- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా.. నూతన జాతీయ విద్యా విధానం
భారతదేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికిన జాతీయ విద్యా విధానం -2020ని ప్రకటించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి.

భారతదేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికిన జాతీయ విద్యా విధానం -2020ని ప్రకటించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ చర్చలు, విస్తృత సంప్రదింపులు, సునిశిత అధ్యయనం తర్వాత 2020 జూలై 29న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానం, దేశ వ్యాప్తంగా విద్యా రంగంలో వచ్చిన మూడో ప్రధాన సంస్కరణ.
గతంలో 1968లో కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన విధానం, ఆ తర్వాత 1986 నాటి విద్యా విధానం, 1992లో దాని సవరణలు అమలులోకి వచ్చాయి. అయితే, 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా, జ్ఞాన సమాజ నిర్మాణ లక్ష్యంతో జాతీయ విద్యా విధానం- 2020 ఒక విప్లవాత్మక మార్పునకు బీజం వేసింది. ఈ ఐదేళ్లలో సాధించిన ప్రగతి, తీసుకొచ్చిన సంస్కరణలతో భారతదేశంలోని విద్యా వ్యవస్థ ప్రపంచ స్థాయి జ్ఞాన మార్కెట్ పోటీని తట్టుకోగలదు.
విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి..
జాతీయ విద్యా విధానం అనేక సంస్కరణలకు కేంద్రం గా నిలిచింది. ముఖ్యంగా పాఠశాల విద్యలో ప్రస్తుతం ఉన్న 10 G2 విద్యా విధానాన్ని 5G3 G3 G4 విధానంగా మార్చడం ఒక కీలకమైన మార్పు. ఇది ప్రీ-స్కూల్ విద్య (ఫౌండేషనల్ స్టేజ్)ను జాతీయ విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చింది. 3-8 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆ ట పాటలతో కూడిన విద్యను అందించడం, బలమైన పు నాదిని నిర్మించడం దీని లక్ష్యం. మధ్యలో బలవంతపు ప రీక్షలను తగ్గించి, నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇచ్చింది. 2030 నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి సాధించడం ఒక ఉన్నతమైన లక్ష్యం.
ఉన్నత విద్యలో సంస్కరణలు..
ఉన్నత విద్యలోనూ అనేక ముఖ్యమైన సంస్కరణలను జాతీయ విద్యా విధానం-2020 ప్రతిపాదించింది. ముఖ్యంగా, బహుళ ప్రవేశం, నిష్క్రమణ విధానం విద్యార్థులకు అపారమైన వెసులుబాటును కల్పించింది. అంటే, ఒక విద్యార్థి మధ్యలో చదువు ఆపివేసినా, తిరిగి ప్రవేశించి తన విద్యను కొనసాగించవచ్చు. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారి ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా కోర్సు లను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది.
అంగన్‌వాడీ, ప్రీ- స్కూల్ విద్య
అనేక రాష్ట్రాలు అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తూ, ప్రీ-స్కూల్ విద్యను పాఠశాల వ్యవస్థలో భాగం చేశాయి. ‘నిపుణ్ భారత్’ మిషన్ ద్వారా ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించబడింది. ఉన్నత విద్యలో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ప్రారంభించబడింది. ఇది విద్యార్థులు వివిధ సంస్థల నుండి సంపాదించిన క్రెడిట్‌లను డిజిటల్‌గా నిల్వ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అన్ని స్థాయిల్లో బోధన అభ్యసన సులభతరం చేయాలన్న తలంపుతో తెచ్చిన ఈ సంస్కరణను పలు రాష్ట్ర ప్రభు త్వాలు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులను మాతృభాషలో అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి.
మిశ్రమ బోధనకు ప్రాధాన్యత
నూతన విద్యా విధానం మిశ్రమ బోధన విధానానికి ప్రాధాన్యత నిచ్చింది. 60:40లో విద్యా బోధన వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని సూచించింది. అందుకు అనుగుణంగా దీక్షా పోర్టల్, స్వయం వంటి వేదికలు డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమ యంలో విద్యా రంగం కుంటుపడకుండా ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం, నైపుణ్య ఆధారిత విద్యకు ప్రోత్సాహం వంటి చర్యలు యువత ఉపాధి అవకాశాలను పెంచే దిశగా సాగుతున్నాయి.
భవిష్యత్ భారతదేశం దిక్సూచి
భారతదేశ విద్యారంగం గత ఐదేళ్లలో గణనీయ పురోగతి సాధించింది. ఎన్ఈపీ 2020 కేవలం ఒక విద్యా విధానం కాదు, ఇది ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సమ గ్ర ప్రణాళిక. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడటానికి భారతదేశానికి ఈ విధానం అత్యవసరం. రాబోయే సంవత్సరాల్లో, ఈ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, క్షేత్రస్థాయిలో సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థు లు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యను నిరంతరం మెరుగుపరచడం, ప్రతిభకు, సృజనాత్మకతకు పట్టం కట్టడం ద్వారానే మనం నిజమైన జ్ఞాన సమాజాన్ని నిర్మించగలం. ఎన్ఈపీ 2020 ఈ దిశగా ఒక బలమైన అడుగు.
(నూతన విద్యా విధానానికి నేటితో అయిదేళ్లు పూర్తి)
డా. రావుల కృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్
94929 09371






