ఇటువంటి శ్రమను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి ప్రభుత్వంచే సత్కరించి ప్రైవేటు ఉపాధ్యాయులలో నూతన ఉత్సాహాన్ని నింపాలని కోరుతున్నాం. ప్రైవేటు ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఉన్న చిన్న చూపులు తీసివేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.

- కట్ట ప్రశాంత్ కుమార్

93932 57697

Next Story