సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం!

by Ravi |   (  Updated:2025-07-26 00:31:25  IST  )

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నా యి. ఈ వర్షంలో అపరిశుభ్రతకు ఏ మాత్రం తావు ఇచ్చినా మనం మలేరియా, టైఫాయిడ్, జ్వరం

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం!
X

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నా యి. ఈ వర్షంలో అపరిశుభ్రతకు ఏ మాత్రం తావు ఇచ్చినా మనం మలేరియా, టైఫాయిడ్, జ్వరం, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణాం తక వ్యాధుల బారిన పడటం ఖాయం. మనమంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తో పాటు మన ఇంటిని, మన ఇంటి పరిసరా లను సైతం అత్యంత శుభ్రంగా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ వర్షాకాలంలో ఏ మాత్రం అపరిశుభ్రతకు తావు ఇచ్చినా అవి దోమలకు నివాసాలుగా మారడంతో పాటు మన ఇంటిలో తిష్టవేసి, మనపై దాడి చేసి మన రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దోమ కాటు వల్ల ప్రబలే డెంగ్యూ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. ఇది మనకు సోకితే తీవ్ర తల నొప్పి, కండరాల, కీళ్లనొప్పులు రావడంతో పాటు, విరోచనాలు, వాంతులు, చర్మంపై దురదలు వంటివి ఏర్పడతాయి. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది మనకు ప్రాణాంతకంగా సైతం మారే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు మన ఇంటిలోని చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావ చూపుతూ ఉంటాయి. ఈ సీజనల్ వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే ఎప్పటిక ప్పుడు మనం శుభ్రంగా ఉండటంతో పాటు, మన ఇంటిలోకి దోమలు ప్రవేశించడానికి వీలు లేకుండా దోమ తెరలు, జెట్ వంటివి వాడుకుంటూ తగు జాగ్ర త్తలు పాటిస్తే అది మనకు, మన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిరక్ష ణకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే వేడిచేసి, కాచి చల్లార్చి న నీటిని అధికంగా తాగుదాం, వేడి వేడి అన్నం, కూరలను తిందాం. మన ఆరోగ్యాన్ని మరో పదికాలాల పాటు కాపాడుకోవాలంటే అత్యం త అప్రమ త్తంగా మసలుకోవడం మనకుమంచిది.

-కామిడి సతీష్ రెడ్డి,

98484 45134

Next Story