- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనజాగృతి గీతం – వందేమాతరం..!
భరత జాతి బానిసత్వ విముక్తి గీతంగా వందేమాతరం-150 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం 2025 నవంబర్ 7న, ఉ. 10 గంటలకు యావత్తు జాతి చేత సామూహిక గీతాలాపన చేయించనుంది. సందర్భంగా

భరత జాతి బానిసత్వ విముక్తి గీతంగా వందేమాతరం-150 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం 2025 నవంబర్ 7న, ఉ. 10 గంటలకు యావత్తు జాతి చేత సామూహిక గీతాలాపన చేయించనుంది. సందర్భంగా ఆ వందేమాతరం గీతం ప్రస్థానంలోకి వెళ్దాం...ఈ రెండు మాటలు కేవలం గీతం లోని పదాలు మాత్రమే కాదు, భారత జాతి ఊపిరి. బానిస సంకెళ్లలో చిక్కుకున్న దేశానికి ఆ గీతం నూతన శ్వాసనిచ్చింది. ఈ ఒక్క నినాదమే ప్రజల్లో స్వాతంత్ర్య చైతన్యాన్ని మేల్కొలిపి, దేశమంతా ఒకే తాటిపై నడిపించింది.
వందేమాతర గీత ప్రాముఖ్యత..
భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి జరిగిన పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగింది. ఈ సుదీర్ఘ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో పోరాట యోధులు తమ ధన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశా రు. ఆ సమరంలో ‘వందేమాతరం’ గీతం ఒక స్ఫూర్తి మంత్రం గా మారింది. ఇది కేవలం నినాదం కాదు. మనోబలం, మాతృభూమి పట్ల ప్రేమ, ఆత్మవిశ్వాసాల కలయిక.
గేయమే పోరాటరూపమై..
నిరంకుశ బ్రిటిష్ పాలకులు ఉద్యమకారులను చితకబాదేవారు. ఇలా పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు, అందరూ ఈ గేయం, నినాదంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆ గీతం ప్రజల హృదయాలలో దావానలంలా వ్యాపించింది. బిపిన్ చంద్ర పాల్ దీన్ని దేశానికి పరిచయం చేసి ప్రాచుర్యం కల్పించారు. భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను చెరిపి దేశాన్ని ఒక్క తాటిపై నిలిపిన చైతన్య గీతం ఇది.
వందేమాతరం గేయ భావం
సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్యశ్యామలాం మాతరం! వందేమాతరం!.
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం,
సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం! వందేమాతరం!. తల్లీ! భారతమాత నీకు వందనం! తీయని జలాలతో, కమ్మని ఫలాలతో, చల్లని మలయా మారుతాలతో, పచ్చని పైర్లతో వెలసిల్లే తల్లీ నీకు వందనం!. పండు వెన్నెల రాత్రులలో విరబూసిన తరూలతలతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలను కలిగిస్తూ వరాలనిచ్చే, తల్లి నీకు వందనం!.
నచ్చితే పాడండి లేకుంటే విసిరేయండి
భాషా మిశ్రమం గురించి విమర్శలు ఎదురైనా ఆయన తగ్గకపోగా ‘మీకు నచ్చితే పాడండి, లేకుంటే విసిరేయండి. దీని విలువ ప్రపంచం గుర్తిస్తుంది’ అని అన్నారు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతంలోని ఆధ్యాత్మికతను గుర్తించి దేశాన్ని మాతృమూర్తిగా చూపించే విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. 1886లో అనేక సభల్లో స్వయంగా ఆలపించారు. 1947 ఆగస్టు 15న మన స్వాతంత్ర్య సిద్ధించిన రోజున పార్లమెంట్‌లో సంగీతకారుడు ఓం ప్రకాశ్ ఈ గీతాన్ని ఆలపించారు.
జాతి చైతన్యానికి నిత్య దీప్తి.
భారత సంస్కృతిలో ‘అసతోమా సద్గమయ’, ‘సత్యమేవ జయతే’, ‘జననీ జన్మభూమిశ్చ’, ‘మా ఫలేషు కథాచనా’ వంటి వాక్యాలతో పాటు...ప్రపంచ స్థాయి నో దై సెల్ఫ్..సోక్రటీస్ సూత్రం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అనే మార్క్స్ నినాదం మానవ వికాసానికి మైలురాళ్లు అయి నట్లే, ‘వందేమాతరం’ కూడా ఆ కోవకు చెందిన మహోన్నత నినాదం. ఇది భారత జాతి ప్రాణాల్లో నిత్యం ప్రజ్వరిల్లే అగ్నికణం. భరత జాతి బానిసత్వ విముక్తి గీతం. వందేమాతరం జాగృతి గీతానికి సరిగ్గా 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా, మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యావత్ భరతజాతి నవంబర్ 7న ఉ. 10 గంటలకు వందేమాతరం గీతాలాపన చేయాలని ఆదేశాలు ఇవ్వడమైనది. నేటితరం, ఆనాటి త్యాగాల స్ఫూర్తితో భారత దేశ ప్రగతికి, అభివృద్ధికి పునరంకితం కావలసి ఉంది.
(నేడు వందేమాతరం గేయరచనకు 150 ఏళ్లు)
-మేకిరి దామోదర్
95736 66650






