- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యాటకం సరే.. స్థానిక ప్రయోజనాలూ..?
ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎక్కువగా పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉంటాయి. వీటి స్థూల జాతీయోత్పత్తిలో 10 నుండి 12

ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎక్కువగా పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉంటాయి. వీటి స్థూల జాతీయోత్పత్తిలో 10 నుండి 12 శాతం పర్యాటక రంగం నుండే వస్తున్నా ఆ దేశాల్లోని స్థానికుల్లో ఎందుకు అసంతృప్తి పెరుగుతోంది? మితిమీరిన పర్యాటకుల కారణంగా స్థానిక ప్రజలు నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు. పర్యాటక రంగం వల్ల ఆ దేశాలకు వచ్చే నష్టం ఏంటో తెలుసుకుందాం..
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది.. మోతాదు మించితే అసలుకే ప్రమాదం అని పెద్దలు ఉరికే అనలేదు. ఈ మాదిరి పరిస్థితే పర్యాటక రంగానికి రాబోతుంది.
స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా..
ప్రపంచంలోని పలు దేశాలు పర్యాటక రంగం ఆదాయ వనరుగా మారడంతో దీనికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వా లు చొరవ చూపుతున్నాయి. కానీ పర్యాటక ప్రాంతాల వారసత్వాన్ని, ఆ ప్రదేశాలను కాపాడటంతో పాటు అక్కడి సంస్కృతిని, ఆచారాలను పరిరక్షించడంలో విఫలమవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పర్యాటక ప్రాంతా ల్లో తరతరాలుగా నివాసముంటున్న ప్రజల మనుగడకు, జీవనానికి అవాంతరాలు తలెత్తడం తల నొప్పిగా మారుతుం ది. స్థానిక పరిస్థితులు, స్థానిక సమాజం స్థితిగతులు అర్థం చేసుకోకుండా ఆయా దేశాలు పర్యాటకాన్ని పెంచుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
పర్యాటక రంగం పెరగడంతో..
ప్రపంచ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ప్రాన్స్, స్పెయిన్, యూఎస్, చైనా, ఇటలీ, మెక్సికోతో పాటు పలు దేశాలున్నాయి. వీటిలోని కొన్ని దేశాల్లో మితిమీరిన పర్యాటకుల కారణంగా వరుసగా నిరసనలు స్థానికుల నుండి పెరుగుతున్నాయి. ఇటీవల స్పెయిన్‌లో బార్సిలోనా, మల్లోర్కా ప్రాంతాలో నివాసముంటున్న ప్రజలు పర్యాట కులపై బొమ్మ తుపాకులతో నీళ్లు చిమ్మి నిరసన తెలిపారు. ఇటలీలోని వెనీస్, పోర్చుగల్ రాజధాని లిస్బన్ లాంటి నగరాల్లో కూడా ఈ మాదిరి ప్రదర్శనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. పర్యాటక ఆర్ధిక నమూనా కారణంగా తమకు ఇళ్లు దొరకడం లేదని పట్టణాల రూపు రేఖలు మారిపో వడంతో పాటు, ఇంటి అద్దెలు పెరిగిపోవడం, నిత్యావ సరాల ధరలు పెరగడం పాటు స్థానికుల అవసరాలను వ్యాపారులు పట్టించుకోవడం లేదని వారు మితిమీరిన పర్యాటకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యావరణ ప్రభావాలు పెరగడంతో..
