- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వాతంత్య్ర స్ఫూర్తి.. సంకల్ప దీప్తి
భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. వికసిత్ -2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన

భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. వికసిత్ -2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని గత 11 యేండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రమిస్తున్నారు.. ఈ స్వతంత్ర వేడుకల్లో ప్రధాని చేసే ప్రసంగాలను దేశ పునర్నిర్మాణంలో అనుసంధానం చేస్తూ.. పలు పథకాలను ఆవిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలుగా మారుస్తున్నారు.. నేడు జరిగే 79వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ప్రధాని వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రతి ఏటా ఆయన ప్రసంగంలో తీసుకునే సంకల్పం నవభారత భవిష్యత్తు శక్తికి, విశ్వాసానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది.
జాతీయ సంకల్ప ప్రసంగాలు..
2014లో ఎర్రకోట బురుజుపై నుంచి తొలి ప్రసంగంలో జాతీయ సమస్యలను ఒక సంకల్పంగా చేశారు.. స్వచ్ఛత, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు.. వీటి నిర్మాణంపై నడుం బిగించారు.. స్వచ్ఛత ఉద్యమాన్ని ఒక అసలు సిసలైన భారీ ప్రజా ఉద్యమంగా చేపట్టారు.. దేశంలో మారుమూల పల్లెలో సైతం మరుగుదొడ్లు నిర్మించేలా జనాలను చైతన్యం చేశారు.. 2015 స్వాతంత్ర దినోత్సవం ప్రసంగం సంద ర్భంగా పీఎం మోడీ స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రకటించారు.. దీంతో అనతి కాలంలోనే లక్షకు పైగా స్టార్టప్‌లతో ఇండియా ప్రపంచంలోనే మూడవ అధిక స్టార్ట్ అప్‌ల గల దేశంగా మారింది. తదుపరి స్వాతంత్య్ర వేడుకల్లో దేశంలో 5 లక్షల మందికి స్వచ్ఛమైన తాగు నీరుని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా అందించాలని ప్రకటించారు..
ఇంటర్వ్యూల రద్దు.. నేరుగా ఉద్యోగాలు
దిగువ స్థాయిలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ మోడీ స్వాతంత్ర వేడుకల్లో నిర్వహించిన ప్రసంగంలో ప్రకటించారు.. దీనికి అనుగుణంగా ఒకటో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్ డి, సి ఉద్యోగులకు ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. 2016 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఫ్రీ గ్యాస్ అందించడమే లక్ష్యంగా పీఎం ఉజ్వల యోజనతో దేశంలో 10 కోట్ల మంది మహిళల పొగ బారిన బతుకుల్లో వెలుగులు నింపాలని సంకల్ప ప్రసంగం చేశారు.. 2021 నాటి స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగంలో భాగంగా మోడీ 2047 నాటికి దేశాన్ని ఇంధనం పుష్కలంగా ఉన్న దేశంగా తీర్చిదిద్దే సంకల్ప ప్రసంగాన్ని చేశారు.. లక్ష్యాన్ని చేరేందుకు అనుగుణంగా దేశంలో నేషనల్ హైడ్రోజన్ మిషన్ సైతం ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు.
వికసిత్ భారత్ కల సాకారం దిశగా..
2047 వికసిత్ భారత్ కల సాకారం చేసే దిశగా దేశం వృద్ధి చెందుతుంది.. ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ తరువాత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల డాలర్లు ( రూ.356 లక్షల కోట్లు) చేరింది. ప్రస్తుతం ఇదే ధోరణి కొనసాగిస్తే మరో రెండున్నర, మూడేళ్లలో మన కంటే ముందున్న జర్మనీని కూడా దాటేసి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. అలాగే IMF ఏప్రిల్‌లో విడుదల చేసిన భవిష్యత్తు (WEO) నివేదిక ప్రకా రం భారత్ తలసరి ఆదాయం 2013- 14లో రూ. 1438 డాలర్లు (రూ.1.22 లక్ష లు ) ఉంటే 2025 లో రెట్టింపు రూ. 2, 880 డాలర్లు( రూ. 2.45 లక్షలకు) పెరిగింది.
గత 10 ఏండ్లలో మన దేశం విభిన్న రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పౌరుల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక వృద్ధి, వారి కోసం పలు కొత్త సంస్కరణలతో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి.
డా. చిన్నమైల్ అంజిరెడ్డి
గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ,
98480 10980






