- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైక్ చేసినా వీసా రద్దు.. ఇదేనా అమెరికా న్యాయం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాల యాలైన ఆక్స్‌ఫర్డ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాల యాలైన ఆక్స్‌ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి, విద్యా ప్రమాణాలపై, అలాగే విదేశీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ చర్యలు విద్యా సంస్థల పరువును దెబ్బతీసేలా, విద్యార్థులను భయాందోళనకు గురిచేసేలా ఉన్నా యనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రముఖ విశ్వవిద్యాలయాలపై నిధుల కోతలు, విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై ఆంక్షలు, వారి వీసాలను రద్దు చేయడం ద్వారా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లకు అనుమతిని రద్దు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఫెడరల్ కోర్టు దీనిని తాత్కాలికంగా అడ్డుకుంది. అయితే ట్రంప్ కోర్టు తీర్పులను లెక్కచేయకుండా, ఈ చర్యలను కొనసాగిస్తున్నారు, ఒక నెలలోనే 1,000 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. ముఖ్యంగా హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలో సామాజిక మాధ్యమాలలో భావప్రకటనలు, ఆందోళనలలో పాల్గొనడం వంటి కారణాలతో వీసాలు రద్దు చేయడం దారుణం. ఇది అమెరికా విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2024లో విదేశీ విద్యార్థుల నుండి 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. కానీ ట్రంప్ ఆంక్షలతో ఈ ఆదా యాన్ని దెబ్బతీస్తాయని యూనివర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. ఇక 2024లో అమెరికాలో 2.7 లక్షల భారతీయ విద్యార్థులు చదువుతున్నారు, వారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా సహకరిస్తున్నారు. కానీ ట్రంప్ చర్యలు వారిని బెదిరిస్తున్నాయి.. ట్రంప్ చర్యలతో విదేశీ విద్యార్థులను అమెరికాకు రాకుండా నిరుత్సాహపరుస్తాయి, ఇది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక, విద్యా, సాంస్కృతిక ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. ఇప్పటికైనా విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడం, విదేశీ విద్యార్థులకు సహకారం అందించడం ద్వారా అమెరికా తన ప్రపంచ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలి.
- డాక్టర్ కిషోర్ ప్రసాద్
98493 28496






