- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీలో స్తబ్దత ఈనాటిది కాదు - బీఎస్ రాములు
45 ఏళ్ల తరువాత పీపుల్స్ వార్ పార్టీ / మావోయిస్టు పార్టీ అనివార్య స్థితిలో సాయుధ పోరాటం వదిలేస్తున్నదని 1985లోనే మాజీ నక్సలైటు కేరళ వేణు చెప్పారు.

కేరళ వేణు మాజీ నక్సలైటు( ప్రస్తుతం జర్నలిస్టు) చాలా పేరున్న నాయకుడు. వారి పార్టీ కేంద్ర కమిటీలో సీనియర్ నాయకుడు. ఈరోజు ఆయన ఆలోచిస్తే రేపు దేశం ఆలోచిస్తుంది అని ఆయనకు పేరుంది. 1985 అక్టోబర్ లో ఢిల్లీలోని జె ఎన్ యూ లో సుదీర్ఘ ప్రసంగం చేసారు. నేను వరవర రావు గద్దర్ సంజీవ్ పాల్గొన్నాము. కేరళ వేణు తాము మాస్ లైన్ పార్టీ అవగాహనను మార్చుకున్నాము. వర్గ శత్రువు నిర్మూలన, వర్గ పోరాటాలు వదిలి వేసాము. సామ్రాజ్య వాదుల చేతుల్లో దేశం నయా వలస దేశంగా మారింది. పెటీ బూర్జువా, జాతీయ బూర్జువా తో కలిసి అంతర్జాతీయ సామ్రాజ్య వాదులపై జాతీయ పోరాటాలు చేయాలనే అవగాహనకు వచ్చాము అన్నాడు. ఈ అవగాహన కు ఎందుకు వచ్చామంటే… అతి పేదరికం నుండి ఉద్యమాలతో అందరిలాంటిసగటు జీవితంలోకి ప్రజలు వచ్చాక ఉద్యమాలకు రావడం ఆగిపోయింది. ప్రతి చోట ఇదే జరిగింది. ప్రజలు కనీస ఎదుగుదల కోరుకున్నారు. విప్లవానికి ముందుకు రాలేదు అని కారణాలు చెప్పారు. అప్పటికింకా గాట్ ఒప్పందాలు ప్రపంచీకరణ మొదలు కాలేదు. ఆయన ముందు చూపుకు ఆశ్చర్యం కలిగింది. 45 ఏళ్ల తరువాత పీపుల్స్ వార్ పార్టీ / మావోయిస్టు పార్టీ అనివార్య స్థితిలో సాయుధ పోరాటం వదిలేస్తున్నది.
నాకు కనువిప్పు కలిగించిన వారిలో కేరళ వేణు ఒకరు. ఆ పర్యటనలో శంకర్ గుహ నియోగి, స్వామి అగ్ని వేష్ మరో ఇద్దరు కూడా కనువిప్పు కలిగించారు. ప్రజా సంఘాలను మూసి వేయడం మూసివేసే దిశకు ఉద్యమం ను తీసుకు వెళ్లడంతో మావోయిస్టు పార్టీ స్తబ్దతకు లోనైంది. అలాంటి “నిర్ణయం” (వ్యూహం ఎత్తుగడ లు కార్యక్రమాలు) తీసుకున్నపుడే అది ఆగిపోయింది. మైదానప్రాంత ప్రజలకు దూరమైంది. అందుకే నేను 1985 నుండి పార్టీ గత 40 ఏళ్లలో ఒక్క అంగుళం ముందుకు పోలేదు అని చాలా సార్లు చెప్పాను, రాసాను. అడవిలో వెన్నెల అనే కథల సంపుటిలో (2013) 100 పేజీల ముందుమాటలో వివరించాను. అఖిల భారత పర్యటన స్వీయ చరిత్ర( 2025)లో కేరళ వేణు, శంకర్ గుహ నియోగి, స్వామి అగ్నివేష్, శిబ్దాష్ ఘోష్, యంసీసీ పార్టీల వారితో 1985 ఆనాడు జరిగిన చర్చలు నమోదు చేయడం జరిగింది.
- బి ఎస్ రాములు






