- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలభై సంవత్సరాలు గెలిచిన దళిత పార్లమెంటేరియన్
ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్. ఆయనకు తన జాతి జనులను విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే లక్ష్యం. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవించారు. తన పాఠశాలలో జగ్జీవన్ రామ్ హిందువుల కుండలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు తాగేవారు కాదు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్క ముక్కలు చేశాడు. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన కుండ’ అనే మరో కుండను ఏర్పాటు చేశారు. ఈయన ఆ కుండని కూడా పగులకొట్టారు. ఇక చేసేదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిచ్చి..
జగ్జీవన్ రామ్, తన జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది. ఈ సంఘటన ఆనాడు ఒక రికార్డు. ఆయన 57 ఏళ్ల పాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ శాఖ, రక్షణ, ఆరోగ్య, రైల్వే, రక్షణ శాఖ మంత్రిగా.. ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. జగ్జీవన్ రాం.. అందరిలా మంత్రి కాబట్టి పద విని అనుభవించిన వ్యక్తి కాదు. ప్రతీ బాధ్యతలోనూ తనదైన ముద్ర వేసిన కార్య దీక్షి. బ్రిటీష్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతీయత ముద్ర వేశాడు. ఆయన వివ క్షను ఎదుర్కొంటూ ఉప ప్రధాని స్థాయికి రావడం జగ్జీ వన్ రామ్ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజాసేవకే తన జీవి తాన్ని అంకితం చేసిన ఆయన 1986 జులై 6న పరమపదించారు. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా సమతా దినోత్సవంగా జరుపుతుంది. మన దేశంలో ఆయనను వరించినంతగా మంత్రి పదవులు మరెవరినీ వరించలేదు. ఆయన రాజకీయ జీవితంలో 1967–70 లో ఆహార, వ్యవసాయ శాఖా మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేసి, దేశాన్ని కరువు బారి నుంచి కాపాడారు. 1970–74లో రక్షణ శాఖా మంత్రిగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసి, పాకిస్తాన్ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు.
అవమానాలను విజయాలుగా మలుచుకొని..
జగ్జీవన్ రాం దళితుల కోసం చేసిన కృషి, పోరాటం ఇప్పుడు ఉన్న దళిత ఎంపీ, ఎమ్మెల్యేలు అలవరుచుకోవాలి. 1980లో కృష్ణా జిల్లా ప్రాంతంలో కంచికచర్ల కోటేశు అనే మాదిగను కట్టేసి చంపి బూడిద చేసినప్పుడు ప్రత్యేక విమానంలో వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. నేటి తరం దళిత ప్రజా ప్రతినిధులు ఆయన అంతర్ హృదయాన్ని ఆదర్శంగా తీసుకొని జాతికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయ కుడు. అందుకే ఆయన నేటి తరం, భవిష్యత్త్ తరాలకు కూడా ఆదర్శవంతుడే..
సంపత్ గడ్డం,
78933 03516






