- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంజినీరింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే..
భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకై ప్రతి ఏడాది లక్షల మంది విద్యార్థులు ఐఐటీలను, ఎన్‌ఐటీ లను, ఇతర రాష్ట్ర స్థాయి

భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకై ప్రతి ఏడాది లక్షల మంది విద్యార్థులు ఐఐటీలను, ఎన్‌ఐటీ లను, ఇతర రాష్ట్ర స్థాయి, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలను లక్ష్యంగా పెట్టుకుని ఎంట్రెన్స్ పరీక్షలు రాస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ప్రతి విద్యార్థి మౌలికంగా తనకు తానుగా ఎలాంటి ఇంజినీరింగ్ కోర్సును ఎంచు కోవాలి?” ఏ కాలేజీ నాకు సరైనది? అనేది ఆలోచించుకోవాలి.
ఇంజినీరింగ్ అంటే కేవలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనే పాత తరహా కోర్సులు మాత్రమే అన్న దశ గడిచిపోయింది. నేటి యుగంలో ఎన్నో కొత్త కోర్సులు తెరపైకి వ చ్చాయి. డిజిటల్ రంగం విస్తరిస్తున్నప్పుడల్లా ఆ రంగానికి అనుగుణంగా కొత్త కొత్త డొమె న్లు తెరపైకి వస్తున్నాయి. కొన్ని ప్రస్తుతానికి, భవిష్యత్తుకు అత్యంత అవసరమైన కోర్సులు..
ఏ కోర్సులకు డిమాండ్..
ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధించిన కోర్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ నిపుణులను భారీగా నియమిస్తున్నాయి. ఇక ప్రపంచం అంతా డేటాతో ముడిపడి నడుస్తుండటంతో డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నేడు ఇంటర్నెట్ ఆధారిత సేవలు పెరగడంతో హ్యాకింగ్ ముప్పు కూడా పెరుగుతోంది. అందుకే సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్లకు భారీ డిమాండ్ ఉంది. సైబర్ సెక్యూరిటీ కోర్సులు, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు డిమాండ్ ఉంది. ఇక మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ కోర్సులు నేడు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అలాగే బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్ కోర్సులకు మంచి ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. కరోనా తర్వాత హెల్త్ టెక్నాలజీకి గణనీయమైన ప్రాముఖ్యత వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉన్న ముప్పుల నేపథ్యంలో ఎన్వి రాన్మెంటల్ ఇంజినీరింగ్ కోర్సు కి భవిష్యత్‌లో ప్రాధాన్యత మరింత పెరుగుతుంది.
పరిశీలించాల్సినవి..
విద్యార్థులు ఏ కోర్సు చదవాలన్న నిర్ణ యం తీసుకోవడమే కాదు, కాలేజీ ప్రాంగణం ఎంచుకోవడమూ ముఖ్యమైనదే. అందుకే విద్యార్థులు (NIRF) ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్ కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఈ ర్యాంకింగ్స్‌లో ఫ్యాకల్టీ క్వాలిటీ, పరిశోధన, ప్లేస్‌మెంట్లు, విద్యార్థి నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఒక కాలేజీకి ఎంత మంది పీహెచ్‌డీ ప్రొఫెసర్లు ఉన్నారు? వారు పరిశోధనల్లో ఎంతగా పాల్గొంటున్నారు? వారిచే నిర్వహించే సదస్సులు, వర్క్ షాపులు వంటి అంశాలు ఎంత ముఖ్యమైనవో తెలుసు కోవాలి. ఇంజినీరింగ్ అంటే కేవలం పాఠ్య పుస్తకాలు కాదు. పరిశోధన చేయగలగటం కూడా ముఖ్యమే.. అందుకే ఆ కాలేజీలో R&D లాబ్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్స్ నిర్వహిం చబడుతున్నాయా? లేదా అనేది పరిశీ లించాలి. అలాగే మంచి కంపెనీలతో కాలేజీకి సంబంధాలు ఉన్నాయా? గత సంవత్సరాలలో ఎంత మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారు? వారి ప్యాకేజీలు ఎంత? అనేవి అడగాలి. అలాగే స్టార్టప్‌లు, MNC కంపెనీలతో టై అప్స్ ఉన్నాయా? ఇండస్ట్రీ అవసరాల మేరకు విద్యార్థులు సిద్ధమవ్వాలంటే, విద్యాసంస్థలు ఆ పరిశ్రమలతో అనుసంధానంగా ఉండాలి. గెస్ట్ లెక్చర్స్, ప్రాజెక్ట్ మెంటరింగ్, ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్‌షిప్స్ వంటివి ఈ లక్షణాలే.. అలాగే అంతర్జాతీయ విద్యా సంస్థలతో మౌలిక ఒప్పందాలు ఉన్న కాలేజీల్లో చదివిన విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాలలో MS, జాయింట్ రీసెర్చ్ పోగ్రాంలు చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి.
మారుతున్న ప్రపంచంలో..
మంచి కాలేజీలో సీటు అంటే మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే స్కాలర్షిప్‌ల గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ స్కీమ్‌లు, ప్రైవేట్ మెరిట్ స్కాలర్షిప్‌లు వంటివి ఉన్నా యేమో తెలుసుకోవాలి. ఉంటే ఆ అవకాశాలను చురు కుగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం వేగం గా మారుతున్న ప్రపంచంలో, ఒక విద్యార్థి భవిష్యత్తు కేవలం మార్కుల మీద ఆధారపడదు.. అతను ఎలాంటి కోర్సును ఎంచుకున్నా డు? ఎలాంటి వాతావరణంలో విద్యను అభ్యసించాడు? ఇవన్నీ కలిపి ఒక సమగ్ర మానవ వనరుగా ఎదగ డానికి సహాయపడతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అంశా లపై చురుగ్గా పరిశీలన చేయాలి. ఒకమారు కోర్సు, కాలేజీ ఎంపికైతే, ఆపై పట్టుదల, శ్రమ, విజ్ఞానం అన్నీ కలిస్తే భవిష్యత్తు నిస్సందేహంగా గుణాత్మకంగా మారుతుంది.
మహేశ్వరం భాగ్యలక్ష్మి
95056 18252






