- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలను పీడించే పోర్న్ భూతం..
మీ పిల్లలు ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు (పోర్న్) చూస్తున్నారా? మీ పిల్లలు వయస్సుకు తగని కంటెంట్‌పై ఆధారపడుతున్నట్లు చూపించే లక్షణాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్ కేవలం ఒక క్లిక్ దూరంలోనే ఉంది.

మీ పిల్లలు ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు (పోర్న్) చూస్తున్నారా? మీ పిల్లలు వయస్సుకు తగని కంటెంట్‌పై ఆధారపడుతున్నట్లు చూపించే లక్షణాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్ కేవలం ఒక క్లిక్ దూరంలోనే ఉంది. పిల్లలు, యువత తమ సమయాన్ని ఎక్కువగా స్క్రీన్‌ల ముందే గడుపుతున్నందున, వారు పోర్న్‌పై ఆధారపడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయా అని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు వర్చువల్ లైంగిక దుర్వినియోగానికి గురి కాకుండా నివారించవచ్చు, అలాగే చెడు వ్యసనాల బారిన పడకుండా వారిని మనం తప్పించగలం.
మొబైల్‌లో నిషేధం పనిచేయదు..
చిన్న వయసు పిల్లల కోసం ఇంటర్నెట్ ఫిల్టర్లు, చైల్డ్ లాక్స్, వెబ్‌సైట్ బ్లాక్‌లను ఉపయోగించాలి. ఇంట్లో ఉన్న సమయంలో పిల్లలు అన్ని తరగతులను ఆన్‌లైన్‌లోనే చదువుతున్నందున ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగింది. కానీ ఇంటర్నెట్ ఒక రెండువైపుల పదును ఉన్న కత్తిలాంటిది. ఉపయోగకరమైన విషయాలతో పాటు హానికరమైన కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ట్విట్టర్.. ఇవన్నీ కలిపిన దానికంటే ఎక్కువగా పోర్న్‌ను బ్రౌజ్ చేసి చూస్తున్నారు. పూర్తిగా చూడకుండా ఆపడం కష్టం అయినప్పటికీ, అది అలవాటుగా (వ్యసనంగా) మారకుండా.. జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం.
ఈ లక్షణాలను గుర్తించాలి..
మీ పిల్లలు ఎంత తరచుగా మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు, ఎంతసేపు మొబైల్‌ని ఉపయోగిస్తున్నారు అన్నదాన్ని గమనించాలి. తరచుగా చూస్తుంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పెద్ద వయసు పిల్లల విషయంలో మాత్రం ఫిల్టర్లు ఎప్పుడూ పనిచేయవు. ఎందుకంటే వారు టెక్నాలజీ విషయంలో చురుగ్గా ఉంటారు, తల్లిదండ్రులు గాడ్జెట్లు చూడకముందే బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం వారికి తెలుసు.. కాబట్టి, వాటికి బదులుగా కొన్ని లక్షణాలపై దృష్టి పెట్టాలి. పిల్లలు ఇతర కార్యకలాపాలకు “లేదు”, "కాదు" అని చెప్పడం మొదలు పెడతారు. పాఠశాల లేదా కళాశాలలో వారి ప్రగతి తగ్గుతుంది. తమ గాడ్జెట్ల విషయంలో అధిక రహస్య భావం, అధిక రక్షణ చూపడం, ఎక్కువ ప్రైవసీని ఇష్టపడటం, రోజువారీ పనుల్లో కలగచేసుకోపోవడం. ఎక్కువ కోపం లేదా ఆగ్రహం. వారితో గొడవ పడటం కన్నా సంవాదం చాలా ముఖ్యం.
పిల్లలకు దూరం కావద్దు..
పిల్లలతో ప్రారంభం నుండి క్లోజ్‌గా, సులభంగా మాట్లాడే మార్గాలను ఏర్పాటు చేయండి, తద్వారా వారు మీతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. అదే సమయంలో, ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు మీకూ సౌకర్యంగా ఉండే మార్గాన్ని కనుగొనండి. ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. మన సంస్కృతి, పరిణామం కారణంగా తల్లిదండ్రులు పోర్న్, లైంగిక ప్రవర్తన గురించి పిల్లలతో మాట్లాడటంలో అసౌకర్యంగా ఉంటారు, దాని వల్ల నెగటివ్ పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. పిల్లలు పోర్న్ చూసినందుకు వారికి అవమానించకండి.
ఒత్తిడికి గురిచేయకండి!
పోర్న్ లైంగికత, సంబంధాల గురించి అవాస్తవమైన దృశ్యాలను చూపిస్తుంది. వ్యసనం, ఆధారపడడం అనేవి పిల్లలపై దుష్ప్రభావాలను కలిగించి, పోర్న్ కంటెంట్ పీడితులుగా మారే అవకాశాన్ని కలిగిస్తుంది అని వారికి తెలియజేయండి. ప్రారంభం నుండి పిల్లలకు ఏ కంటెంట్ వయస్సుకు సరిపోతుందో తెలియజేయడం చాలా ముఖ్యం. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది, వారిని ఒత్తిడికి లోనూ చేయకండి, వారికి ప్రేమతో దగ్గర అయ్యి సహాయం చేయండి, వ్యసనం నుండి విముక్తి చేయండి.
-అనూరాధ నాయుడు ఎం
మనో వికాస నిపుణులు
83175 88344






