- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకో పైలెట్ల పరిస్థితి దుర్భరం
భారతీయ రైల్వేలలో మొత్తం 10,500 ఎలక్ట్రిక్ ఇంజన్లు, 4500 డీజిల్ ఇంజన్లు.. ఇలా మొత్తం 15,000 ఇంజన్లు ఉన్నాయి.

భారతీయ రైల్వేలలో మొత్తం 10,500 ఎలక్ట్రిక్ ఇంజన్లు, 4500 డీజిల్ ఇంజన్లు.. ఇలా మొత్తం 15,000 ఇంజన్లు ఉన్నాయి. వీటిలో 700 కంటే తక్కువ ఇంజన్లలో ఏసీలు అమర్చబడి ఉన్నాయి. వాటిలో 50 శాతం కంటే తక్కువ ఏసీలు పని చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో, ఇంజన్ క్యాబిన్ లోపల ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ మించిపోవడంతో భారతీయ రైల్వేల లోకో పైలట్ల పని వాతావరణం భరించలేనిదిగా ఉంది. లోకో క్యాబిన్లో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని లోకో పైలట్లు కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. కానీ రైల్వే అధికారులు వారి డిమాండ్ పట్ల పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఏసీ అమర్చిన ఇంజన్లలో నిర్వహణ నిర్వహించడానికి సిబ్బంది లేకపోవడం, అధికారుల నిర్లక్ష వైఖరి కారణంగా ఇంజన్ క్యాబిన్‌లోని ఏసీలు పనిచేయకుండా పోయాయి.
ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతోంది. రైలు ఇంజన్లలో ఉష్ణోగ్రతలు ఈ పరిసర ఉష్ణోగ్రతల కంటే 5° సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉన్నాయని లోకో పైలట్లు పదే పదే అధికారులకు ఎత్తి చూపుతున్నారు. అయినప్పటికీ, ఈ పరిసర ఉష్ణోగ్రతను గుర్తించడానికి ఇంజన్ క్యాబిన్‌లో ఒక్క థర్మా మీటర్ కూడా ఏర్పాటు చేయలేదు. వేసవి కాలంలో 12-16 గంటలు ఇంజిన్లను లోకో పైలట్లు రైలు నడపడంలో చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలో పని చేయడంతో లోకో పైలట్లు పనిపై దృష్టి సారించకపోవడం, మానసికంగా శారీరకంగా త్వరగా అలసిపోతున్నారు. పని ప్రదేశాల్లో తృప్తికరమైన వాతావరణం కల్పించాలని లోకో పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.
- ఆళవందార్ వేణు మాధవ్
86860 51752






