ట్రంప్‌ vs నోబెల్‌ కమిటీ.. నోబెల్‌ ప్రైజ్‌ స్వతంత్రతను నిరూపించుకున్న సంస్థ

by Ravi |   (  Updated:2025-10-18 00:45:58  IST  )

2025 అక్టోబర్ 10న, నార్వేలోని నోబెల్ కమిటీ వెనిజులా విపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు శాంతి బహుమతిని ప్రకటించింది.

ట్రంప్‌ vs నోబెల్‌ కమిటీ.. నోబెల్‌ ప్రైజ్‌ స్వతంత్రతను నిరూపించుకున్న సంస్థ
X

2025 అక్టోబర్ 10న, నార్వేలోని నోబెల్ కమిటీ వెనిజులా విపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బహుమతి రాలేదని తెలిసిన తర్వాత.. ట్రంప్ గాజా యుద్ధాన్ని ఆపడం, ఇజ్రాయిల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్ డీల్‌ను బ్రోకరైజ్ చేయడం వంటి చర్యలకు క్రెడిట్ తీసుకున్నాడు. అయినా, కమిటీ అతని నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక దాగి ఉన్న రాజకీయ, నైతిక కారణాలు లోతుగా విశ్లేషిం చాల్సిన అవసరం ఉంది.

గర్వభంగానికి నిదర్శనం..

ట్రంప్‌కు నోబెల్ రాలేదనేది చిన్న విషయం కాదు. సుయోధన సార్వభౌముడు మయసభలో పొందిన గర్వభంగం లాంటిది. అది అతని రాజకీయ ఇమేజ్‌తో ముడిపడి ఉంది. మొదటి కారణం, ట్రంప్ తాను లాబీ చేయడం. 2025 జనవరి నుంచి, అతను తన ఎక్స్‌లో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను, నోబెల్ నాకే ఇవ్వాలని పదేపదే ప్రకటించాడు. ఇది నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్‌కు అసహ్యమైంది. కమిటీ సభ్యులు, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, జాతుల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించిన వారికి బహుమతి ఇస్తారు. లాబీ చేసే వారికి కాదు.

వెనిజులా ప్రతిపక్ష నేతే బెటర్..

రెండవది, ట్రంప్ అంతర్జాతీయ సంస్థల పట్ల ప్రదర్శిస్తున్న అగౌరవం. అతని మొదటి హయాంలో పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి ఉపసంహరణ, ఐరోపా యూనియన్‌పై టారిఫ్‌లు వంటివి కమిటీలో నెగెటివ్ ఇంప్రెషన్‌ను సృష్టించాయి. మూడవది, నామినేషన్ డెడ్‌లైన్ (జనవరి 31, 2025) తర్వాత జరిగిన గాజా డీల్‌ను కమిటీ పరిగణించలేదు. చివరగా, మారియా కోరినా వెనిజులా డిక్టేటర్ మాడురో పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటం, డెమాక్రసీకి మార్గం సుగమం చేయడం వంటి స్వచ్ఛమైన కృషి కమిటీకి మరింత సముచితంగా కనిపించింది.

నాకెందుకిస్తారు అన్న ట్రంప్

ఈ కారణాలు ట్రంప్‌ను శాంతి సాధకుడుగా కాకుండా, స్వార్థపరుడుగా చిత్రీకరించాయి. ఇందుకు ట్రంప్ స్పందన తీవ్రమైంది. ప్రకటన తక్షణం, అతను ‘వారు లిబరల్స్‌కు మాత్రమే ఇస్తారు, నాకు ఇవ్వరు’ అని పోస్ట్ చేశాడు. వైట్ హౌస్ ప్రతినిధి ‘శాంతి బహుమతి అంగడి సరుకు కాదు’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ‘ట్రంప్ యుద్ధాలు ఆపడం కొనసాగిస్తాడు’ అని వ్యంగ్యంగా హెచ్చరించింది.

డిప్లమసీ బలహీనత..

ఈ స్నబ్ గాజా, పాలస్తీనా మీద నెగిటివ్ ప్రభావం చూపవచ్చు. ట్రంప్ గాజా సీజ్‌ఫైర్‌‌ను తన గ్రేటెస్ట్ డీల్‌గా ప్రచారం చేశాడు. కానీ అతని ఫ్రస్ట్రేషన్ పాలస్తీనా మీద మరింత ప్రెషర్‌‌గా మారవచ్చు. ట్రంప్ పీస్ డీల్ క్రెడిట్ తీసుకున్నా, అది ఫ్రాజిల్ స్నబ్ తర్వాత ఇజ్రాయిల్ మీద మద్దతు పెంచి, పాలస్తీనా‌కు ఫండింగ్ కట్ చేయవచ్చు. ఇది ట్రంప్ డిప్లొమసీ బలహీనత శాంతి డీల్స్ ప్రతిష్ట కోసమే, స్థిరత్వం కోసం కాదు. ట్రంప్ ఇగో హర్ట్ వల్ల డీల్ కుప్పకూలవచ్చు, హింస తిరిగి మొదలవ్వచ్చు. మొత్తంగా, ఈ స్నబ్ నోబెల్ ప్రైజ్ స్వతంత్రతను చూపిస్తుంది. కానీ ట్రంప్ దాన్ని రాజకీయీకరణ చేస్తున్నాడు. శాంతి ఒక గేమ్ కాదు. అది స్వార్థ రహిత కృషి. ట్రంప్‌కు బహుమతి రాలేదనేది ఆయన విజయం కాదు. ప్రపంచ శాంతికి మరింత అవసరమైన సందేశం.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story