- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల కలలపై తూటా!
తెలంగాణాలో ఇంజినీరింగ్ విద్య ఖర్చులు పెరుగుతుండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ఫీజులు లక్షల రూపాయలకు పెరగడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడుతోంది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రస్తుతం వార్షిక ట్యూషన్ ఫీజులు రూ.1.10 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండటం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారంగా మారుతోంది. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సును పూర్తి చేయడానికి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ఫీజులు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల విద్యా కమిషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తొలగించాలని సూచించింది. ఈ సూచన అమలులోకి వస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించకపోవడం వల్ల కళాశాలలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అనేక సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్‌లో ఉండటం విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు నిర్వహణ ఖర్చులు, మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపకుల జీతాలు పెరగడం వంటి కారణాలతో ఫీజులు పెంచుతున్నప్పటికీ, ప్రభుత్వం విద్యా ర్థులపై అధిక భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. విద్య పేదవాడి హక్కు కావాలి. అది అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
- రిషి మలిశెట్టి,
90140 40507






