- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు సరికాదు!
తెలంగాణలోని అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, ముఖ్యంగా జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

తెలంగాణలోని అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, ముఖ్యంగా జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH)కి అనుబంధంగా ఉన్న సంస్థలు ప్రస్తుతం ట్యూషన్ ఫీజు పెంపు పెంచే ప్రక్రియలో ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ కొన్ని కాలేజీల ఫీజులు రూ. 1.10 లక్షల నుండి రూ. 2.45 లక్షల వరకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గణనీయమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఫీజు పెంపు అమలులోకి వస్తే, మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులకు ఇది తీవ్రమైన ఆర్థిక భారం అవుతుంది. ఒక ఇంజనీరింగ్ డిగ్రీపై కలలు కంటున్న విద్యార్థి చదువు మానేసే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని కళాశాలలు ట్యూషన్ ఫీజులను పెంచేందుకు TAFRCకి తప్పుడు ఆడిట్ రిపోర్టులు సమర్పిస్తున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజమైన ఖర్చులను చూయించకుండా ఎక్కువ ఫీజులను కావాలనే కళాశాలల ధోరణి పేద విద్యార్థులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కేవలం విద్యార్థుల వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇది సమాజంలోని విద్యా సమానత్వాన్ని దెబ్బతీసే అంశం. ఫీజు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం పైనా ఆర్థిక భారం పెరగనుంది. నిజానికి ప్రస్తుతం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 35,000 వరకు ఇస్తోంది. గతంలో ఉన్న ఫీజుల పరిమితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ గరిష్ట పరిమితి, ప్రస్తుతం ప్రతిపాదిత ఫీజులతో పోల్చితే చాలదనే అభిప్రాయం ఏర్పడుతోంది. అందువల్ల, ఈ పరిస్థితిలో ఫీజుల పెంపు అంశాన్ని సమీక్షించడంతో పాటు, ఫీ రీయింబ ర్స్‌మెంట్ మొత్తాన్ని కూడా పెంచాలి. దీనివల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం కొంత తగ్గు తుంది. అప్పుడే సమాజంలో విద్యా అవకాశాల సమానతను కాపాడగలుగుతాం.
- రిషి మలిశెట్టి
90140 40507






