- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలా చేయనంత వరకు.. రవి పోతే రమేష్ వస్తాడు కానీ పైరసీ ఆగదు!
సినిమా ఒకప్పుడు కొందరి వినోదం మాత్రమే. కానీ నేడు అది ప్రతి వాడి జీవితంలోకి చొరబడి, వారి భావోద్వేగాలను శాసించే భారీ శక్తిగా మారిపోయింది. ప్రస్తుతం హీరోలు దేవుళ్లలా చూస్తున్న ప్రేక్షకుల అజ్ఞానాన్నీ, అమాయక త్వాన్నీ మార్చాల్సింది పోయి.. టికెట్ ధరలు పెంచి మధ్యతరగతి జేబులను ఖాళీ చేస్తున్నాయి.

సినిమా ఒకప్పుడు కొందరి వినోదం మాత్రమే. కానీ నేడు అది ప్రతి వాడి జీవితంలోకి చొరబడి, వారి భావోద్వేగాలను శాసించే భారీ శక్తిగా మారిపోయింది. ప్రస్తుతం హీరోలు దేవుళ్లలా చూస్తున్న ప్రేక్షకుల అజ్ఞానాన్నీ, అమాయక త్వాన్నీ మార్చాల్సింది పోయి.. టికెట్ ధరలు పెంచి మధ్యతరగతి జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఈ దోపిడీని చూడలేని ప్రేక్షకులే ‘ఐబొమ్మ రవి’ని హీరోగా చూస్తున్నారు. రవిని అరెస్ట్ చేసి పైరసీ కొన్ని రోజులు ఆపొచ్చు.. కానీ ఇండస్ట్రీ మూల సమస్యను ఆపకపోతే రవి పోతే రమేష్ వస్తాడు.. పైరసీ ఆగదు..
తెలుగు ప్రేక్షకుడిలో సినిమా హీరో, దేవుడూ ఇద్దరూ ఒక్కటే.. భక్తి, సినిమాల మీద రక్తి రెండూ ఒక్కటే. సినిమా హీరోల పట్లా, దేవుళ్ల పట్ల భక్తి పెరగడానికి కారణమయ్యే అజ్ఞానాన్ని, అమాయకత్వాన్నీ పెంచి పోషించే వ్యవస్థలూ, ప్రభుత్వాలూ ఉన్నాయి. అందుకే ఈ దేశంలో రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి మతం దేవుడు అనే అజ్ఞానంలో ముంచుతుంటే సినిమా వ్యాపారస్తులు అదే వస్తువుతో లాభాలు గడిస్తున్నారు..
ఐబొమ్మ రవి చేసింది తప్పని తెలిసినా..
ఐ బొమ్మ రవి అరెస్ట్ అయ్యాక.. తెలుగు ప్రేక్షకులు vs ఇండస్ట్రీగా పరిస్థితి మారింది. చాలా మంది మధ్యతరగతి ప్రేక్షకులు రవి చేసింది తప్పే అయినా, పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్‌కు పోలేని మాకు ఫ్రీగా సినిమా చూపించాడు కదా! అందుకే మా సపోర్ట్ ఆయనకే అంటు న్నారు.. అది 100% నిజమే. ఒక ఫ్యామిలీకి థియేటర్లో సినిమా చూడాలంటే కనీసం వెయ్యి రూపాయలు టికెట్లకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. థియేటర్‌లో స్నాక్స్ అదనం. ఇదే సినిమా కొన్ని రోజులకు ఐబొమ్మలో HDలో రిలీజ్ అవుతుంది. అది ఫ్రీగా కుటుంబం మొత్తం చూడొచ్చు. అందుకే చాలా మంది మనసులో రవి హీరోలా కనిపిస్తాడు. రవి చేసింది చట్టపరంగా తప్పే అయినా, మధ్యతరగతి వాడి జేబుకి మాత్రం రిలీఫ్. అయితే ఇక్కడ ఇంకో నిజం కూడా ఉంది. రవి లాంటి వాళ్లు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి.. మీ డేటా, ప్రైవసీ, ఫోన్ సెక్యూరిటీ దోచుకుంటున్నారు. (అక్కడ కనిపించే యాడ్స్ క్లిక్ చేస్తే మాల్వేర్, బ్యాంక్ డీటెయిల్స్ లీక్ అయి వారికి చేరిపోతాయి) రవి చేసింది తప్పని తెలిసినా అతను ఎందుకు హీరో అయ్యాడు అంటే, ఇండస్ట్రీ మధ్యతరగతి వాళ్లని థియేటర్‌కు దూరం చేయడం.
