పూలలో పొంగిన తెలంగాణ గౌరవం

by Ravi |   (  Updated:2025-09-24 00:30:30  IST  )

ఆశ్వయుజ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి దసరా. అయితే బతుకమ్మ

పూలలో పొంగిన తెలంగాణ గౌరవం
X

ఆశ్వయుజ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. 9 రోజులు జరుపుకునే ఈ పండుగలో రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. ఎంగిలిపుప్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటూ ఇట్లా దేని ప్రత్యేకత. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుతూ పాడుతూ నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఈ బతుకమ్మ పాటల్లో మహిళల తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు ఈ పాటల్లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తదుపరి ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. బతుకమ్మను తెలంగాణాలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉన్నది. ఈ సాంప్రదాయం ఎట్లా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు మొదట్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు, రంగు రంగులలో చేనులలో పూసి ఉంటాయి. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

-దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story