- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్ సబ్జెక్టులకే భవిష్యత్తు.. ఇంజినీరింగ్ ట్రెండు మారుతుందా?
ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తే తన జీవితం బాగుంటుందని ఆశ పిల్లల్లోనూ, అటు తల్లితండ్రులలోనూ ఉండేది. కానీ నేడు

ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తే తన జీవితం బాగుంటుందని ఆశ పిల్లల్లోనూ, అటు తల్లితండ్రులలోనూ ఉండేది. కానీ నేడు కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్య ఒకటే.. ఇంజినీరింగ్ విద్య అనే ఆలోచనకు విద్యార్థులు సమిధలవుతున్నారు. నేటి తరం కోడ్ రాయడాన్నే ప్రతిభగా భావిస్తోంది.
ఒకప్పుడు బ్రిడ్జిలు, డ్యాములు, రైల్వేలు, ఇంధనోత్పత్తి, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణుల తయారీ మొదలు యుద్ధ విమానాల అభివృద్ధి వరకు కూడా కోర్ సబ్జెక్టులపైనే దేశం ఆధారపడింది. కానీ ఇప్పుడు ఈ రంగాల్లో నిపుణులు కొరవడితే భవిష్యత్తులో పశ్చాతాపం తప్పకపోవచ్చు. సాంప్రదాయ రంగాలను పక్కన పెడితే, కోర్ సబ్జెక్టులను వదిలేస్తే నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంప్రదాయ కోర్ విభాగాలను చదివిన వారు గతంలో ఎందరో ఇంజినీరింగ్ నిపుణులు ప్రముఖంగా నిలిచి.. దేశాన్ని ముందుకు నడిపించారు.
కోడ్ రాయడమే ప్రతిభకు చిహ్నమా?
ఇప్పుడు ఇంజినీరింగ్ చదవడం అంటే కోడ్ రాయ డాన్నే ప్రతిభగా భావిస్తోంది. కానీ ఒకప్పుడు చదివిన విద్యను పరిశీలిస్తే కీలకమైన పారిశ్రామిక విభాగాలన్నీ కోర్ సబ్జెక్టులపైనే ఆధారపడేవి. అలాంటిది ఈ రంగాలలో నిపుణులు కొరవడితే భవిష్యత్తులో పశ్చాతాపం తప్పకపోవచ్చు. అందుకే ఇటీవల కాలంలో ఇంజినీరింగ్ కాలేజీలో కోర్ సబ్జెక్టుల్లో సీట్లు తక్కువగా ఉన్నా సరే.. సంప్రదాయ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులే ముందుగా ఉద్యోగాలు పొందుతున్నారు. పైగా కోర్ సబ్జెక్టులతో పాటు కోడింగ్ ప్రావీణ్యం ఉన్న విద్యార్థులను సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వీరు ఇటు సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు తమకు నచ్చిన కోర్ సంస్థలో కూడా జాబ్స్‌కి సెలెక్ట్ అవుతున్నారు. అట్లే గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీకి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ జాబ్స్‌కు అధిక ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో EEE విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సెమీకండక్టర్ పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందుతున్నందున ఉద్యోగాలు కూడా ఈ బ్రాంచీలో పెరుగుతాయని అంచనా ఉంది. అలాగే ECEకి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఈ మార్పులు జరగకపోతే..
పాఠశాల స్థాయి నుండే కంప్యూటర్ సైన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుండం తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్ రంగంలోనే మంచి భవిష్యత్తు ఉందంటూ తమా పిల్లలను పరిచయం చేస్తున్నారు. కోర్ ఇంజినీరింగ్ విభాగాలలో పరిశోధన, అభివృద్ధికి తగిన ప్రోత్సాహం లేకపోలేదు. అధ్యాపకులు సంప్రదాయ కోర్సుల వల్లనే భవిష్యత్తు ఉంటుందని విద్యార్థి లోకానికి తెలియపరచాలి. విద్యాసంస్థలు కోర్ ఇంజినీరింగ్‌ను సమర్ధంగా బలోపేతం చేయాలి. ఈ మార్పు జరగకపోతే మౌలిక రంగాల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. పట్టణీకరణ అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదవవలసినది కోర్ ఇంజినీరింగ్ విభాగాలే..
ఏఐతో.. ఐటీ రంగానికి గడ్డుకాలమేనా?
కృత్రిమ మేథ ప్రభావం కారణంగా ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందోననే అంతర్మధనం తల్లిదండ్రులలోనూ, విద్యార్థులలోనూ ఉంది. దీనివల్ల ఈసారి కోర్ బ్రాంచీలలో చేరికలు పెరుగుతాయని భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ సంస్థలతో ఒప్పందాలు, పరిశ్రమల స్థాపన వల్ల ప్రభుత్వ సమీకృత నిర్మాణాల రంగం, విద్యుత్ లైన్లు ఏర్పాట్లు, రహదారుల నిర్మాణం కావచ్చు, ఆటోమొబైల్, టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏర్పడబోతున్నాయి. వీటిలో ఇంజినీరింగ్ నిపుణులు మాత్రమే అర్హులు. వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు సంస్థల్లో కనిష్టంగా 40,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మల్టీ డిసిప్లినరీ కోర్సులదే రాజ్యం!
కోర్ సబ్జెక్టులు చదివి సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లాలనుకునే వారు మైనర్ కోర్సుగా కంప్యూటర్స్ కోర్సు తీసుకోవచ్చు అన్న విషయాన్ని చాలామంది తెలుసుకోవాలి. భవిష్యత్‌లో వచ్చేవన్ని మల్టీ డిసిప్లినరీ కోర్సులే.. ఈ కోర్సులే రాజ్యమేలుతాయి. ఒక్కోసారి ఒక బ్రాంచ్‌కి డిమాండ్ వస్తుంది. వచ్చే సంవత్సరాల్లో కోర్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ ఇలా ఏమీ ఉండవు.. మెడికల్ ఏఐ, రోబోటిక్ ఏఐ, మెకట్రానిక్స్, ఏఐ, కాంపిటీషనల్ అండ్ మెకానిక్స్, గణితం, కంప్యూటింగ్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్, కంప్యూటర్ ఎకనామిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటేషన్ ఇలా అన్ని కలిపి చదవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా ప్రత్యేకత చాటుకునేందుకు మన నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
-డాక్టర్ ముసిని వెంకటేశ్వర్లు
ప్రొఫెసర్
99892 95635






