ఐక్యరాజ్య సమితి.. ఆశల నుంచి నిరాశ దాకా

by Ravi |   (  Updated:2025-10-24 00:30:29  IST  )

ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ప్రపంచ శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, ఆరోగ్యం, ఆర్ధిక సహాయం, పరిశోధనలు, యుద్ధ సమయంలో తక్షణ సహాయ కార్యక్రమాల కోసం

ఐక్యరాజ్య సమితి.. ఆశల నుంచి నిరాశ దాకా
X

ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ప్రపంచ శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, ఆరోగ్యం, ఆర్ధిక సహాయం, పరిశోధనలు, యుద్ధ సమయంలో తక్షణ సహాయ కార్యక్రమాల కోసం పనిచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ ఒకటిగా కలిసి, ఉన్న అన్నీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునే సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధంలో భయానక హింస, విధ్వంసక చర్యలను, మానవ హననాన్ని ఆపడంలో నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) విఫలమైన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. లీగ్ ఆఫ్ నేషన్స్ సంస్థ వైఫల్యం వలన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన యుద్ధం. దాదాపు 7-8 కోట్ల మంది ప్రజలు మరణించారు. తర్వాత మూడో ప్రపంచ యుద్ధం జరగకూడదు అనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రపంచ శాంతి సహకారానికి ఒక బలమైన వేదికగా యునైటెడ్ నేషన్స్‌ని స్థాపించారు.

యునైటెడ్ నేషన్స్ ప్రధాన సంస్థలు 6 ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్టమైన, కీలకమైన విధిని నిర్వహిస్తుంది. ఇవి యుఎన్ ఛార్టర్ ద్వారా స్థాపించబడిన ప్రధాన సంస్థలు. అవి జనరల్ అసెంబ్లీ, భద్రతామండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీ షిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్. ఇవి కాకుండా, యునైటెడ్ నేషన్స్‌కి అధికారికంగా అనుబంధించబడిన 15 ప్రత్యేక సంస్థలు వ్యవసాయం నుండి విమానయానం, ఆరోగ్యం నుండి తపాలా సేవల వరకు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్త సహకారం, ప్రమాణాలను నిర్వహిస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు మానవాళి జీవనానికి, ప్రపంచ శాంతి చిహ్నానికి ప్రతీక. కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ నిర్ణయాలు తీసుకున్నా, ఇది ఒక శాంతి వేదిక, గౌరవ మధ్యవర్తిత్వం, మానవతా సహాయం. మన ప్రపంచంలో శాంతి, న్యాయం చూపించే చివరి స్థిరమైన వేదిక. భద్రతా మండలిలో కొన్ని శాశ్వత సభ్య దేశాలకు ఉన్న వీటో అధికారంతో పాటు ఆ దేశాల రాజకీయ ప్రయోజనాలు కారణంగా వివిధ దేశాల మధ్య యుద్ధాలు పెరుగుతున్నా వాటిని విరమించడంలో ఐక్యరాజ్యసమితి విఫలం చెందడంతో ఈ సంస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

-నూతలపాటి రవికాంత్

97044 44108

Next Story