‘సామాను’ చూస్తున్నావంటే... నీకు తప్పుడు ఉద్దేశం ఉన్నట్టే..

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-30 15:04:12  IST  )

స్త్రీ.. ప్రకృతి. స్త్రీ.. సృష్టికి మూలం. స్త్రీ.. అందానికి ప్రతీక. స్త్రీ.. దేవత. స్త్రీ.. ఓపికకు నిదర్శనం. ఇవన్నీ సగటు మనిషి, మగాడు చెప్పే మాటలు. కానీ ప్రకృతి అనుకున్న స్త్రీని పాడు చేస్తున్నరు.. సృష్టికి మూలమైన స్త్రీకి ఆ మూలాలే లేకుండా మారుస్తున్నరు.. అందానికి ప్రతీక అంటూనే

‘సామాను’ చూస్తున్నావంటే... నీకు తప్పుడు ఉద్దేశం ఉన్నట్టే..
X

స్త్రీ.. ప్రకృతి. స్త్రీ.. సృష్టికి మూలం. స్త్రీ.. అందానికి ప్రతీక. స్త్రీ.. దేవత. స్త్రీ.. ఓపికకు నిదర్శనం. ఇవన్నీ సగటు మనిషి, మగాడు చెప్పే మాటలు. కానీ ప్రకృతి అనుకున్న స్త్రీని పాడు చేస్తున్నరు.. సృష్టికి మూలమైన స్త్రీకి ఆ మూలాలే లేకుండా మారుస్తున్నరు.. అందానికి ప్రతీక అంటూనే అందాలన్నీ చూపించాలా అంటూ అపనిందలు వేస్తున్నరు. ఓపికకు నిదర్శనం కదా అని ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నరు. అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే... పురుషుడు శివాజీ అన్న మాటలు కారణం. ఆడది కాబట్టి ఒళ్లు కప్పుకోవాలి.. లేదంటే సామాన్లు కనిపిస్తయి.. అలా చేస్తే తిట్టుకుంటరు.. దొంగ ముండ సరిగ్గా ఒళ్లు కప్పుకోవచ్చు కదా అని మనసులో అనుకుంటరు.. అని చెప్పుకొచ్చాడు.

తప్పు అని చెబుతూ తప్పుడు మాటలాడితే..

ఈ టాపిక్‌ సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది. కొందరు ఆయనను వ్యతిరేకిస్తే.. ఇంకొందరు ఆయన మాట్లాడిన మాటలు తప్సుగా ఉండొచ్చు కానీ ఆయన ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే.. తప్పుడు ఉద్దేశం ఉన్నోడే తప్పుడు మాటలు మాట్లాడుతడు. అది తప్పు.. తప్పుగా ఉండకూడదు.. అని చెప్పాలనుకున్నోడు.. తప్పుడు భాష మాట్లాడడు. ఇంకొందరు ఓ పాటలో కూడా అలాంటి పదాలే ఉన్నాయి.. మరి ఆ పాటను ఎందుకు వ్యతిరేకించలేదు అంటున్నారు.. సాహిత్యానికి రోజూ మాట్లాడే మాటలకు తేడా ఉండదా? అదే తేడా ఇక్కడ కూడా ఉంది.

ఏం మాట్లాడినా చెల్లుతుందనే మదం

అసలు శివాజీకి ఎందుకంత ధైర్యం మరి.. అమ్మాయిలను ఎందుకంత చులకనగా మాట్లాడే ధైర్యం చేశాడు. అంటే.. ఇదంతా బిగ్ బాస్ హౌజ్ నుంచి స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఓ ఇద్దరు మహిళా కంటెస్టెంట్లు తమను టార్గెట్ చేస్తున్నారని.. హద్దులు మీరి వ్యతిరేకిస్తున్నారని.. ఇలాంటోళ్లు నా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేటోడిని.. అని కామెంట్ చేశాడు. ఇందుకు హోస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసి అప్పటి వరకు అయితే సారీ చెప్పించాడు. కానీ ‘కోర్ట్’ సినిమాలో మంగపతి క్యారెక్టర్ అలాగే ఉండటం.. దానికి హైప్ రావడంతో.. నేను ఏది మాట్లాడినా చెల్లుతుందిలే అనుకున్నడు హీరో శివాజీ. అందుకే ఒళ్లు తెలియకుండా.. సామాన్లు అంటూ సంస్కారం లేకుండా.. దొంగ ముండ అంటూ బుద్ధి లేకుండానే మాట్లాడాడు.

