- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఉద్యోగుల పరిస్థితి శోచనీయం
రైలు కార్యకలాపాల భద్రత విషయానికొస్తే సిగ్నల్, టెలికాం విభాగం అత్యంత ముఖ్యమైనది. ఈ కార్మికు లు నిర్మించే ఇంటర్ లాకింగ్

రైలు కార్యకలాపాల భద్రత విషయానికొస్తే సిగ్నల్, టెలికాం విభాగం అత్యంత ముఖ్యమైనది. ఈ కార్మికు లు నిర్మించే ఇంటర్ లాకింగ్ సర్క్యూట్‌లు రైల్వే వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి, సంక్లిష్టమైనవి. ఈ విభాగ ఉద్యోగులు పని ప్రారంభించడానికి ముందు దాదాపు ఒకటిన్నర సంవత్సరం శిక్షణ పొందుతారు. ఇంటర్ లాకింగ్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ప్రతి రిలే రూమ్‌లో లక్షలాది వైర్లు, విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. చిన్న తప్పులు కూడా దారుణమైన ఫలితాలకు దారి తీస్తాయి. ట్రాక్ యంత్రాలను నిర్వ హించే ప్రతి గ్యాంగ్‌లో సిగ్నల్, టెలికాం విభాగం నుండి ఒక కార్మికుడు ఉండాలని ఆదేశించబడింది. అయితే ఉద్యోగ ఖాళీలను పూరించకపోవడం, అధిక పనిగంటలు, భద్రత లేకపోవడం, తగినంత విశ్రాంతి లేక పోవడం వంటి సమస్యలు ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా, కార్మికులు మధుమేహం, రక్తపోటు, గుండె పోటు వంటి అనేక శారీరక సమస్యలతో బాధ పడుతూ కుటుంబం, స్నేహితులకు సమయం కేటాయించ లేకపోతున్నారు, ఇది వారి మానసిక భావోద్వేగంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది ప్రయాణీకుల భద్రతను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఈశాన్య రైల్వే జోన్‌లో ఒకప్పుడు ఒకే లైన్ మాత్రమే ఉండేది. 45,000 మంది కార్మికులు పని చేసేవారు. ఇప్పుడు అధిక లైన్లతో విస్తరించినా 41,000 మంది మాత్రమే ఉన్నారు. ట్రాక్‌ల పై పని చేయాల్సిన వారందరితో పాటు ఇందులో సిగ్నల్, టెలికాం ట్రాక్ మెయింటెనర్లు సిబ్బంది కూడా రక్షణ పరికరాలు ఇవ్వాలి. కానీ వాటిని ఇవ్వటం లేదు. ఇక ప్రతి సీజన్‌లో ట్రాక్ నిర్వహణదారులు చలి, కుండపోత వర్షం లేదా మండుతున్న ఎండలో బయట కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వారు భారీ బరువులు మోస్తూ మైళ్ల దూరం నడవాల్సి ఉంటుంది. వారు ట్రాక్‌ల దగ్గర కూర్చుని తినాల్సి ఉంటుంది. వారికి తాగునీరు లేదా విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశాలు లేవు. కావున అధి కారులు రైలు ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించాలి.
ఆళవందార్ వేణు మాధవ్
8686051752






