సర్పంచ్‌ అయితేనే వేధిస్తారా?

by Ravi |   (  Updated:2025-10-26 00:30:16  IST  )

2018 నుండి 2023 సంవత్సరం వరకు తెలంగాణలో 69 మంది సర్పంచ్‌లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని పత్రికల కథనాలు చూసాం. అయితే నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువనే ఆత్మహత్యలు ఉంటాయి.

సర్పంచ్‌ అయితేనే వేధిస్తారా?
X

2018 నుండి 2023 సంవత్సరం వరకు తెలంగాణలో 69 మంది సర్పంచ్‌లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని పత్రికల కథనాలు చూసాం. అయితే నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువనే ఆత్మహత్యలు ఉంటాయి. వాస్తవంగా ఇవి ఆత్మహత్యలు అనేదానికంటే ప్రభుత్వ హత్యలు అనడం మంచిది. తెలంగాణలో ప్రజలు ఉన్నారా? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రభుత్వాలు లేక 2 సంవత్సరాలు పూర్తి అయింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు కొనసాగుతున్నారు. మరి ఈ రెండు సంవత్సరాల నుండి గ్రామాభివృద్ధి ఎలా న డుస్తుంది? ప్రజలకు సమస్యలు వస్తే ఏ విధంగా తీరుస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే సర్పంచ్‌ని వేధించినట్టు.. ప్రత్యేకాధికారులను వేధించడం లేదా? మరి వేధిస్తే ఒక్క అధికారి ఆత్మహత్య చేసుకున్నట్టు దాఖలాలు కనబడ్తలేవు. అంటే ప్రజలకు సమస్యలు లేవా? లేదా అడిగితే పోలీస్ చట్టాలను ప్రయోగిస్తారని భయమా? గత రెండేళ్లుగా గ్రామాల అభివృద్ధిపైన అడిగే నాధులు లేరు.. అడిగితే సమస్యలు తీర్చే గ్రామ ప్రభుత్వాలు లేవు. సర్పంచ్ పదవులకు డబ్బులు ఖర్చు చేసి గెలువడం నేరం.. గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవడం పిరికితనం. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే నిజాయితీ పరులైన ఓటర్లు కావాలి. నిజాయితీ పరులైన నాయకులు కావాలి. సర్పం చ్‌ లు అభివృద్ధి చేయకపోతే సస్పెండ్ చేసే అధికారం ఉన్నట్టే ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను సస్పెండ్ చేసే అధికారం ప్రజలకు రావాలని కోరుకుంటాను. ప్రస్తుత సమయంలో ప్రజలు నేర్చుకోవలసిన అంశం ఏంటంటే.. వారి సమస్యలపైన మాట్లాడే విధానాలు మార్చుకోవాలి. సర్పంచ్ ఉంటే దుర్భాషలాడడం.. లేదంటే అతి తీవ్రమైన పదజాలాన్ని వాడడం మానుకోవాలి. ప్రత్యేకాధికారుల వద్ద ఎలా వ్యవహరిస్తున్నా మో.. అదేవిధంగా సర్పంచ్‌లతో కూడా అలాగే ఉండాలి.

-మహేష్ గంగాపురం

97000 02955

Next Story