- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ దెబ్బకు.. ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదా?
సంపద కేంద్రీకరణతో ప్రపంచమంతా ఆకలి కేకలతో మారుమోగుతుంటే ప్రపంచ ధనిక దేశాలలో నెంబర్ వన్‌గా

సంపద కేంద్రీకరణతో ప్రపంచమంతా ఆకలి కేకలతో మారుమోగుతుంటే ప్రపంచ ధనిక దేశాలలో నెంబర్ వన్‌గా ఉన్న అమెరికాకు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది. 2024లో అమెరికా వాణిజ్య లోటు 918 బిలియన్ డాలర్లు. ఈ వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై అధిక మోతాదులో టారిఫ్స్ విధిస్తున్నారు. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలను ఆరంభించినట్లయింది.
ఇప్పటికే చైనా, కెనడాతో పాటు పలు యూరప్ దేశాలు సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించిచాయి. ఫలితంగా పలు దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన దేశంలో కీలక రంగాల్లో ఈ ప్రభావం పడింది.
మన రొయ్యలపై దెబ్బేసిన ట్రంప్!
అమెరికా, మన దేశం నుండి రొయ్యల ఎగుమతులపై సుంకం ఏకంగా 3 నుంచి 26 శాతానికి పెంచింది. ఫలితంగా క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే స్టీల్ ఎగుమతులపై సుంకం పెంచడంతో ఈ రంగం దెబ్బ తినడం ఖాయం. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో తయారయ్యే గార్మెంట్స్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగుమతులు తగ్గిపోయి భారీ స్థాయిలో నిరుద్యోగత ఏర్పడుతుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఎగుమతులు ఈ సుంకాల వలన గణనీయంగా తగ్గిపోతాయి. ఫార్మా ఉత్ప త్తుల ఎగుమతులు ప్రధానంగా దెబ్బతింటాయి. ఇప్పటివరకు ఫార్మా క్యాపిటల్‌గా పేరు గాంచిన భారత్, ఆ పేరు కోల్పోవాల్సి వస్తుంది. మన దేశంలో ప్రజల ఉత్పాదక తగ్గి ఆదాయాలు పడి పోయి. ఆదాయ అసమానతలు పెరిగిపోతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కుదేలవుతోంది.
అమెరికాకు ఎగుమతి చేసిన ఫలితం!
2023లో చైనా, మన దేశం నుండే అమెరికా ఎక్కువగా వస్తువులు దిగుమతి చేసుకోగా, 2024 డిసెంబర్ కల్లా మనం ఎక్కువగా అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసి చైనా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరిగింది. 2023 - 24లో అమెరికాతో మనకు విదేశీ వాణిజ్యం మిగులు 36.8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా రంగంలో మందులు, ఔషధాల ఎగుమతి జరి గేది. నేడు అమెరికా అధ్యక్షుడు మన దేశంపై కూడా సుంకాల విధించడం వలన భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్లు ఢమాల్
అమెరికా పెంచిన సుంకాలు అమలు కావ డంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కె ట్లు అన్ని పడిపోయాయి. హాంకాంగ్, చైనా, భారత్ స్టాక్ మార్కెట్లు నిన్న కుప్పకూలాయి. హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 10% వరకు పడిపోయింది. ఎస్ అండ్ పి 500 అయితే ఆరు శాతం, డౌన్ జోన్స్ అయితే 5.5%, నాస్ డాగ్ అయితే 5.8 శాతం కోల్పోయాయి. కరోనా లాంటి పాండమిక్ తర్వాత ఇలా స్టాక్ మార్కెట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. మొత్తంగా తొమ్మిది ట్రిలియన్ డాలర్లు రెండు రోజుల్లో ఆవిరి అయిపోయాయి. 2008 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల ప్రభావం వంద దేశాలపైనే కాకుండా వేల కోట్ల ఆదాయం ఉన్న సంపన్నులపైనా పడింది. రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లలోనూ కుదుపులు ఏర్పడ్డాయి. దానివల్ల ప్రపంచ సంపన్నులు కూడా తమ సంపదలో భారీ నష్టాలను చూడక తప్పలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ సైతం ఈ నష్టాన్ని ఎదుర్కొనక తప్పలేదు.
గాల్లో కలిసిన స్వేచ్ఛా వాణిజ్యం
బిలియనీర్లు ప్రభుత్వాధినేతలుగానూ లేదా వారి చేతుల్లో పాలకులుగా ఉన్నప్పుడు స్వేచ్ఛ వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలే ఎగుమతులపై, దిగుమతులపై సుంకాల విధించి వారి వారి పెట్టుబడుల కోసం, లాభాల కోసం తంటాలు పడితే అది ట్రంప్ సుంకాల యుద్ధ భేరి మ్రోగించినట్లే ఉంటుంది. ఫలితంగా సామాన్య ప్రజలపై ఈ భారం పడి కనీస జీవన ప్రమాణాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. బిలియనీర్ల సంపద పెరిగే కొలది లేదా వారి సంఖ్య పెరిగే కొద్దీ ఆ దేశాల్లో ప్రజలకు ఆకలి కేకలు తప్పవు. ఉదాహరణకు మన దేశంలో 2014లో 109 మంది మాత్రమే బిలియనీర్లు ఉండగా నేడు 284 మందికి పెరిగారు. అయితే 2014లో వరల్డ్ హంగర్ సూచికలో మన దేశ స్థానం 55 కాగా, నేడు ఇది 105 కు పెరిగింది. ఆదాయ అసమానతలు పెరిగి సంపద కొంతమంది చేతుల్లోకి పోవడం వలన మిలియనీర్లు.. బిలియనీర్లు కావచ్చు గాని, ఈ అంతర్జాతీయ వాణిజ్య లోటు పాట్ల వలన, ట్రంప్ లాంటి పాలకుల వాణిజ్య విధానాలతో నేడు ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోకి పోతున్నాయి.
డాక్టర్ ఎనుగొండ నాగరాజు నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్,
98663 22172






