- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగస్థలం
బ్రతుకు యాదృచ్ఛిక నాటకం! బ్రతుకు భ్రమల బ్రహ్మ నాటకం!
బ్రతుకు యాదృచ్ఛిక నాటకం!
బ్రతుకు భ్రమల బ్రహ్మ నాటకం!
తనే రచించి ప్రదర్శిస్తున్న,
అపర బ్రహ్మల సరికొత్త నాటకం
నాటకంలో మరో నాటకం.
ఆది కవుల గ్రంథాలు త్రికాలాల
దర్శన ప్రతిబింబాలు!
రిహార్సల్స్ ఉండని బ్రహ్మ స్క్రిప్ట్
పాత్ర దారులకు సర్ ప్రైజ్ గిఫ్ట్!
జీవిత సాధకబాధకాలు
అపర బ్రహ్మల ఇతివృత్తాలు!
జీవితం తిరిగే రంగులరాట్నం!
సమాజ సమస్యల సాధనం
చిత్ర, నాటక ప్రదర్శన విధానం
రంగస్థలంపై నాటకం నవ్విస్తుంది
ఏడిపిస్తుంది, ఓదార్చు తుంది!
ఆ బ్రహ్మనే భ్రమింపజేయు
ఈ అపర బ్రహ్మల నాటకం
గమనం- గమ్యం- రసరమ్యం
ఈ భూమి నిత్యసత్య మైన రంగస్థలం!
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా
పి.బక్కారెడ్డి
97053 15250
- Tags
- theater
Next Story






