కాలానికి ఎదురీదిన కార్మిక ఉద్యమం

by Disha edit |
కాలానికి ఎదురీదిన కార్మిక ఉద్యమం
X

ఉరితీతకు ముందు 'మా మూగబోయిన గొంతులే రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుందని' చివరగా వారు మాట్లాడిన మాటలు గాలిలో ధూళిలా కలిసిపోలేదు. వారి త్యాగం బూడిదలో పోసిన పన్నీరు కాలేదు. ఐరోపా కార్మికోద్యమం అండగా నిలిచింది. 1889లో పారిస్‌లో జరిగిన సోషలిస్టు అంతర్జాతీయ రెండవ మహాసభ మే ఒకటవ తేదీని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏక కాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే ఒకటిన లోకానికి శ్రమ విలువను చాటుతూ ఐరోపా తొలిసారిగా కార్మికులంతా 'ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని' నిర్వహించారు.

వేదనలు, రోదనలు అంతరించి పోవాలని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఖండాలకు అతీతంగా శ్రామిక జనులు జరుపుకునే పండుగ దినమే మేడే. కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కార్మిక వర్గం తమ బాధలను తీర్చుకోవడానికి పోరుబాటన నడిచారు. 'పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప' అంటూ సిద్ధాంత ఆయుధాన్ని ఇచ్చింది మాత్రం మార్క్సిజమే. 1886 కి పూర్వం పాశవిక పెట్టుబడిదారి విధానం కార్మికుల హక్కులను ఏ మాత్రం గుర్తించేది కాదు. కార్మికులతో 14 నుంచి 15 గంటలపాటు పని చేయించేవారు. ఈ క్రమంలోనే పని గంటలను ఎనిమిదికే పరిమితం చేయాలని అమెరికా, యూరప్‌లో ఉద్యమం నడిచింది. 1886 ఆగస్టులో బాల్టిమర్‌లో జరిగిన ఒక సదస్సులో ఎనిమిది గంటల పనిదినాన్ని నిర్ణయించాలనే డిమాండుతో అమెరికన్ కార్మికులు ఒక తీర్మానం చేశారు.

ఈ సదస్సు జరిగిన రెండు వారాలలోనే మార్క్స్ సంస్థ మొదటి సమావేశం జెనీవాలో నిర్వహించారు. ఇందులో కార్మికుల ఎనిమిది గంటల పని దినాన్ని ప్రాథమిక అవసరంగా గుర్తించాలని, అది లేకుండా కార్మిక వర్గ విముక్తి, ప్రగతి కోసం సాగించే ప్రయత్నాలన్నీ నిరుపయోగమవుతాయనే ప్రతిపాదన వచ్చింది. తరువాత మార్క్స్ ఏంగెల్స్ అసోసియేషన్ 1866-86 మధ్య కార్మికవర్గ ఉద్యమం సామూహిక హత్యలు, ఉరితీతలను ఎదుర్కొంటూ అనేక ఇబ్బందుల మధ్య కొనసాగినా దాని పురోగమనం మాత్రం ఆగలేదు. వారి కార్యకలాపాలు పారిస్ కార్మికుల తిరుగుబాటుతో ఉన్నత స్థాయికి చేరాయి యూరప్ అంతటా విప్లవ ప్రతిఘాతం గజ్జె కట్టి విలయతాండవం చేసింది. తత్ఫలితంగా లండన్ నుంచి అమెరికాకు మొదటి అంతర్జాతీయ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని తరలించవలసి వచ్చింది.

వారి మాటలు గాలిలో ధూళి కాలేదు

1876 నాటికి పోరాటం ఉధృతమైంది. 1884లో అమెరికా, కెనడా ఆర్గనైజ్డ్ ట్రేడ్ అండ్ లేబర్ యూనియన్ నాలుగవ మహాసభ జరిగింది. అందులో 1886 నుంచి ఎనిమిది గంటల పనిదినం ఉంటుందని తీర్మానం చేశారు. అది అమలులోకి రాకపోవడం సమ్మెకు దారితీసింది. చికాగోలో 1886 మే మూడున జరిగిన సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. కార్మిక ఉద్యమాన్ని ఎదురు దెబ్బతీయాలని నిశ్చయించిన పోలీసులు దాడి జరపడంతో ఆరుగురు కార్మికులు మరణించారు. ఎందరో గాయపడ్డారు. అందుకు నిరసనగా మే నాలుగున కార్మికులు ప్రశాంతంగా నిరసన తలపెట్టారు. ఆ ప్రదర్శనలో కొన్ని అరాచక శక్తులు కలిసిపోయి బాంబు దాడికి పాల్పడ్డాయి. ఎందరో కార్మికులు, పోలీసులు మరణించారు. ఈ రక్తతర్పణంతోనూ దాహం తీరని అధికారులు కార్మిక నాయకులైన ఆల్బర్ట్ వర్ సాన్స్,ఆగస్ట్ స్లైస్, అడాల్ఫ్ ఫిషర్, జార్జి ఏంగెల్స్ పై అక్రమ కేసులు బనాయించి ఉరి తీసారు ఎంతో మంది నాయకులు జైలు పాలయ్యారు.

