సమస్యల వలయంలో ఆదివాసీ పల్లెలు..

by Ravi |   (  Updated:2025-08-23 00:30:54  IST  )

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆదివాసీ పల్లెల్లో అభివృద్ధి కలలు

సమస్యల వలయంలో ఆదివాసీ పల్లెలు..
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆదివాసీ పల్లెల్లో అభివృద్ధి కలలు ఇంకా నెరవేరలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘అభివృద్ధి పంట’ పండుతుందని ఊహించిన ఆదివాసీలు నేటికీ అవే సమస్యలతో జీవిస్తున్నారు.. ఇప్పటికీ ఆదివాసీల పిల్లలు 5–12 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. టీచర్లు రాకపోవడం, భవనాలు పాడై పోవడం కారణంగా చిన్నారులు చదువు మానేస్తున్నారు. 2023 గణాంకాల ప్రకారం, గిరిజన పాఠశాలలలో 40% మంది పిల్లలు మూడవ తరగతి దాటకముందే చదువును మానేస్తున్నారు. అడవిలోని గ్రామాల్లో డ్రాప్‌ అవుట్ రేటు 50%కు చేరుతోంది. అందుకే స్థానిక గిరిజన యువత ఉపాధ్యాయులుగా చేరితే భాషా సాంస్కృతిక అవరోధాలు తొలగి చదువు నాణ్యత పెరుగుతుంది. ఇక వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడంతో గర్భిణీలు, అత్యవసర రోగు లు పట్టణాలకు 30–40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు తరచుగా వస్తున్నా, చికిత్స ఆలస్యమవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2023 లో, ఆదిలాబాద్ జిల్లాలో 120 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 85 మంది గిరిజనులు మలే రియాతో మరణించారు. ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో ఓ పీహెచ్‌సీ ఏర్పాటు చేయకపోతే, ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. ఇక విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ఇంకా చాలాచోట్ల కలే. ఆదివాసుల పల్లెల్లో శాంతి, భద్రత, అభివృద్ధి కలిసి వస్తేనే నిజమైన తెలంగాణ సాధ్యం. సమస్యలు గణాంకాల్లోనే మిగిలిపోకూడదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ పల్లెలో చదువు, వైద్యం, ఉపాధి, భద్రత లభిస్తేనే నిజమైన అభివృద్ధి అంటాం. ఇప్పుడు మాటలు కాదు చర్యలే తీసుకోవాలి. వారికి చదువు, వైద్యం, ఉపాధి అన్నీ కలిపిన మంచి ప్రాణాళిక ఉండా లి, ఆ ప్రాణాళికను తూ.చా తప్పకుండా అమలు చేయాలి. లేకపోతే వారి అస్థత్వానికే ప్రమాదం.

- కాయం నవేంద్ర,

70133 59949

Next Story