ఉద్యోగాలపై దాటవేతనా!

by Ravi |   (  Updated:2026-07-18 00:30:22  IST  )

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగ యువత ఆవేదన..

ఉద్యోగాలపై దాటవేతనా!
X

"మన నీళ్లు.. మన నిధులు.. మన కొలువులు" అనే నినాదమే తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన బలమైంది. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు, అభివృద్ధి, స్వయం పాలన సాధ్యమవుతాయని యువత ఆశించింది. రాష్ట్ర ఆకాంక్షతో సాకారమైన నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ కేలెండర్, మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు చేసిన వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న వైఖరికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను పూర్తిచేస్తూ వాటినే తమ విజయంగా చెప్పుకోవడం, గ్రూప్-2, గ్రూప్-3, కానిస్టేబుల్ పోస్టుల పెంపు వంటి డిమాండ్లపై స్పందించడం లేదు. అయితే నిరుద్యోగ సమస్యపై గత ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన కొందరు నాయకులు, మేధావులు ప్రస్తుత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యలపై మౌనం పాటిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాల్లో ప్రభు త్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. హక్కులు అడిగితేనే దక్కుతాయనే చరిత్ర తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠం. అందుకే ఉద్యోగాల కోసం, ఇచ్చిన హామీల అమలు కోసం నిరుద్యోగ యువత మరోసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఐక్యంగా గొంతెత్తాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమ యం లో గతంలో ప్రశ్నించిన వారు, నేడు మౌ‌నంగా ఉన్నవారూ ప్రజల పక్షాన నిలిచి తమ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

-సంపత్ గడ్డం

78933 03516

Next Story