ఉరితీతకు ముందు 'మా మూగబోయిన గొంతులే రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుందని' చివరగా వారు మాట్లాడిన మాటలు గాలిలో ధూళిలా కలిసిపోలేదు. వారి త్యాగం బూడిదలో పోసిన పన్నీరు కాలేదు. ఐరోపా కార్మికోద్యమం అండగా నిలిచింది. 1889లో పారిస్‌లో జరిగిన సోషలిస్టు అంతర్జాతీయ రెండవ మహాసభ మే ఒకటవ తేదీని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏక కాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే ఒకటిన లోకానికి శ్రమ విలువను చాటుతూ ఐరోపా తొలిసారిగా కార్మికులంతా 'ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని' నిర్వహించారు.

అది చివరి ఆయుధం కావాలి

భారత దేశంలో 80 సంవత్సరాలకు ముందు నుంచే 'మేడే' ఉత్సవాలు జరుగుతున్నాయి. 1920 -1925 మధ్య కాలంలో కమ్యూనిస్టు సోషలిస్టు భావాలు భారత్‌లో వ్యాప్తి చెంది కార్మికులతో పాటు కర్షకులు సంఘటితమయ్యారు, దీంతో ఆంగ్లేయ ప్రభుత్వం భయపడి ప్రజా రక్షణ బిల్లు పేరుతో 'కేవలం అనుమానంతోనే ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చని' చట్టం చేసింది. 1929లో 32 మంది కార్మిక సంఘాల నేతలతోపాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసింది. వీరిని మీరట్ జైలులో మహాత్మా గాంధీ, నెహ్రూ పరామర్శించడం, అది చర్చనీయాంశంగా మారడం, అమెరికా, ఫ్రాన్స్ , ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ తదితర దేశాల నుంచి విమర్శలు రావడంతో వారిని 1933లో విడుదల చేసింది. 19వ శతాబ్దంలో సుమారుగా 20 నుండి 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు మినహా మరెవ్వరూ మేడే జరిపేవారు కాదు. ఆ తరువాత కాలంలో కమ్యూనిస్టేతరులు మేడే నిర్వహణకు పూనుకున్నారు.

పశ్చిమ దేశాలకుండే రుగ్మతల కారణంగా, పెట్టుబడిదారీ విధానాన్ని తుదముట్టించడమనే లక్ష్యం కారణంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమం సమష్టిగా 'మేడే' జరుపలేకపోయింది. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఒక భాగంగా ఉన్న నాయకత్వం సోషలిజం, రాజకీయాల పేరెత్తడానికి వ్యతిరేకం. బ్రిటిష్ ప్రభుత్వంతో ప్రజలు మిలాఖత్ అయ్యేందుకు నిరాకరించగానే 1929లో వారు ఏఐటీయూసీని విచ్చిన్నం చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ పోరాటం చేయకూడదని షరతు విధించారు. 1903 మేడే సందర్భంలో సహితం లెనిన్ ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సమాజ అభివృద్ధితోపాటు శ్రామికులకు ఉపయోగపడాలి. కానీ, పెట్టుబడిదారుల వ్యవస్థలో శ్రామికులపై దోపిడి తీవ్రతకు అవి సాధనాలుగా మారకూడదని, సమ్మెకు దిగడం కార్మికుల చేతిలో చివరి ఆయుధం కావాలని పిలుపునిచ్చారు. కానీ, రేపటి ఉదయం కోసం 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అంటూ అందరూ చేతులు కలుపక తప్పని పరిస్థితి నెలకొంది.

(నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం)

నరేందర్ రాచమల్ల

99892 67462


Next Story

Most Viewed