స్పెయిన్ జనాభా 4.8 కోట్లు కాగా ఒక్క 2024 సంవత్సరాలో 9.4 కోట్ల మంది పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించారంటే పర్యాటక తాకిడికి స్థానికులు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో అర్థమవుతోంది. బార్సిలోనా నగర జనాభా 17 లక్షలు అయితే గత ఏడాది 1.55 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. 1992 నుండి 2020 మధ్యలో అంటార్కిటికాను సందర్శించే వారి సంఖ్య పది రెట్లు పెరిగింది. ఈ పరిణామంతో అక్కడ పెంగ్విన్ జాతులతో పాటు వన్యప్రాణులకు భంగంగా మారుతుంది. దీనితో ప్రతికూల పర్యావరణ ప్రభావాలు పెరిగే అవకాశం స్థానికంగా కనిపిస్తుంది. పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో 10 నుండి 12 శాతం పర్యాటక రంగం నుండే వస్తున్నా స్థానికుల్లో ఎందుకు అసంతృప్తి పెరుగుతోందని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మూలాలు చెరిగి పోయే ప్రమాదం
చాలా దేశాలు పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నాయి. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విలువలపై సమాజంలో అవగాహన పెంచడం, ప్రపంచ వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రథమ ప్రాము ఖ్యత. పర్యాటకులు విభిన్న సంస్కృతులను చూసి ఆనందించడానికి, అనుభవించడానికి, శాశ్వత జ్ఞాపకాల కొరకు పర్యటిస్తారు.. కానీ కాలక్రమేణా పర్యాటక స్థలాల్లో ఈ మూలలు చెరిగి పోయే ప్రమాదం కనిపిస్తుంది. అసలు కంటే కొసరు మేలు అన్నట్లు పర్యాటక ప్రదేశాల్లో జరుగుతున్న పరి ణామాలు భవిష్యత్‌లో ఈ రంగానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి..
సహజ వనరులకు దెబ్బ
పర్యాటక ప్రాంతాల్లో తరతరాలుగా కొన్ని చోట్ల ఉన్న 58 శాతం పగడపు దిబ్బలు మానవ కార్యకలాపాల వల్ల ముప్పు పొంచి ఉంది. మడ అడవులు, ఇసుక దిబ్బలు, సరస్సులు లాంటి సహజ వనరులు పర్యాటకుల అనా లోచిత చర్యలతో దెబ్బతింటున్నాయి. మనదేశంలో కూడా చాలా పర్యాటక కేంద్రాల్లో గత సంస్కృతి మూలలకు పెరిగిన పర్యాటకం నష్టం కలిగిస్తోంది. ఊటీ, అరకు, మారేడుమిల్లి, కొడైకెనాల్, సిమ్లా, కాశ్మీర్ లాంటి విహార ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, విపరీతమైన మద్యపాన వాడకం, అనైతిక కార్యక్రమాలు సహజ సౌందర్యాన్ని దెబ్బతీయడంతో పాటు పట్టణీకరణ కారణంగా వాతావరణంలో మార్పులకు కారణమవుతోంది.
పర్యాటక విధానంపై మార్పు అవసరం!
మితిమీరిన పర్యాటకం, పర్యాటక ప్రదేశాల్లో మూలలకు జరుగుతున్న ముప్పుపై ఆయా దేశాలు అవలంబిస్తున్న పర్యాటక నమూనాలో మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక వారసత్వం పర్యాటకానికి అవసరమే కానీ తలెత్తే ప్రమాదాలను గమనించాలి. యునెస్కో, ఐక్యరాజ్యసమితి, బ్లూ షీల్డ్ ఇంటర్నేషనల్ ఈ ప్రమాదాలను గుర్తించి వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నాయి.
పర్యాటకం ఆదాయం కాదు
ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో పర్యాటక కార్యకలాపాలలోని పర్యావరణ ప్రభావాలను అన్వేషించడంతో పాటు పర్యాటక నిర్వాహకులు వాటిని పాటిస్తున్నారో లేదో అంచనా వేయడం, స్థానికుల హక్కులకు, జీవనానికి విఘాతం కలిగించని పర్యాటకాన్ని ప్రోత్సహించేలా కార్యకలాపాలు ఉండాలి. స్థానిక పరిస్థితులు, స్థానిక సమాజం స్థితిగతులు అర్థం చేసుకోకుండా ఆయా దేశాలు పర్యాటకాన్ని పెంచుకుంటూపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. పర్యాటకం ‘ఆదాయమే’ కాదు .. పర్యాటకం ‘ఆత్మ’ నశిం చకుండా శోభిల్లితేనే వారసత్వానికి వైభవోపేతం.
-అడపా దుర్గ
90007 25566






