- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌పై టారీఫ్ సడలింపు వెనుక ట్రంప్ లెక్కలు.. ఇది ఊరటేనా?
తాజాగా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం భారత్‌కు నిస్సందేహంగా ఊరట కలిగించే పరిణామం. ప్రపంచ దేశాలపై ఆయన విధిస్తున్న సుంకాల కంటే, ‘మిత్రదేశం’ అని చెప్పుకునే భారత్‌పై విధించిన సుంకాలే ఎక్కువగా ఉన్నాయి.

తాజాగా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం భారత్‌కు నిస్సందేహంగా ఊరట కలిగించే పరిణామం. ప్రపంచ దేశాలపై ఆయన విధిస్తున్న సుంకాల కంటే, ‘మిత్రదేశం’ అని చెప్పుకునే భారత్‌పై విధించిన సుంకాలే ఎక్కువగా ఉన్నాయి. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం, పరస్పర వాణిజ్య విధానాల పేరిట మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతం సుంకాలు విధించడం ద్వారా ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిని 18 శాతానికి తగ్గించడం హర్షణీయమే.. అయితే ఆయన ఈ ప్రకటన చేస్తూ కొన్ని సందేహాలు లేవనెత్తారు.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు చెబుతూనే.. ‘భారత్ మా మాట విని రష్యా నుంచి ఇంధనం కొనడం ఆపేస్తుంది’ అన్న ప్రకటించాడు. నిజానికి అలాంటి నిర్ణయం తీసుకోవాలా? వద్దా అన్నది పూర్తిగా భారత్ సార్వభౌమ హక్కు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వెనుక కేవలం రాజకీయమే కాకుండా, ఆర్థిక ప్రయోజనాలు, శక్తి భద్రత, దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అలా కొనుగోళ్లను నిలిపివేయడం అంటే చిరకాల మిత్రుడిని దూరం చేసుకోవడమే కాకుండా, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా స్వతంత్ర నిర్ణయాధికారాన్ని త్యాగం చేసినట్లూ అవుతుంది. అయితే ప్రస్తుత రష్యా ఇంధన విధానానికే భారత్ కట్టుబడి ఉంటే, ట్రంప్ మళ్లీ ప్రతీకార సుంకాల పల్లవిని అందుకుంటారేమో అన్న సందేహం కూడా లేకపోలేదు. మరోవైపు వెనిజులా ఇంధన విషయంలో కూడా మన తరపున ఆయనే బేరసారాలు ప్రారంభించినట్లు చెప్పడం, అమెరికా తన ప్రయోజనాల దృష్టితో భారత్ నిర్ణయాలను ప్రభావితం చేయాలనుకుంటున్న సంకేతం గా భావించాల్సి వస్తోంది. ఇదంతా చూస్తే, భారత్ ఇటీవలి కాలంలో ఇతర దేశాలతో వరుసగా కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలే ట్రంప్‌ను ఆలోచనకు గురి చేసి ఉండవచ్చన్న భావన కలుగుతుంది. అయినప్పటికీ, ఈ సడలింపు శాశ్వతమా? లేక తాత్కాలిక రాజకీయ లెక్కలలో భాగమా? అన్నది మాత్రం కాలమే తేల్చాలి.
-డా.డి.వి.జి. శంకరరావు,
9440836931






