- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఆట మైదానంలో కాదు.. మాయాజాలంలో
ఈ దేశ భావి భారత పౌరులు.. బెట్టింగ్‌కు బానిసలు అవుతున్నారు. యువత, కార్పొరేట్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

ఈ దేశ భావి భారత పౌరులు.. బెట్టింగ్‌కు బానిసలు అవుతున్నారు. యువత, కార్పొరేట్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, చక్కటి భవిష్యత్తు ఉండే ఉద్యోగులు, యువత ఈ బెట్టింగ్ స్కామ్‌ల పాలై చిక్కిపోతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్న బెట్టింగ్ యాప్‌లకు వీరంతా బానిసలు కావడం అత్యంత ఆందోళనకరమైన విషాదం. రూ.50, 100 తో మొదలుపెట్టి వేలు, లక్షలు ఈజీగా సంపాదించొచ్చు అని ఎవరో చెబితే విని ఆశను అత్యాశ చేసుకొని మాయదారి బెట్టింగ్ ఊబి లో చిక్కుకొని, కష్టార్జితాన్ని పోగొట్టుకుంటూ, బెట్టింగ్‌కు బానిసలై అత్యంత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు బెట్టింగ్ బానిసలు..
బెట్టింగులో మొత్తం కోల్పోయి..
ఈ బెట్టింగ్ మాయాజాలంలో ముఖ్యంగా బందీలవుతున్నది దేశంలో అత్యంత పేరుగాంచిన మహానగరాలలోని వారే. అందులో 18 నుండి 30 సంవత్సరాల వయసు గల వారే అత్యధిక శాతం ఈ మాయాజాలంలో ఉన్నారు. 50, 100 వేల రూపాయలతో మొదలై లక్షలు కోట్లు అంటూ చివరకు అంతా పోగొట్టుకుంటున్నారు. చిన్న ప్రైవేట్ ఉద్యో గులు లోన్స్ యాప్‌ల ద్వారా వేలు లక్షలు తేడా లేకుండా అప్పులు చేసి ఆర్థిక కష్టాలు భరించలేక చివరకు బంగారం, ఇళ్లు కూడా తాకట్టు పెట్టి కుటుంబాలు రోడ్డుకి ఎక్కిన పరిస్థితులు మనం రోజూ వార్త పేపర్లో చూస్తున్నాం, ఇక విద్యార్థులైతే లోన్ యాప్స్‌లో చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేక రుణాలు చెల్లించలేక, వేధింపులను భరించలేక మత్తు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. లేదా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలను మనం ఈ రోజుల్లో చూస్తున్నాం.
ఎవరి బాధ్యత?
యువత క్రికెట్ ఆడటం, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి క్రికెట్ టీవీలో వీక్షించడం ఏ మాత్రం తప్పులేదు. కానీ బెట్టింగ్ స్కాంలో పడి ఏది మంచో ఏది చెడో గుర్తించడం కూడా యువతకు తెలీడం లేదు. మద్యం మత్తు పదార్థాలకు బానిసలుగా మారి చివరకు ఆత్మహత్యలకు కూడా వెనుకాడకపోవడం లాంటివి అత్యంత విషాదం. అందుకే బెట్టింగ్ యాప్ నుండి బయటపడి మేల్కొని సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు గురువులు కీలక బాధ్యత తీసుకోవాలి.
ఉమ్మడి కార్యాచరణ అవసరం!
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై నిషేధం ఉంది. అయినప్పటికీ వినియోగదారులు అడ్డ దారుల్లో తమ లొకేషన్‌ను మార్చి, యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఇది సామాజికంగా యువ తను పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ సమస్యపై కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెట్టినా.. ఆ కేసులు ముందుకు సాగడం లేదు. కారణం మన దేశం లోని కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లపై నిషేధం లేకపోవడం. దీంతో సమాచారం రాబట్టే విషయం లో అడుగడుగునా అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రావడం అత్యవసరం. అలాగే బెట్టింగ్ సంబంధించిన ఫేక్ యాప్స్, లోన్ యాప్స్‌ను పెంచి పోషిస్తున్న వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలు ఏం పని చేస్తున్నారో తల్లిదండ్రులు ఒక కంట ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
-దిలీప్ ప్రజాపతి,
63056 55171






