సెలవులు వృధా చేయకుండా మీ పిల్లలకు సమ్మర్ వెకేషన్ ఇలా ప్లాన్ చేయండి!

by Ravi |   (  Updated:2025-04-30 00:45:17  IST  )

ఈ ఏడాది సమ్మర్ వెకేషన్ రానే వచ్చింది. స్కూల్స్, కాలేజీస్‌కు హాలీడేస్ వచ్చినయ్. ఇక దాదాపు నెలన్నరకు పైగా

సెలవులు వృధా చేయకుండా మీ పిల్లలకు సమ్మర్ వెకేషన్ ఇలా ప్లాన్ చేయండి!
X

ఈ ఏడాది సమ్మర్ వెకేషన్ రానే వచ్చింది. స్కూల్స్, కాలేజీస్‌కు హాలీడేస్ వచ్చినయ్. ఇక దాదాపు నెలన్నరకు పైగా పిల్లలకు సెలవులే. కొన్నేండ్ల క్రితం వరకు సెలవులంటే ఎగిరి గంతేసే వారు బడి పిల్లలు.. ఎండాకాలం సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికో, నాయినమ్మ ఇంటికో వెళ్లి నెల, రెండేళ్లు సరదాగా గడిపేవారు. అదే ఇప్పుడు పట్నంలో ఉండే పిల్లలు ఊర్లకు పోదామంటే వద్దు అంటున్నరు. తాతయ్య, నాయనమ్మ ఊర్లకంటే వెంటనే నో చెప్పేస్తున్నరు. రోజూ ఆదివారం లాగే రోజంతా కూడా ఏసీలు ఆన్ చేసుకొని స్మార్ట్ ఫోన్లు, టీవీ, కంప్యూటర్, ల్యాప్ టాప్‌లతోనే గడుపుతారు. ఏదో ఈవీనింగ్ అలా పార్కు లేదా సినిమా, రెస్టారెంట్‌కు వెళ్లి వచ్చేస్తారు. అయితే ఈ వేసవి సెలవుల సమయంలో అంటే నెలన్నర రోజులలో పిల్లలకు ఏదైనా పనికొచ్చేది నేర్పిస్తే మంచిదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

సమయాన్ని వృధా చేయకుండా..

పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవ్వాలంటే ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ నేర్పితే బాగుంటుంది. టెక్నికల్‌గా, ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే మంచిది. యోగా, మెడిటేషన్ వంటివి కూడా మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నారులకు ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ట్రైనింగ్ ఇప్పిస్తే బెటర్. క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కరాటే, యోగా, కబడ్డీ, డ్యాన్సింగ్, పెయింటింగ్, కంప్యూటర్, ఏఐ టెక్నాలజీ, ఆన్‌లైన్ క్లాసులు వంటివి కోచింగ్ ఇప్పిస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా అవుతారు. అలాగే ఎడ్యుకేషనల్‌గా, టెక్నికల్‌గా కూడా ఎదిగేందుకు దోహదపడుతాయి.. అంతేగానీ ఇంట్లో ఏసీ, ఫ్యాన్‌లు ఆన్ చేసి స్మార్ట్ టీవీ/మొబైల్ ఇచ్చి ఆడుకోమని చెబితే, వైఫై పెట్టి కంప్యూటర్, ల్యాప్ టాప్ ఇచ్చేస్తే మీ బిడ్డల్ని మీరే చెడగొట్టిన వారు అవుతారు. ఈ నెలన్నర పాటు మీ బాబు లేదా పాపకు ఏం నేర్పించాలి.. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఎలా ఉపయోగించాలి అని భార్యభర్తలు ఆలోచిస్తే మంచిది.

కొన్ని పాఠశాలలు చేస్తున్నప్పటికీ..

తమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకునేలా ఆయా స్కూల్స్ మేనేజ్‌మెంట్లు ఆలోచన చేస్తు న్నాయి. సమ్మర్ వెకేషన్ క్యాంపులు పెట్టి విద్యార్థులను అట్రాక్ట్ చేస్తున్నాయి. హాలీడేస్‌లో టైం వేస్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో కొత్తగా స్పెషల్ క్యాంపుల పేరుతో ఆటలు, పాటలు, డ్యాన్స్‌లతో పిల్లలను సంతోషపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. కొంత మంది స్పెషలిస్ట్‌ల ద్వారా ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్‌తో పాటు ఇతర యాక్టివీటిస్‌ను పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ కండెక్ట్ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఆర్గనైజేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సైతం విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపుల పేరుతో సరికొత్త యాక్టివిటీస్ నేర్పుతున్నాయి. క్యారెం బోర్డు, చెస్, హాకీ, కీబోర్డ్, గిటార్ వంటి మ్యూజిక్‌లో ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వీలైన సమయాల్లో వచ్చి నేర్చుకోవచ్చంటూ ఆహ్వానిస్తున్నాయి. తల్లిదండ్రులు ఎండా కాలం సెలవుల్లో పిల్లలు సమయం వృధా చేయకుండా వారికి మీకు ఇష్టమున్న ఆటలు నేర్పిస్తే ఆరోగ్యంగా, దృఢంగా తయారయ్యే అవకాశం ఉంది.

- సురేందర్ చింతకుంట్ల

83414 96562

Next Story