'నిధి'ని అడ్డంగా పెట్టుకుంటే సరిపోతుందా?

ఇది తప్పు అని వ్యతిరేకించిన తోటి నటులను కూడా నాకూ ఓ టైమ్ వస్తుందని.. అప్పుడు చూసుకుంటా అన్నట్లుగా మాట్లాడటం మరో బుద్ధి లేని పని. నిజానికి శివాజీ కుటుంబం వరకు వెళ్లొద్దు కానీ విక్టిమ్ నిధి అగర్వాల్‌ను ఉదాహరణగా తీసుకుని.. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయడం.. మాట్లాడొచ్చు అనే సాహసం చేయొచ్చు అనిపిస్తుంది. ఓ బాధితురాలిని ఎగ్జాంపుల్‌గా తీసుకుని జనాలను మానిప్యులేట్ చేయాలనుకున్న శివాజీ గారికి.. నిజంగా అంత సున్నితత్వమే ఉంటే.. నిధిపై అంతగా కన్సర్న్ ఉంటే ఆ ఘటన జరిగిన రోజు ఎందుకు మాట్లాడలేదు..? లేదంటే ఆయన ఒళ్లు తెలియకుండా సామాన్లు అనే భాష పలికిన రోజు ఈ ఉదాహరణను ఎందుకు చూపలేదు?

ఆడది అణిగి ఉండాలా శివాజీ..?

అసలు ఆడది అంటే నువ్వు చేసిన మంగపతి క్యారెక్టర్ చెప్పినట్లు అణిగిమణిగి ఉండాలా శివాజీ గారు? నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల సున్నిత స్వభావం గురించి తెలియకపోవచ్చు.. అదే నీకో బిడ్డ ఉండి ఉంటే..సామాన్లు అనే మాట మాట్లాడేందుకు నీకు నోరు రాకపోయేది.. ఇలా అంటే నా బిడ్డను కూడా అన్నట్లే కదా అని ఆగిపోయేటోడివి.. తల్లి, భార్య ఉన్నా కూడా ఓ ఆడపిల్లను పెంచితేనే నీకు అర్థమైతది.. ఓ ఆడపిల్ల బయటకు వచ్చి హీరోయిన్‌గా ఎదిగింది అంటే ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించి ఉంటుంది అనేది. అయినా ఎవరయ్యా నువ్వు..నీకు నచ్చిన విధంగా ఎవరెందుకు ఉండాలి? అసలు నువ్వెందుకు చెప్పాలి? నువ్వేమైనా దేశోద్ధారకుడివా? ఏవైనా త్యాగాలు చేశావా? ఏమైనా ఉద్యమాలు చేశావా? ఆడపిల్ల చీర కట్టుకుంటే నీకు ఏమైనా లాభమొచ్చిందా.. పొట్టి బట్టలు వేసుకుంటే ఏదైనా నష్టం జరిగిందా? నువ్వు తప్పుగానే మాట్లాడవు.. నీకు తప్పుడు ఉద్దేశమే ఉంది.. ఇకనైనా ఆ ఒపీనియన్ మార్చుకుని.. మగాడిగా కాదు కాదు సగటు మనిషిగా మారు.. సహనం ఉంది కదా అని స్త్రీని పరీక్షించకు.. ఒకవేళ ఇదే చేసుకుంటూ పోతే.. మన పురాణాల్లో స్త్రీ ఓర్పును టెస్ట్ చేసిన వ్యక్తులకు ఎలాంటి గుణపాఠం చెప్పారో.. అలాంటిదే నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వస్తది.. తప్పు చేసి విక్టిమ్ కార్డ్ నువ్వు ప్లే చేసినప్పుడే అర్థమైపోతుంది.. నీ క్యారెక్టర్..

సుజిత రాచపల్లి

జర్నలిస్ట్

Next Story