- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో ద్వంద్వ పోటీ యుగం
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి ఎదురైన రాజకీయ సవాళ్లు, తృణమూల్ కాంగ్రెస్‌పై పెరిగిన వ్యతిరేకత, బీజేపీ వ్యూహాత్మక ఎదుగుదలపై విశ్లేషణ

పశ్చిమ బెంగాల్ భావజాలం, సాంస్కృతిక చైతన్యం, శక్తివంతమైన ప్రాంతీయ రాజకీయాలతో ప్రత్యేక గుర్తింపు కలిగిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మమతా బెనర్జీ దాదాపు ఒక దశాబ్దానికి పైగా అధికారంలో కొనసాగడం, మరోవైపు భారతీయ జనతా పార్టీ వేగంగా ఎదగడం ఈ రెండూ కలిసి రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఎదురైన ప్రధాన కారణాల్లో మొదటిది అధికార వ్యతిరేక భావన. ఒకే పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సమానంగా జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రెండవది స్థానిక నాయకత్వంలో విభేదాలు.. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరగడం, కొంతమంది కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరడం పార్టీ బలాన్ని దెబ్బతీశాయి. మూడవది కట్ మనీ వ్యవహారం, శారదా చిట్ ఫండ్ కుంభకోణం, మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, టీచర్ నియామకాల్లో అవినీతి ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించింది. బీజేపీ బెంగాల్‌లో ఒకప్పుడు పరిమిత స్థాయిలో ఉండేది. కానీ గత కొన్నేళ్లలో అది బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. నరేంద్ర మోడీ- అమిత్ షా శక్తివంతమైన ప్రచారం పార్టీకి ఊపునిచ్చింది. ఇక హిందుత్వ రాజకీయాలు, సరిహద్దు అంశాలు, కేంద్ర పథకాల ప్రచారం కూడా ప్రభావం చూపాయి. అలాగే టీఎంసీ నుంచి నేతల చేరికలు పార్టీ బలాన్ని పెంచాయి. యువత ఓటర్లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కీలకంగా మారాయి. మొత్తంగా మమతా బెనర్జీ వ్యక్తిగత ఓటములు రాజకీయ సంకేతాలే తప్ప మొత్తం పార్టీ బలహీనతను సూచించవు. అదే సమయంలో బీజేపీ ఎదుగుదల దీర్ఘకాలిక వ్యూహ ఫలితం. భవిష్యత్తులో బెంగాల్ రాజకీయాలు మరింత తీవ్రమైన ద్వంద్వ పోటీగా మారే అవకాశం ఉంది.
-ఆళవందార్ వేణు మాధవ్
86860 51752






