- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛిద్రమౌతున్న సాఫ్ట్‌వేర్ స్వప్నం
యువత ఉద్యోగ భద్రతపై కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం గగనకుసుమంగా మారిన నేపథ్యంలో

యువత ఉద్యోగ భద్రతపై కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం గగనకుసుమంగా మారిన నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాలపై కూడా వేటు పడనుందా? ఏఐ యువత పాలిట శాపంగా మారనుందా? అనే మీమాంస బయలు దేరింది. ఒకప్పుడు టెకీల గురించి, వారి సంపాదన గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్లం. టెక్ నగరాలంటే ఎంతో మక్కువ ప్రదర్శించే వాళ్లం. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, కుటుంబ బాధ్యతలను నెట్టుకురావడం కష్ట సాధ్యమైన సందర్భంలో ఎంతో మంది యువత ఈ రంగంలో స్థిరపడ్డారు. అయితే ఇదంతా ఒక గతం. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సాఫ్ట్‌వేర్ రంగం సంక్షోభాన్ని చవిచూస్తున్నది. సాంకేతిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. ఏఐ చాప క్రింద నీరులా చొచ్చుకు వచ్చింది. నేడు కృత్రిమ మేథను అందిపుచ్చుకుని, అందులో ప్రావీణ్యత సంపాదించగలిగితేనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు నిలబడతాయి. మరికొద్ది సంవత్సరాల్లో కృత్రిమ మేథ సాంకేతిక రంగాన్ని శాసించబో తున్నది. ఏఐ వలన ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ యువతలో ఇంకా సాఫ్ట్‌వేర్ పట్ల మక్కువ పోకపోవడం వాస్తవాన్ని గ్రహించకపోవడం తీవ్రమైన తప్పిదం. పది మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో కేవలం ఒక్కరితో సుసాధ్యం చేసే విప్లవాత్మక మార్పులు చోటు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా గతంలో మాదిరిగా బట్టీ చదువులతో, మార్కుల కోసం కుస్తీ పడడం, ఇందుకోసం లక్షలాది రూపాయలను కిండర్ గార్డెన్ స్థాయి నుండే విద్యార్థులపై వెచ్చించడం సహేతుకం కాదు. అందుకే ఉన్నతమైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. వివిధ రంగాల్లో నెలకొన్న సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, అధిక ఖర్చులకు కళ్లెం వేయడం, సమయాన్ని ఆదా చేయడం, ఉత్పాదకత పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి.
-సుంకవల్లి సత్తిరాజు
97049 03463