నిర్మాతలు ప్రేక్షకుల మీద రిస్క్ వేసి..
పెద్ద సినిమాలు రిలీజైతే, స్పెషల్ షోలు, హైక్ రేట్లతో కొన్ని సినిమాలు ఫస్ట్ వీక్ మొత్తం మల్టీప్లెక్స్‌లో సింగిల్ స్క్రీన్ కంటే డబుల్ టికెట్ రేటు పెట్టేస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీతో వెళ్తే 4 టికెట్స్ ఈజీగా 2 వేలు ఖర్చు అవుతోంది. దీంతో మధ్య తరగతి నెలకి ఒక్క సినిమా కూడా చూడలేని స్థితి వచ్చింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నిర్మాతలు, హీరోలు ‘బిగ్ ఓపెనింగ్’ కోసం గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని రేట్లు పెంచేస్తున్నారు. బిగ్ బడ్జెట్ సినిమాలు రిస్క్ ఎక్కువ కాబట్టి వాళ్లు ప్రేక్షకుడి మీద ఆ రిస్క్ వేసి పెట్టుబడిని రికవరీ చేసుకోవాలనుకుంటున్నారు.. ఐ బొమ్మ రవి విషయంలో, నిర్మాతల విషయంలో రెండు వైపులా తప్పుంది. అయి నప్పటికీ పైరసీ అంటే దొంగతనం లాంటిది. అది ఎదుటి వాడి హక్కు పూర్తిగా లాక్కోవడం వంటిది. ఎక్కువ టికెట్ రేటు అంటే ఒక రకంగా ‘అత్యాశ’ కానీ నువ్వు ఇష్టం లేకపోతే చూడక్కరేదు. కానీ పైరసీ సినిమా కోసం నీ బ్యాంక్ అకౌంట్, ప్రైవసీ రిస్క్ చేయాలా?
ఇండస్ట్రీ ఇది మార్చుకోకపోతే..?
టికెట్ రేట్ల పెరుగుదల 1950ల నుంచి పెరుగుతూ వచ్చిందే, కానీ ప్రేక్షకుడు భరించే విధంగా ఉండేది. కానీ 2010 తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. దీంతో నిర్మాతలు ఖర్చు ఎక్కువ పెట్టామని ప్రతీ సినిమాకు హైక్ ఇప్పించుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వం ఆపినా.. ఇండస్ట్రీ లాబీ చేసి పెంచుకుంటోంది. ప్రస్తుతం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. మా హీరో/డైరెక్టర్ కోసం ఏం చేయడానికైనా రెడీ’ అన్న ప్రేక్షకుడి ఫీలింగ్‌ని బిజినెస్‌గా మార్చేస్తున్నారు. ప్రమోషన్ల పేరుతో, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ పేరుతో బిజినెస్ మోడల్ పాటిస్తూ కోట్లు ఖర్చు పెడుతున్నారు.. నిజానికి ఈ ప్రమోషన్ల పేరుతో నిర్మాతలు అనవసర ఖర్చు పెట్టకుండా, టికెట్ ధర తగ్గిస్తే ప్రేక్షకుడు కుటుంబంతో సినిమాకు వస్తాడు.. సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. అలా చేయకపోవడంతోనే ప్రేక్షకుడు పైరసీ బాట పడుతున్నాడు. ఇది మారకపోతే... రవి వెళ్లిపోయినా రమేష్ వస్తాడు, రాజు వస్తాడు. పైరసీ సైకిల్ ఆగదు. సినిమాని బిజినెస్‌గా కాకుండా కళగా చూడండి.
- బసడ సంపత్ యాదవ్
70321 32593






