- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్.. మేం మీ ఉత్పత్తులు కొనకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
అమెరికా తన పొరుగు దేశమైన మెక్సికోతో ఘర్షణాత్మక మార్గాన్ని అనుసరిస్తోంది. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం పన్ను

అమెరికా తన పొరుగు దేశమైన మెక్సికోతో ఘర్షణాత్మక మార్గాన్ని అనుసరిస్తోంది. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం పన్ను కూడా విధించింది. మెక్సికో అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.. ఈ పరిస్థితిలో, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్(Claudia Sheinbaum) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై నేరుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు..
ఆమె ఏం మాట్లాడారో చూద్దాం.. ''నా తోటి అమెరికన్‌లారా, మీరు మీ చుట్టూ గోడ కట్టుకోవడానికి ఓటు వేశారు. మీకు భౌగోళిక శాస్త్రం గురించి అవగాహన లేదు. అమెరికా ఒక దేశం. అది ఒక ఖండం కాదు. మీ వెలుపల 7 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రజలు అనే పదానికి అర్థం మీకు తెలియదు. కాబట్టి, మీ అవగాహన కోసం, నేను ప్రజలను వినియోగదారులుగా సూచించాలను కుంటున్నాను.
ఈ ప్రపంచంలో 7 బిలియన్ల మంది వినియోగదారులు.. మీ ఉత్పత్తులను కొనుగోలు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారు 42 గంటల్లో ఐఫోన్ నుండి శామ్‌సంగ్‌కు మారవచ్చు. హువావేకు కూడా మారవచ్చు. లెవీ జీన్స్‌కు బదులుగా షరాకు మారిపోవచ్చు. 6 నెలల్లోపు ఫోర్డ్, షెవర్లే కార్ల నుండి కియా, టయోటా, వోల్వో, బీఎండబ్లూలకు మారవచ్చు. ఈ ఉత్పత్తులు, మీ కార్ల కంటే సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందినవి.
మీ హాలీవుడ్ సినిమాలు చూడటం మానేసి, మంచి నాణ్యత గల లాటిన్ అమెరికన్ సినిమాలు చూడటం ప్రారంభించవచ్చు. నమ్మండి.. నమ్మకపోండి, మెక్సికో కూడా మెక్‌డొనాల్డ్స్ కంటే మెరుగైన బర్గర్‌లను తయారు చేస్తుంది. ఇవి మెక్‌డొనాల్డ్స్ కంటే మెరుగైన పోషకాలు కలిగిన బర్గర్‌లు.. ఇవి మా సంస్కృతిని చాటుతాయి. మనం నైక్ మాత్రమే కొనాలా? అడిడాస్ ఉంది. టెన్నిస్ బూట్లు కొనడానికి పనామా, మెక్సికోలు ఉన్నాయి. ప్రపంచంలోని పురాతన అద్భుతాలలో ఒకటైనా అమెరికాలో ఉందా? ఇది ఎంత అవమానకరమో ట్రంప్‌కు అర్థమవుతుందా?
"మీ వెలుపల ఉన్న 700 కోట్ల మంది వినియోగదారులు.. మీ ఉత్పత్తులను కొనకపోతే, మీ దేశంలో నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అప్పుడు, మీరు ఆ గోడను పడగొట్టమని వేడుకుంటారు. మాకు అది ఇష్టం ఉండదు. ఆ గోడను ఇష్ట పూర్వకంగా నిర్మించినది మీరే. ఆ గోడ లోపల బాగా జీవించండి అని చెబుతాం.''ఇది అహంకారి ట్రంప్‌నకు మెక్సికన్ అధ్యక్షురాలి ఉవాచ.
(సోషల్ మీడియా నుంచి సేకరణ)






